Sunday, April 28, 2024

యువనేతల రాజకీయ యాత్రలు ఫలించేనా?

డా. యం. సురేష్ బాబు,  అధ్యక్షులు, ప్రజాసైన్స్ వేదిక

దేశవ్యాప్తంగా ప్రజలను  ఉత్తేజం చేయడమే లక్ష్యంగా రాహుల్‌గాంధీ  మణిపూర్ నుండి ముంబయి వరకు  భారత్‌ న్యాయ్  యాత్ర   జనవరి 14 నుంచి ప్రారంభించారు .   సామాజిక సామరస్యాన్ని బలోపేతం చేయడం, సామాజిక న్యాయం   రాజ్యాంగ విలువలు బలోపేతం చేయడానికి కాంగ్రెస్ భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టి  దేశ ప్రజల మన్ననలు పొందింది. ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజల బ్రతుకులు చిన్నాభిన్నమై పోయాయి.  క్లిష్ట పరిస్థితుల్లో దేశ  ప్రజల భద్రతకు భరోసా లేకుండా పోయింది.  లౌకిక ప్రజాతంత్ర వాదులు, ప్రజా సంఘాలు స్వచ్చందంగా పాల్గొన్నారు. ‘న్యాయ్ కా హక్ – మిల్నే తక్’ నినాదంతో ఇప్పటికే  మణిపూర్, మిజోరాం దాటి  జైత్ర యాత్ర అస్సాం మీదుగా పశ్చిమబెంగాల్ లో ప్రవేశిస్తున్నది.  భారత్ జోడో యాత్ర సందర్భంగా, ఇతర  పార్టీలకు చెందిన పలువురు నాయకులు రాహుల్  గాంధీతో కలిసి వచ్చారు.  వచ్చే లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని యాత్ర ప్రభావితం చేస్తుంది.  కొన్ని కీలక మార్పులతో. పేరు మార్చబడిన భారత్ న్యాయ్ యాత్ర ఎక్కువ దూరాన్ని కవర్ చేస్తుంది. మరిన్ని రాష్ట్రాలను చుట్టుముడుతుంది. అసెంబ్లీ ఎన్నికలలో ఇటీవలి పరాజయాల తరువాత, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలలో బిజెపిని ఓడించిన తరువాత పొందిన మానసిక ప్రయోజనాన్ని కాంగ్రెస్ కోల్పోతుందని గ్రహించింది. పార్టీ కార్యకర్తల్లో నైతిక స్థైర్యం తక్కువగా ఉందని, 2024లో గెలవడం సులభం కాదన్న  భావన పార్టీలో నెలకొంది. మారథాన్ యాత్ర లక్ష్యం పార్టీకి   అవసరమైన ఆక్సిజన్‌ను అందించడం,  క్యాడర్‌ను చురుకుగా ఉంచడం.   

రాహుల్ గాంధీ బలోపేతం

ఈ యాత్ర  రాహుల్ గాంధీ చిత్రాన్ని రీబూట్ చేస్తుంది.  రాహుల్ గాంధీ అత్యంత విజయవంతమైన ఔట్రీచ్‌గా ఆవిర్భవించింది. బీజేపీ ఎగతాళి చేసిన ‘యువరాజ్’ వ్యక్తిత్వం నుండి అతని ఇమేజ్‌ని కష్టపడి పనిచేసే, సరళమైన అందుబాటులో ఉండే రాజకీయవేత్తగా మార్చింది. గత యాత్ర  నుంచి గణనీయమైన పాఠాలు నేర్చుకొని ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని తిరుగులేని నాయకుడిగా రూపాంతరం చెందారు.   భారతదేశం అంతటా ఐక్యతా సందేశాన్ని వ్యాప్తి చేయడానికి, స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మొదటి పాన్-ఇండియన్ మార్చ్ ను గుర్తించడానికి ఉద్దేశించిన ప్రతిష్టాత్మక యాత్ర.  లౌకిక ప్రజాతంత్ర వాదులు  మాత్రమే భారతదేశాన్ని రక్షించగలరు. మతోన్మాద  బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లను గద్దె దింపడానికి, అవకాశవాద పార్టీలను ఎండగట్టడానికి ఈ యాత్ర ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ యాత్రకు ప్రధాన భూమిక పోషించినా  ప్రజా సంఘాల నేతలు స్వచ్చందంగా పాల్గొంటున్నారు. పౌర సమాజ సంస్థ నాయకులు,  కవులు, కళాకారులు,  మేధావులు, మూడు వందలకు  పైగా పౌర సమాజ సంస్థలు స్వచ్చంధ సంస్థలు ఇందులో భాగస్వామ్యం కావడం ఆలాగే  మీడియా ప్రతినిధులు, రిటైర్డ్  ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, శాస్త్రవేత్తలు  ఈ యాత్రలో పాల్గొంటున్నారు.  ఇందులో భాగంగా దేశంలోని 14 రాష్ట్రాలు, 85 జిల్లాల గుండా ఏకంగా 6200 కిలోమీటర్ల పొడవునా ఈ యాత్ర దిగ్విజయంగా కొనసాగనుంది. ‘కలిసి నడుద్దాం, దేశాన్ని కలిపి ఉంచుదాం (మిలే కదమ్‌.. జుడే వతన్‌)’  నినాదంతో సుదీర్ఘంగా 70 రోజుల పాటు ఈ ప్రజా ఉద్యమం ముందుకు కొనసాగుతుంది.  దేశప్రజలను ఏకం చేయడమే లక్ష్యంగా  భారత్‌ న్యాయ్  యాత్ర కొనసాగుతుందని అన్నారు రాహుల్‌గాంధీ.  నిరుద్యోగం, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల,  రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చి, ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడం, రాజకీయ నాయకులపై ఇడి, సీబీఐ కేసులు పెట్టడం,  ఉపాధి అవకాశాలు నీరుగార్చడం,  కవులు కళాకారులు మేధావులపై దేశ ద్రోహ కేసులు బనాయించడం, మత విద్వేషాలను రెచ్చగొట్టడం,  విద్య వైద్యం వ్యవసాయం నైతికత మానవ విలువలు మహిళా సాధికారత దళితులు, మైనార్టీలు  అన్ని రంగాలు పతనం చెంది నీచ స్థితికి దిగజారాయి.

ఇలాంటి సందర్భంలో దేశంలో  ఏకధృవ సామాజిక పోకడ, దేశంలో నెలకొన్న ఆర్థిక అసమానతలు, విద్వేషాలను రూపుమాపేందుకు దేశ ప్రజలు నడుం బిగించాలి. కులమతాలకు అతీతంగా దేశ ప్రజానీకం పాదయాత్రలో కదంతొక్కనున్నారు. పాక్షిక పాదయాత్రగా కొనసాగే ఈ కార్యక్రమాన్ని స్వాతంత్య్ర భారతంలో అతి పెద్ద ప్రజాస్వామ్య ఉద్యమం స్థాయికి తీసుకెళ్లాలని పార్టీ భావిస్తోంది. 

షర్మిల రాజకీయ ప్రస్థానం

పన్నెండేళ్ల కిందట తన అన్న జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్లడంతో ఆయన స్థాపించిన పార్టీ భారాన్ని మోయడానికి రాజకీయాల్లోకి వచ్చిన షర్మిల, ఆ తర్వాత సొంతంగా పార్టీ స్థాపించి చేసిన రాజకీయ ప్రయాణంలో ఇదొక కొత్త మలుపు.  కాంగ్రెస్ విల్లు నుంచి జగన్‌‌పైకి దూసుకెళ్లే బాణం కాబోతున్నారా అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. వై.ఎస్. రాజశేఖర రెడ్డి బతికి ఉన్నప్పుడే జగన్ రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ, షర్మిల మాత్రం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఆర్థిక అవకతవకలకు సంబంధించిన కేసుల్లో వై.ఎస్.జగన్ జైలుకు వెళ్లాల్సి వచ్చినప్పుడు, ఆయన స్థాపించిన వైయస్సార్ కాంగ్రెస్‌ను జనంలోకి తీసుకెళ్లే బాధ్యతను తీసుకున్నారు షర్మిల. ఉప ఎన్నికల్లో  15 మంది ఎమ్మెల్యేలు గెలిపించడంలో షర్మిల ప్రధాన పాత్ర పోషించారు.  తెలంగాణలో  పార్టీ స్థాపించి  దాదాపు  మూడు వేల కిలోమీటర్లు పైగా  పాదయాత్ర చేసిన  ఘనత షర్మిలకు దక్కుతుంది.  ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి  పార్టీ  పునర్వైభవం  తీసుకు రావడానికి జిల్లాల యాత్రలో  మంచి స్పందన వస్తోంది.  అలాగే  తన ప్రసంగాలలో  సామాజిక సమగ్రత, మతోన్మాదం, సంక్షేమం, నీళ్లు, తాగు నీటి సాగు నీటి  సమస్యల గురించి అలాగే  ఆంధ్రకు తలమానికంగా ఉన్న  విశాఖ ఉక్కు గురించి, అదానీకి  అప్పనంగా కేటాయించిన  పోర్టుల గురించి ప్రస్తావించారు.   ఇప్పటికే  వైఎస్ఆర్ సీపీ  ఎమ్మెల్యేలు  ద్వితీయ శ్రేణి  నాయకులు కాంగ్రెస్ కలవడానికి సిద్ధంగా ఉన్నారు.  ఆంధ్రప్రదేశ్ ప్రజలకు  ప్రత్యామ్న్యాయం  దొరికిందని  తటస్థులు భావిస్తున్నారు.  మతోన్మాద ఫాసిజం  తుదముట్టించాలంటే కాంగ్రెస్ బలపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పౌర ప్రజా సంఘాలు భావిస్తున్నాయి.

Dr. M. Suresh Babu
Dr. M. Suresh Babu
Dr. M. Suresh Babu has been a Professor, Dean and Principal in various engineering colleges and institutions in Hyderabad and Anantapur. His approach to teaching is “For the student, by the student and to the student.” He is associated with several Civil Society Organizations like Praja Science Vedika and Election Watch.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles