Friday, April 26, 2024

పోడు సమస్య పరిష్కారానికి చర్యలు, అధికారుల చర్చలు

  • నవంబర్ 8 నుంచి దరఖాస్తుల స్వీకరణ
  • అటవీ హక్కుల కమిటీల ఏర్పాటుకు నిర్ణయం

హైదరాబాద్ : రాష్ట్రంలో పోడు భూముల సమస్య పరిష్కారానికి గాను నవంబర్  8 వ తేదీ నుండి దరఖాస్తులు స్వీకరించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కె..సి.ఆర్ ఆదేశాల మేరకు దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, విధి విధానాల రూపొందించే విషయాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేడు అటవీ, రెవిన్యూ ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రిన్సిపల్ సీసీఎఫ్ ఆర్.శోభ, రెవిన్యూ శాఖ కార్యదర్శి శేషాద్రి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా, ముఖ్యమంత్రి కార్యాలయం ఓఎస్ డి ప్రియాంకా వర్గీస్ తదితర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా సి.ఎస్. సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, పోడు భూములపై దరఖాస్తులు స్వీకరించే ముందు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ప్రజా ప్రతినిధులు, ఇతర సభ్యులతో అటవీ హక్కుల కమిటీలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ కమిటీలచే  ఆయా గ్రామాలలో దరఖాస్తుల స్వీకరణ, అందులో పొందు పరిచే అంశాలు ఇతర అంశాలపై చైతన్య, అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు.  ముందు ముందు అటవీ భూముల ఆక్రమణ ఉండదని గ్రామస్తులు అంగీకరించే విధంగా చైతన్య పర్చాలని స్పష్టం చేశారు. డివిజన్, జిల్లా కమిటీలను ఏర్పాటు చేసి కలెక్టర్ల ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అన్నారు.

పోడు భూముల సమస్య అధికంగా  ఉన్న జిల్లాలలో ప్రత్యేకాధికారులను నియమించాలని సోమేశ్ కుమార్ సూచించారు. ఈ మొత్తం ప్రక్రియను పారదర్శకంగా, ఏమాత్రం వివాదాలకు తావు  లేకుండా నిర్వహించాలని స్పష్టం చేశారు. విస్తీర్ణం అధికంగా ఉన్న ప్రాంతాలకు సీనియర్ అటవీ శాఖ అధికారులను నియమించాలని అన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ పీసీసిఎఫ్ లు స్వర్గం శ్రీనివాస్, ఎం.సి పరగెన్ లు కూడా పాల్గొన్నారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles