Friday, February 3, 2023

న్యాయవాద దంపతుల హత్య కేసులో నిందితుడు వెల్ది వసంత రావు అరెస్ట్

  • డిప్యూటీ డిఈఈ గా పనిచేసిన వసంతరావు

 హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య కేసులో మరో నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటివరకు ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేయగా తాజాగా వెల్ది వసంతరావును అరెస్టు చేసినట్లు  పోలీసులు తెలపారు. వెల్ది వసంతరావు  ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో డిప్యూటీ డిఈఈ  గా కాళేశ్వరం ప్రాజెక్టు లో పని చేసి 2018 సంవత్సరంలో రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం కరీంనగర్ లోని నివాసముంటున్నాడు. స్వస్థలం అయిన గుంజపడుగు గ్రామంలో అనేక కార్యక్రమాలలో పాల్గొంటున్న సమయంలో  కుంట శ్రీను తో పరిచయం ఏర్పడింది. కుంట  శ్రీను  గుంజపడుగు గ్రామంలో తాను నిర్మిస్తున్న పెద్దమ్మ గుడి మరియు అతని ఇల్లు  అక్రమనిర్మాణo అని గ్రామపంచాయతీ వాళ్ళ చేత గట్టు వామన్ రావు నోటీసులు ఇప్పించాడు అని వెల్ది వసంత రావు తో చెప్పుకొని బాధ పడేవాడు

గుంజపడుగు  గ్రామంలోని బ్రాహ్మణ కుటుంబాలు అందరూ కలిసి సెప్టెంబరు 24 2020 న వెల్ది వసంత రావు ని  బ్రాహ్మణ కుల సంఘానికి అధ్యక్షుని గా ఏకగ్రీవంగా  ఎన్నుకున్నారు. అప్పటి నుండి గుంజపడుగు  గ్రామానికి పని మీద బ్రహ్మణ కులస్తులు ఎవరైనా వచ్చినట్లయితే వారు ఉండటానికి వసతి ని ఏర్పాటు చేసి దానిని చూసుకోవడానికి తన గ్రామస్తుడైన ప్రదీప్ కుమార్ ని ఇoచార్జ్ గా నియమించాడు.  జనవరి 4 తారీఖు నాడు బ్రాహ్మణ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ని  ఆవిష్కరించడానికి పెద్దపెల్లి జడ్పీ చైర్మన్ ని మరియు మంథని ఎమ్మెల్యే ని ఆహ్వానించడం జరిగింది.కానీ ఈ కార్యక్రమానికి  ఎమ్మెల్యే హాజరు కాలేదు.   ఆ తరువాత  గట్టు వామన్ రావు వసంత రావు కి  ఫోన్ చేసి కుల సంఘం బిల్డింగ్ లో ఉంటున్న ప్రదీప్ ప్రవర్తన సరిగా లేదని  ఆ భవనంలో మద్యం సేవించడం, సిగరెట్లు కాల్చడం లాంటివి చేస్తున్నాడని అందువల్ల అతనిని ఆ పనిలో నుండి తీసివేయాలని చెప్పాడు.

Also Read: న్యాయవాది దంపతుల హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు అనవసరం: హైకోర్టు

 జనవరి 24 తేది  నాడు బ్రాహ్మణ సంఘం వారు జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకున్నారు దానికి సుమారు 40 మంది హాజరయ్యారు. ఆ రోజు వామన్ రావు అతని అల్లుడు శ్రీనాథ్ ఫోన్ కు వీడియో కాల్ చేసి తనతో కొత్త వాట్సప్ గ్రూప్ ఎందుకు పెట్టినారు .సంఘం క్యాలెండర్ లో నా అనుమతి లేకుండా నా ఫోటో ఎలా పెట్టారు అని మీ అందరిపైన కోర్టు లో కేసులు వేస్తానని బెదిరించాడు.  

 జనవరి 26, 2021 న జెండా వందనం అయిపోయిన తర్వాత బ్రాహ్మణ సంఘం భవనం ఇంచార్జి అయిన రేగళ్ళ ప్రదీప్ కుమార్ ని గుంజపడుగు గ్రామస్తులైన గట్టు కిషన్ రావు, గట్టు ఇంద్ర శేఖర్ బుడంగారి శ్రీనాథ్, వెల్ది సుధాకర్ కలిసి దాడికి పాల్పడ్డారు. వెల్ది వసంత రావు ఈ విషయాన్ని బ్రాహ్మణ సంఘం సెక్రటరీ అయినా గట్టు విజయ్ కుమార్ ని పిలిచి ప్రదీప్ కుమార్ ని మంథని పోలీస్ స్టేషన్ కి  తీసుకెళ్ళి గట్టు వామన రావు  తండ్రి అయిన కిషన్ రావు, చంద్రశేఖరరావు, బుడంగారి శ్రీనాథ్ మరియు వెల్ది సుధాకర్ లపై మంథని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయమని చెప్పడం జరిగింది . ఇది మనసులో పెట్టుకొని గట్టు వామన్ రావు, వెల్ది వసంత్ రావు పై జనవరి 29 రోజున  సీపీ గారికి కిషన్ రావు, చంద్రశేఖరరావు చేత పిర్యాదు చేయడం జరిగింది.

Also Read: హత్యకేసులలో నిందితునికి జీవితఖైదు

జనవరి 29, 2021న వెల్ది వసంత రావు, అతని కుమారుడు  అవినీతి బాగోతం బయట పెడతాం ఏసీబీ వారికి ఫిర్యాదు చేసి వారిపై కేసులు పెడతామని గట్టు వామన్ రావు వాట్సాప్ గ్రూపులో సందేశాలు పెట్టడం జరిగింది.  ఈ సందేశం చుసిన తర్వాత వెల్ది వసంత రావు కుంట శ్రీనుకి ఆ రోజే పలుమార్లు ఫోన్ చేసి వామన్ రావు నన్ను మానసికంగా బాగా ఇబ్బందులకు గురి  చేస్తున్నాడు అతన్ని ఏదైనా చేయాలి అని కుంట శ్రీను ని కోరడం జరిగింది. అప్పుడు కుంట శ్రీను వెల్ది వసంతరావు తో వామన్ రావు మనల్ని ఏవిధంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడో  మనం కూడా అతన్ని ఇబ్బందులు పెడదామని చెప్పి బ్రహ్మణ సంఘం తరుపున సహకారాన్ని కోరాడు.  దానికి సంబంధించి రామస్వామి గోపాలస్వామి గుడి పాత కమిటి చైర్మన్ గట్టు ఇంద్ర శేఖర్ ని తొలగించి కొత్త కమిటి ఎన్నుకొవటానికి సహకారాన్ని అందించాలని వసంత రావు ని కుంట శ్రీను కోరాడు

ఫిబ్రవరి 7, 2021న రామ స్వామి గోపాల స్వామి పాత కమిటీ రద్దు చేస్తూ నూతన కమిటీ ఏర్పాటు లో వెల్ది వసంతరావు ప్రధాన పాత్ర పోషించాడని గట్టు వామన్ రావు వెల్ది వసంతరావు పై కసి పెంచుకున్నాడు.  అదే రోజు వామన్ రావు వెల్ది వసంత రావు బంధువు అయిన డాక్టర్ రామ్ మోహన్ రావు ని గట్టు వామన్ రావు హైదరాబాద్ లోని తన ఇంటికి పిలిపించుకుని వసంతరావు ను చంపేస్తానని బెదిరించాడు. ఈ  విషయాన్ని మోహన్ రావు వెల్ది వసంత రావు  కొడుకైన రామకృష్ణ కార్తిక్ ఫోన్ చేసి చెప్పగా తన కొడుకు ద్వారా విషయం తెలుసుకొని వసంత రావు, కుంట శ్రీను కి ఫోన్ చేసి బాధపడ్డాడు.

 వామన్ రావుని ఏదైనా చేసి లేపెయ్యేలని  కుంట శ్రీనును కోరగా దానికి కుంట శ్రీను వామన్ రావు ని అవకాశం చూసి లేపేస్తా దానికి కొంతమందితో ప్లాన్ చేశానని కుంట శ్రీను చెప్పినట్లు తెలుస్తోంది. వామన్ రావు పీడవిరగాడయ్యేలా చేస్తే దానికి అన్ని రకాల సహాయం చేస్తానని వసంత రావు, కుంట శ్రీను ను ప్రోత్సహించాడు. ఈ విధంగా వామన్ రావు దంపతుల హత్య కేసులో వెల్ది వసంత రావు భాగస్వామి అయ్యాడు. గట్టు వామనరావు మరియు పివి నాగమణి దంపతుల హత్య కేసులో కుంట శ్రీను ని ప్రోత్సహించిన వెల్ది వసంత రావు  ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ అనంతరం అరెస్ట్ చేయడం జరిగింది.

Also Read: అప్రూవల్ లేకుండా పాస్ పుస్తకాల జారీ

Muneer MD
Special Correspondent from Mancherial

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles