Friday, April 26, 2024

యువక్రికెటర్లకు నజరానాల వెల్లువ

ఆస్ట్ర్రేలియాతో ముగిసిన నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లో అంచనాలకు మించి రాణించిన ఆరుగురు యువక్రికెటర్లకు నజరానాలు వెల్లువెత్తుతున్నాయి. కంగారూ  కంచుకోట, విజయాల అడ్డా బ్రిస్బేన్ గబ్బా స్టేడియంలో 33 ఏళ్ల తర్వాత విజయం సాధించిన తొలిజట్టుగా భారత్ నిలవడంలో నవతరం ఆటగాళ్లు శుభ్ మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, నటరాజన్, శార్దూల్ ఠాకూర్, నవదీప్ సైనీ, మహ్మద్ సిరాజ్ ప్రధానపాత్ర వహించారు.కంగారూజట్టును కంగుతినిపించడంలో వయసుకు మించిన పరిణతి ప్రదర్శించారు.

 ఇటు ప్రశంసలు- అటు కానుకలు

ఐపీఎల్ కాంట్రాక్టుల ద్వారా ఇప్పటికే కోట్లరూపాయలు ఆర్జిస్తున్న యువక్రికెటర్లతోపాటు జట్టులోని సభ్యులందరి కోసం బీసీసీఐ 5 కోట్ల రూపాయలు బోనస్ గా ప్రకటించి. కొద్దిరోజులైనా కాకముందే ఊహించని బహుమతి వారిని వరించింది. ప్రధాని నరేంద్ర మోడీ, ప్రముఖక్రికెటర్లు సచిన్,సెహ్వాగ్,బేడీ, గవాస్కర్ క్రికెట్ హీరోలను ప్రశంసలతో ముంచెత్తారు. అంతే్కాదు ఆనంద్ మ‌హేంద్ర సైతం వ‌రుస ట్వీట్ల‌లో భారతయువ ఆట‌గాళ్లను తెగ మెచ్చుకున్నారు. భ‌విష్య‌త్తు త‌రాల వారికి ఆద‌ర్శంగా నిలిచార‌ని కీర్తించారు. అద్భుతం సాధించే దిశ‌లో ఉద్భ‌వించిన నిజ‌మైన క‌థ‌ల‌ని, ఆ ఆట‌గాళ్లు అంద‌రి జీవితాల్లోనూ ప్రేర‌ణ‌గా నిలిచార‌ని ప్రస్తుతించారు.

మహేంద్రా నజరానా….

క్రీడలు ఏవైనా ప్రతిభావంతులైన యువక్రీడాకారులను ప్రోత్సహించడంలో మహేంద్ర గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహేంద్ర తర్వాతే ఎవరైనా. ఆస్ట్ర్రేలియా టూర్ లో టెస్ట్‌ అరంగేట్రం చేసిన యువఆటగాళ్లతో పాటు శార్దూల్ ఠాకూర్ కు సైతం మహేంద్ర ఎస్‌యూవీ వాహనాలు కానుకగా ఇస్తానని, అది కూడా తన వ్యక్తిగత ఖాతా నుంచి అందిస్తానని ఆనంద్‌ మహేంద్ర ట్వీట్టర్ ద్వారా ప్రకటించారు. హైదరాబాద్‌ ఫాస్ట్ బౌలర్  మహ్మద్‌ సిరాజ్‌, పంజాబ్ ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌, ఢిల్లీ ఫాస్ట్ బౌలర్ నవ్‌దీప్‌ సైనీ, తమిళనాడు ఆల్ రౌండర్ వాషింగ్టన్‌ సుందర్‌, సీమర్ నటరాజన్‌లకు తమ కంపెనీకి చెందిన థార్‌ ఎస్‌యూవీ కార్లను బహుమతిగా ఇస్తానని తెలిపారు.

ఈ ఆరుగురు యువక్రికెటర్లు తమతమ జీవితాల్లో ఆటుపోట్లను ఎదుర్కొని రాటుదేలడం ద్వారా ఈ స్థాయికి చేరుకొన్నారని, అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం ద్వారా నవతరం భారతీయులకు ఆదర్శంగా నిలిచారని ఆనంద్‌ మహేంద్ర కొనియాడారు. కొత్త థార్ ఎస్‌యూవీల‌ను త‌న స్వంత ఖ‌ర్చుల కింద ఇస్తున్న‌ట్లు చెప్పారు. ఇది కంపెనీ ఖ‌ర్చు కింద‌కు రాద‌న్నారు. యువ‌తలో విశ్వాసం నింపిన ఆట‌గాళ్ల‌కు బహుమతి ఇవ్వడాన్ని మించిన ఆనందం మరొకటి లేదని అన్నారు. టెస్ట్ సిరీస్‌లో భాగంగా మూడుటెస్టులు మాత్రమే ఆడిన పేసర్ సిరాజ్ అత్య‌ధికంగా 13 వికెట్లు పడగొడితే…ఓపెనర్ గిల్ సెంచరీకి 9 పరుగుల దూరంలో అవుటయ్యాడు. నటరాజన్ 3 వికెట్లు పడగొడితే…శార్దూల్, వాషింగ్టన్ సుందర్ ఆల్ రౌండ్ షోతో జట్టు విజయంలో ప్రధానపాత్ర వహించారు.

ఇదీ చదవండి:టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ గా భారత్

వారం రోజుల్లో సిరాజ్ కు రెండుకార్లు…

బ్రిస్బేన్ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టడంతోనే హైదరాబాదీ యువబౌలర్ మహ్మద్ సిరాజ్ దశ తిరిగిపోయింది. తండ్రి ఆటోడ్రైవర్…సిరాజ్ మాత్రం 26 ఏళ్ల చిన్నవయసులోనే ఖరీదైన రెండుకార్లకు యజమానిగా మారాడు. దానికి కారణం కేవలం క్రికెటర్ కావడమే. ఐపీఎల్ ద్వారా సీజన్ కు బెంగళూరు ఫ్రాంచైజీ నుంచి 3 కోట్లరూపాయల మొత్తం అందుకొంటున్న సిరాజ్ కు ఆడిన ఒక్కో టెస్ట్ మ్యాచ్ కు ఫీజు రూపంలో 17 లక్షల రూపాయలను బీసీసీఐ చెల్లిస్తోంది. వన్డేలకు,టీ-20లకు నాలుగు లక్షల రూపాయల చొ్ప్పున మ్యాచ్ ఫీజుగా ముడుతోంది.

కొద్దిరోజుల క్రితమే బీఎమ్ డబ్లు కారు కొనుగోలు చేసిన మహ్మద్ సిరాజ్ కు…ఆనంద్ మహేంద్ర తమ కంపెనీ స్పోర్ట్స్ కారును బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించారు. మొత్తం మీద ఓ ఆటోడ్రైవర్ కొడుకు బీఎమ్ డబ్లు బ్రాండ్ కారుకు ఓనర్ కావడం అంటే…అది కేవలం క్రికెట్ మహిమ, భారతీయుల అభిమానం మాత్రమే.

ఇదీ చదవండి:భారత క్రికెట్లో సరికొత్త చరిత్ర

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles