Sunday, April 28, 2024

భక్తి ఉందేమోగాని యోగ్యత ఎక్కడ?

29. శ్రీమాన్ కె ఇ లక్ష్మీనరసింహన్

యోగ్యతల గురించి ఆలోచించకుండా, వైష్ణవ సమాశ్రయాలకు నోచకపోయినా, వారికి కేవలం గోవుల పనిదప్ప  మరే పనీ చేయలేరు.  కనుక మమ్మల్ని ఆదుకున్నదెవరు? కేవలం పరమాత్ముడే, గోపాలుడు మోక్షం ఇస్తారో లేదో తెలియదు. అడిగికోరేది అది మోక్షమే అడుగుతున్నా లేదో కూడా తెలియకపోతే మేమేం చేయాలి. ఇంకా పరమాత్ముడితో బంధం ఉందనీ, సంబంధం మీతోనే ఉందని, మళ్లీ వచ్చే జన్మలో శ్రీకృష్ణునితో ఏదోనైనా మీతో మీవారితో కలిసి ఉండే అవకాశం ఇస్తూ ఉండండి అదే చాలు అంటున్నారు గోదమ్మ గోపికలు.

మాకు పదే పదే పఱై అని ఏదో అడిగినప్పడికీ అదేదో ఒక సాకు మాత్రమే కాని మరోది తెలివిగా అడిగేదేమీ లేదు. ‘నీతో’ నాకు ‘సంబంధం’ ఇదీ మేమడుగుతున్నాం. తిరుప్పావై 28వ, 29వ పాశురంలో కూడా ఇదే ప్రార్థిస్తున్నాను. అదే అవసరం ఉన్నందువల్ల ఏ బంధం ఉన్నాయో కూడా అర్థం కాదు. శరీరంతో ఏదోరకమైన ఉపాధిక సంబంధం ఉందని అనడం లేదు. నిరుపాధిక అంటే ఏ కారణమూ లేకుండా అడగడం లేదు. మీరు స్వయంగా వచ్చి ఏదో ప్రబోధించి ఎవరూ చెప్పలేదు. పరమాత్మా మా దగ్గరికి మేం అంతా స్వచ్ఛందంగా స్వయంగా వచ్చాం అని స్పష్టం చేసారు.

శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తి చిటికిన వేలుతో ఏడు రోజులు, అంత చిన్నవయసులో మొత్తం గోపికలను కొండకింద భయంకర వర్షంలో వారిని కాపాడి ఇంద్రుడు భయానకమైన పిడుగులు ఉరుములు కురిపిస్తూ ఉంటే, ఏమనుకోవాలి. మీరు మామూలు మనిషివా, లేక దేవుడివా, యక్షుడివా, ఇంకెవరైనా రాక్షసుడా ఎవరిది అని ఆశ్చర్యం అనిపించదా. ఈ మహానుభావుడు చిన్న పిల్లవాడని నమ్మగలమా? అని అన్నారట. ఆ మాటకు శ్రీకృష్ణుడు కూడా కొంతగా నొచ్చుకున్నాడు కూడా. రెండు పరిస్థితులలో కూడా గోపికలు చేసిన తప్పులే చేసినవారయినారే.  ఎందుకంటే ఇన్ని కష్టమైన అసాధ్యమైన పనులు చేసినా, దేవుడికన్న తక్కువ అంటారా, లేక ఆ విధంగానే అన్నా, దేవత అనుకున్నా పరమాత్మడని అన్నా తక్కువే కదా. పరమాత్మకు కాక మరొకరు ఈ పని చేయడం సాధ్యమా? అని శ్రీకృష్ణుడు అన్నారట. అయినా అదో క్షణంవరకు ప్రణయకోపమే అనుకోవాలని పరమాత్ముడు పట్టించుకోలేదు కావచ్చు. ఆ విధంగా అనడమే తప్పే, అయినా చిన్నవారిని కనుక సహించి వదిలించండి అనీ కూడా అన్నారట.

నాకు మీరితో కలయికలే నాకిష్టం. ఆ గోవులతో మేకలతో గేదెలతో సహకరించడమంటేనే చాలా ఇష్టం. అంతేకాదు, నన్ను ఎవరైనా గోవిందా అంటే నాకు చాలా ఇష్టం. నన్ను గోవిందా అనకుండా కేశవా నారాయణా మాధవా అనడం కన్నా అంత ఇష్టం కాదు. ‘‘వారం రోజులు నేను ఎంతో కష్టపడి తెచ్చుకున్న బిరుదు గోవిందా అనే మాట. అందుకే గోవిందా అంటే చాలా ఇష్టం’’ అని శ్రీకృష్ణుడు అన్నారట.

తెలతెలవారుఝామున అంటే మునులు రుషులవలె తపస్సులు, అనుష్ఠానం చేసుకుంటే, తెల్లవారుఝామున బాల్యం అవుతుందనీ, మధ్యాహ్నానికి యౌవనం సాయంత్రంఅంటే విశ్రాంత సమయం అనే రకరకాల వివరాల మాటలో రహస్యాలను గోదమ్మ వెల్లడించారు. ఇదే రోజూ జరుగుతూ ఉంటే చిల్లుకుండలో నీరు వలె జీవితం కారిపోతూ ఉంటుంది.

ఏ పరిస్థతులలోనూ భగవంతుడిగురించి ప్రార్థించాల్సిందే కాని పఱైవంటి వస్తువులకోసం కాదు పరమాత్ముని కోసమనే అన్నారు. శ్రీరాముడు అడవులలో నివసించి వెళ్లే దశలో అయోధ్యవాసులు కూడా వెంట ఉంటామన్నారనీ, చాలామంది వచ్చినా తెలతెలవారుఝామునకే రథాన్ని అయోధ్యవాసులు దారి పట్టుకోలేకనే వెళ్లిపోయారు. సుమంత్రుడు వెంటవచ్చి 14ఏళ్లు ఉంటానంటాడనీ, కాని చక్రవర్తి మీరులేక ఆయన ఏ పనీ చేయలేరనీ, కనుక దయచేసి అయోధ్యకు వెళ్లమని కోరుతాడనీ, చివరి క్షణందాకా తన తండ్రికోసం వెళ్లిపోతాడు. సుమంత్రుడు అయోధ్య చేరి తను వనవాసం వెళ్లిపోయాడని అర్థం కాగానే ప్రాణాన్ని వదిలేసిపోయాడు దశరథుడు. అంటూ నీతో ఉంటాను, తీతోనే ఉంటాను, లేకపోతే ఉండను నీతోనే కైంకర్యం చేస్తా, వేరే కోరికలు ఏవీ లేను అని పూర్తిగా శ్రీకృష్ణుని ప్రార్థించడం చాలా గొప్ప అంశాలు. పఱై వంటివి మాకెందుకు. నీతో సంబంధమే కాదు అని 28, 29 పాశురాలలో టిటిడి వక్త శ్రీమాన్ కె ఇ లక్ష్మీనరసింహన్ అని ఇద్దరు తిరుమల శ్రీశ్రీశ్రీ జీయర్ స్వాములు తిరుమల జీయర్ మఠం సన్నధిలో తిరుప్పావై గోష్టి లో వివరించారు.

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles