Friday, April 26, 2024

“నేతి”

ఎరిన్ హాన్సన్ గ్యాలరీ

NOT

                           ——–

( BY ERIN HANSON )

  తెలుగు: డా. సి. బి. చంద్ర మోహన్

                            ———

నువ్వంటే” —

         నీ వయసు — కాదు

         నీ దుస్తుల కొలత — కాదు

         నీ బరువు — కాదు

         నీ కేశాల వర్ణమూ కాదు.

         నీ పేరు  కాదు

         నీ సొట్ట బుగ్గలూ — కాదు

  “నీవంటే” —

          నీవు చదివిన గ్రంధాల సారం

          ‘నీ ‘   భాషణ

           ఉదయం మూలిగే —

          ‘నీ ‘   గొంతు

          నీ ‘  గుప్త హాసం

          ‘నీ ‘   హాసంలోని మాధుర్యం

          ‘నీవు దుఃఖిస్తూ రాల్చిన బాష్ప కణాలు!

            ఒంటరిగా ఉన్నప్పుడు

           ఎలుగెత్తి పాడే గేయాలే   ‘ నువ్వు‘!

    “నువ్వు ” —

            నీవు సందర్శించిన స్థలాలే

            నీ గృహమే

            నీ నమ్మకాలే !

     “నీవంటే ” —

            ‘నీవు ‘   ప్రేమించిన మనుషులే

            ‘నీ ‘  పడక గదిలో ఫోటోలే

             భవిష్యత్తు గురించిన నీ ‘    కలలే !

     ‘నీవు‘ —

             నిజంగా నీవు కాని వాటితో

            నిర్వచింపబడటానికి

            నిశ్చయించుకున్నపుడే —

            ‘నీవు ‘   ” రూపసి ” వని

            మరిచిపోయావు !!

( పై రచయిత్రిని తెలుగు పాఠకులకు పరిచయం చేయడానికి ఈ అనువాదం చేయబడింది)

సోర్స్ : గూగుల్

Also read: వేదన

Also read: మూడు కానుకలు

Also read: 12. ప్రవక్త — పసివాడు

Also read: సౌందర్యం

Also read: ప్రజలే ప్రభువులు

Dr. C. B. Chandra Mohan
Dr. C. B. Chandra Mohan
మనుషుల్నీ, జీవితాల్నీ, సాహిత్యాన్నీ ప్రేమించేవాళ్ళు మంచి రచయితలు కాగలుగుతారు. ఇన్నిమంచి లక్షణాలూ పుష్కలంగా ఉన్న అరుదైన రచయిత డాక్టర్ సీబీ చంద్రమోహన్. మొబైల్ 9440108149

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles