Saturday, April 27, 2024

స్మితా సబర్వాల్‌ 15 లక్షలు చెల్లించాల్సిందే: హైకోర్టు ఆదేశo

సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు హైకోర్టు లో చుక్కెదురైంది. గతంలో తన ఫొటోను అవమానకరంగా ప్రచురించిన ‘అవుట్‌లుక్’ మ్యాగజైన్‌ పై స్మితా సబర్వాల్‌కు తీవ్ర మనస్తాపం చెందింది. కేసీఆర్ ప్రభుత్వం కూడా

స్మితా సబర్వాల్‌ కు అండగా నిలిచింది. పరువునష్టం దావా వేసేందుకు న్యాయ సహకారాన్ని ప్రభుత్వం అందించింది.

‘అవుట్‌లుక్’ మ్యాగజైన్‌ ఫ్యాషన్ షో వెళ్ళిన ఫోటోలు ప్రకటించిన నేపథ్యంలో  తన వ్యక్తిగత ఇమేజ్ ను అవుట్ లుక్ మ్యాగజిన్ కించపరిచిందని పరువు నష్టం దావా వేసింది. కోర్టు ఫీజుల కోసం ప్రభుత్వం ఆమెకు15 లక్షలు మంజూరు చేసింది. దీనిపై అవుట్‌లుక్ కోర్టులో పిటిషన్ వేసింది. తాజాగా విచారణ చేపట్టిన ధర్మాసనం రూ.15 లక్షలు ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలని స్మితా సబర్వాల్‌ను ఆదేశించింది.

90 రోజుల్లో చెల్లించకపోతే స్మితాసబర్వాల్ నుంచి వసూలు చేయాలని ఆదేశించింది హైకోర్టు. ఫ్యాషన్ షో స్మితా సబర్వాల్ అధికార విధులు కావని అక్షింతలు వేసింది. ప్రైవేట్ వ్యక్తి ప్రైవేట్ సంస్థపై కేసు వేస్తే ప్రజా ప్రయోజనం కాదని ఘాటుగా వ్యాఖ్యానించింది. అంతేకాకుండా ప్రభుత్వ తీరును కూడా తప్పు పట్టింది. పరువు నష్టం దావాకు ప్రభుత్వం ఎందుకు న్యాయ సలహా ఇచ్చిందని విస్మయం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్ణయం సమంజసం కాదని ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకమని హైకోర్టు స్పష్టం చేసింది. అంతే కాకుండా ప్రభుత్వ విధాన నిర్ణయాలు సహేతుకంగా లేకుంటే కోర్టులు సమీక్షించవచ్చుని తెలిపింది

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles