Saturday, April 27, 2024

చిరు ధాన్యాల  సతీష్ కు నివాళి

దేశంలో ‘చిరు ధాన్యాల మనిషి’ గా పేరుతెచ్చుకున్న, డెక్కన్ డెవలప్ మెంట్ సొసైటీ వ్యవస్థాపకుడు, పి. వి.సతీష్ ఆదివారం ఉదయం మరణించాడని తెలిసి విచారం వేసింది.

దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం మేదక్ జిల్లాలోని జహీరాబాద్ మండలంలో డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ కొందరు ఆలోచనా పరుల  ప్రోద్బలంతో ప్రారంభం అయింది.

ఆ వ్యక్తుల్లో కేంద్రంలా ఉన్న సతీష్ కృషి వల్ల వెనుక బడ్డ ప్రాంతంలో ఉన్న జహీరాబాద్ గ్రామాలు ప్రపంచ వ్యవసాయ రంగ నిపుణుల దృష్టిని ఆకర్షించాయి. 75 గ్రామాల్లో ఏర్పరచిన సంఘాలు, ముఖ్యంగా దళిత, పేద, బలహీన వర్గాలకు చెందిన వ్యవసాయమే జీవనం గా కొనసాగిస్తున్న మహిళా సభ్యులు అద్భుతాలు సృష్టించారు.

మహిళా సాధికారత, సహకార సంఘాల వ్యవస్థ అవసరం గురించి, ప్రభుత్వ అధి కార్లు, కొందరు సామాజిక చింతనా పరులు  ఊక దంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం మనం చూస్తాం.

కానీ సతీష్ గారి ఆలోచన, నిబద్దత వాళ్ల జీవితాలు మార్చుకోవాలి అని అ నుకున్న  మహిళల సంకల్పం వల్ల సాధికారత, సహకారం, వాటి ఫలితం ఎట్లా ఉంటుందో ప్రత్యక్షం గా చూపెట్టారు.

కరువు పీడిత, వెనుక బడ్డ, నిస్సారమైన ఆ గ్రామాలలోని భూములతో ఎట్లా మైత్రి చేసి, ఎట్లా జీవనోపాధి కూడగట్టుకోవచ్చునో ఈ సంఘాల సభ్యులు చూపెట్టారు.

డీ.డీ.ఎస్ సంస్థ వ్యవసాయరంగంలో విన్నూత్న ప్రయోగాలు చేసింది.

సాంప్రదాయకంగా ఎక్కువ నీరు అవసరం ఉండే పంటల నుండి వర్షాధారంతో ఎరువులు లేకుండా తక్కువ పెట్టుబడితో పండే తృణ ధాన్యాల వైపు దృష్టి పెట్టి విజయం సాధించింది. ఇప్పుడు ఆరోగ్యానికి తృణ ధాన్యాల ఆవశ్యకత గురించి, వాటిలో ఉండే పోషకా ల గురించి పుంఖాను పుంకాలు గా వ్యాసాలు రాస్తున్నారు. ఉపన్యాసాలు ఇస్తున్నారు. కానీ జహీరాబాద్ ప్రాంతం లోని గ్రామాల లోనీ సంఘాలు మూడు దశాబ్దాల క్రితమే ఈ విషయాలు ప్రాక్టి కల్ గా చూపెట్టారు. ఆ ప్రాంతం లోని అర్జున్ నాయక్ తండా చిరు ధాన్యాలకు చిరునామా అయింది.

ఆక్కడ రైతుల విత్తనాల బ్యాంకు, జీన్ బ్యాంక్, సహకార రుణాల బ్యాంక్, బాల వాడీలు, వాల్లే ఏర్పరచుకున్న మార్కెట్ వ్యవస్థ, పశు సంపద వ్యవస్త సతీష్ గారి దృఢమైన నిబద్దత, మహిళల సంకల్పానికి చిహ్నాలుగా మనకు కనపడతాయి.

ప్రజల అనుభవంలో ఉన్న సంప్రదాయక విజ్ఞానాన్ని వ్యవసాయ రంగంలో, అరోగ్య రక్షణలో,  ఆధునిక విజ్ఞానం తో జత పరచి అక్కడ చూపెట్టారు.

పనికి రావని తీసి వేసే కలుపు మొక్కల్లో ఉండే పౌష్టిక విలువలను గుర్తించి వాటితో కూరలు వండి తినిపించారు ఈ మహిళా సంఘం సభ్యులు. పర్యావరణం, భూసారాన్ని రక్షించుకోవడం, రసాయన ఎరువులను దూరం గా పెట్టడం లో మెళకువలు నేర్చుకున్నారు. ఆధునిక వ్యవసాయానికి ప్రత్యామ్నాయం గా ప్రకృతి తో మమేకం అయే  పర్మా కల్చర్ పద్దతి నీ అమలు పరచి చూపెట్టారు.

వ్యవసాయం ఒక జీవన విధానం గానే కాకుండా ఒక రంగుల పండుగగా రంగురంగుల బండ్లలో వాళ్ల ఉత్పత్తులు, వాటితో వాళ్ళు వండే వంటలు, తయారు చేసే చిరు ఆహారాలతో  ఒక జాతర తీసి, ప్రతి ఫిబ్రవరి మాసం లో ఊర్లన్ని తిరిగి ప్రదర్శనలు నిర్వహిస్తారు.

ఇంకా ఈ సంఘాలు చేసిన చేస్తున్న పనులు చాలా ఉన్నాయి. ఈ పనులకు ఈ సంస్థ అందుకున్న అంతర్జాతీయ అవార్డ్ లే తార్కాణం.

అయితే ఆ ప్రాంతంలో ప్రభుత్వం తలపెట్టిన జాతీయ పరిశ్రమల కేంద్రం ఇంత బాగా అర్థవంతంగా అభివృద్ధి చేసుకున్న గ్రామాలను విధ్వంసం చేయ బోతుందన్న నిజం బాధ పెడుతుంది. సతీష్ గారు కూడా ఈ జరుగబోయే విధ్వంసం గురించి ఆందోళన ప్రభావితం గా చేపట్ట లేక పోయారన్న  అసంతృప్తి మా లాంటి వాళ్లకు ఉంది.

ఏ మైనప్పటికి సతీష్ గారు చేసిన ఈ కృషి  ఫలితాలను  నిలుపుకోవడం మాత్రమే కాక ఆ వ్యవస్థలను ఇంకా పటిష్టం చేయ వల్సి ఉంది.

మిత్రుడు పి.వి.సతీష్ కు సలాం.

ఎస్. జీవన్ కుమార్

మానవ హక్కుల కార్య కర్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles