Friday, April 26, 2024

దర్శనం మొగులయ్యకు ఆర్థిక సహాయం అందించిన పవన్ కల్యాణ్

సాదిక్

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘భీమ్లా నాయక్‌` చిత్రంలోని టైటిల్‌ సాంగ్‌లో సాకీని ఆలపించిన ప్రముఖ కిన్నెర కళాకారులు దర్శనం మొగులయ్యకు జనసేన అధినేత ఆర్థిక సహాయం అందించారు. భీమ్లా నాయక్‌ లో మొగులయ్య పాడిన సాంగ్ ఇంట్రడక్షన్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పవన్‌ తనని ఆదుకోవడంతో మొగులయ్య ఆనందం వ్యక్తం చేశారు.

మొగులయ్యనూ, డాక్టర్ దాసరి రంగానీ పన్మానిస్తున్న పవన్ కల్యాణ్

ఆదివారం ఉదయం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ రూ.2 లక్షల చెక్కును మొగులయ్యకి అందచేసి సత్కరించారు. అలాగే తెలంగాణ జానపద కళలపై పరిశోధన చేసిన డా.దాసరి రంగాకి రూ.50 వేలు చెక్కు ఇచ్చి సన్మానించారు. తన ట్రస్ట్ `పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సిలెన్స్` నుంచి పవన్ కల్యాణ్  ఈ ఆర్థిక సాయాన్ని అందజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles