Sunday, April 28, 2024

సిద్ధిపేట సోదాలపై కిషన్ రెడ్డి సీరియస్, రిపోర్ట్ ఇవ్వాలని డీజేపీకి ఆదేశం

హైదరాబాద్ : దుబ్బాక ఉపఎన్నికతో సిద్ధిపేటలో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ అభ్యర్థి బంధువుల ఇంట్లో జరిగిన సోదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. లక్షల రూపాయల డబ్బులు పోలీసులు స్వాధీనం చేసుకోవడం మరింత వేడి రాజేసింది. సిద్ధిపేటలో నెలకొన్న టెన్షన్‌తో పలువురు బీజేపీ నేతలు అక్కడకు చేరుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకొని అరెస్టులు చేశారు. దీంతో కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి పోలీసులు, ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. దుబ్బాక ఉపఎన్నికలో రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు.

సిద్ధిపేటలో జరిగిన ఘటనలను కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల అధికారులకు చెబుతామని కిషన్ రెడ్డి అన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేలా చేస్తామన్నారు. సిద్ధిపేటలోని దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు మామ ఇంటికి గత రాత్రి కిషన్‌రెడ్డి వెళ్లారు. అక్కడ పరిస్థితిని సమీక్షించి, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పోలీసులు సోదాలు చేసిన గదిని పరిశీలించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు జరిగిన ఘటనను కిషన్ రెడ్డికి వివరించారు. సెర్చ్‌ వారెంట్‌ లేకుండానే సివిల్‌ డ్రెస్సుల్లో పోలీసులు రఘునందన్‌రావు బంధువుల ఇంట్లో తనిఖీలు చేశారన్నారు.

సిద్దిపేటలో సోదాలపైనా, అనంతరం బీజేపీ నాయకుల అరెస్టుపైనా తనకు నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డీజీపీ)ని ఆదేశించారు. 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles