Friday, April 26, 2024

తత్త్వ వేత్త మరియు చెప్పులు కుట్టేవాడు

——————————————————————–

(‘THE PHILOSOPHER AND THE COBBLER ‘ FROM ‘THE WANDERER’ BY KAHLIL GIBRAN)

తెలుగు అనువాదం: డా. సి. బి. చంద్ర మోహన్

    22. సంచారి తత్వాలు

    ————————————————————-

       ఒకసారి ఒక చెప్పులు కుట్టేవాని దుకాణానికి ఒక  తత్త్వ వేత్త  చెప్పులు ధరించి వచ్చాడు. “నా చెప్పులు బాగు చేసి పెట్టు.‘” అని దుకాణ దారుని అడిగాడు.

       ” నేను ఇంకొకరి చెప్పులు  బాగు చేస్తున్నాను.  ఇంకా వరుసలో బాగు చేయాల్సినవి చాలా ఉన్నాయి. మీ చెప్పులు అక్కడ విడిచి అక్కడ ఉన్న చెప్పులు ఈ రోజుకి తొడుక్కోండి. మీ చెప్పుల కోసం రేపు రండి. ” అని చెప్పులు కుట్టే దుకాణ దారు అన్నాడు.

           తత్త్వ వేత్తకు కోపం వచ్చింది. “నావి కాని చెప్పులు నేను ధరించను. ” అన్నాడు.

           అప్పుడు చెప్పులు కుట్టే దుకాణ దారు ఇట్లా అన్నాడు ” అలాగా! మీరు ఇంకొకరి చెప్పులు వేసుకోరా! మీరు నిజంగా తత్త్వ వేత్తలేనా? ఇదే వీధిలో ఇంకో చెప్పులు కుట్టే ఆయన ఉన్నాడు. ఆయన తత్త్వ వేత్తలను బాగా అర్థం చేసుకుంటాడు. మీరు అక్కడికి వెళ్లి మీ చెప్పులు బాగు చేయించుకోండి!”

Also read: కప్పలు

Also read: చట్టాలు మరియు చట్ట నిర్మాణం

Also read: మతి లేని మనిషి

Also read: చట్టాలు

Also read: విగ్రహం

Dr. C. B. Chandra Mohan
Dr. C. B. Chandra Mohan
మనుషుల్నీ, జీవితాల్నీ, సాహిత్యాన్నీ ప్రేమించేవాళ్ళు మంచి రచయితలు కాగలుగుతారు. ఇన్నిమంచి లక్షణాలూ పుష్కలంగా ఉన్న అరుదైన రచయిత డాక్టర్ సీబీ చంద్రమోహన్. మొబైల్ 9440108149

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles