Saturday, October 5, 2024

జీవరూప పరాప్రకృతి

భగవద్గీత – 31

ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు కలిగే భ్రాంతినే ‘‘మాయ’’ అంటారు.

ఉన్నది లేక పోవడమేమిటి? లేనిది ఉండటమేమిటి?

మీ తాత గారు ఎవరు అంటే, ఫలానా అని పేరు చెపుతాం. వారేరి? అని అడిగితే కాలం చేశారని చెపుతాం. వారు ఒకప్పుడు ఉన్నారు గదా మరి ఇప్పుడు లేరు. అంటే ఉన్నది లేక పోవడమే కదా?

Also read: యోగి ఉత్తమోత్తముడు

అదే విధంగా మీ పుట్టిన రోజు ఎప్పుడండీ అని మిమ్మల్ని అడిగారనుకోండి.  ఫలానా తారీఖున అని చెపుతాము. మరి ఆ తారీఖుకి ఒక సంవత్సరం ముందు ఎక్కడ అని అడిగితే  ‘‘లేను’’ అని సమాధానం వస్తుంది. మరి ‘‘లేనిది ఉన్నట్లే కదా!’’

దృశ్యరూపమయిన, ఇంద్రియగోచరమయిన, ఈ భావనా రూపమయిన ఈ జగత్తంతా నశిస్తుంది. దీనిని జడ ప్రకృతి అని అంటారు. ఈ జడ ప్రకృతి ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు కలుగ చేసే భ్రమనే మాయ అంటారు.

ఈ మాయా ప్రకృతి ఎనిమిది రకాలుగా విభజింపబడింది!

అవి పంచభూతాలు భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశము. మనస్సు, బుద్ధి, అహంకారము…

భూమి అంటే పదార్ధము. matter, శరీరము ద్రవ్యరాశి కలిగిన పదార్ధమేకదా.

Also read: సంకల్పాలు పెంచుకోవాలా, తుంచుకోవాలా?

ఆకాశం space. జాగ. ఈ శరీరం కొంత జాగ ఆక్రమిస్తున్నది కదా.

అనలము. నిప్పు. మనిషిలో జఠరాగ్ని ఉన్నది కదా మనం తిన్న ఆహారం జీర్ణం చేసేది.

నీరు…శరీరంలో 90శాతము నీరేకదా.

వాయువు…ప్రాణం అదేకదా.

ఇవేకాక, మన మనస్సు. అంటే సంకల్పాలు పుట్టే చోటు.

ఉదాహరణకు అప్పుడే పుడుతూ ఉండే శిశువు తల్లి స్పర్శను అనుభవిస్తూ భూమి మీద పడతాడు. పడిన వెంటనే క్యార్‌ మంటూ ఏడుస్తాడు.

ఎందుకని? ఆక్సిజన్‌ కోసం, ప్రాణవాయువు కోసం. ఆ ఏడవడమే భూమిమీద బ్రతకాలనే మొదటి ‘‘సంకల్పం‘‘. ఆ బిడ్డడిని తల్లి నుండి కాస్త వేరు చేయండి. ఏడుపు లంకించుకుంటాడు. అంటే అతని మనస్సులో ఒక బాధ పొడసూపింది అన్నమాట. అదేమిటి? తను అనుభవించిన మొదటి స్పర్శని దూరం చేశారన్న భావన (‘‘సంకల్పం‘‘) అలా ఏడుపు రూపంలో బయటకొచ్చింది.

Also read: ఆహారవ్యవహారాదులలో సంయమనం

అలాగే తల్లి స్తన్యం ఎలా గ్రోలాలో ఎవడు training ఇచ్చాడు పాపడికి?

మనం మొదట రుచి చూసిన ఆహారం, తొలి స్పర్శ, తొలిశబ్దం, తొలిరూపము, తొలివాసన ఇవి అన్నీ మెదడులో నమోదవుతాయి. అలా శబ్ద, స్పర్శ, రూప, రస గంధాలకొరకు ఆలోచనలే సంకల్పాలయి ఒకదానికొకటి విడదీసి చూడలేనంతగా పెనవేసుకొని మనస్సు అని పిలవబడతాయి. ఈ మనస్సు తెరను తొలగించకలిగితే మనకు స్వస్వరూపము తెలుస్తుంది.

ఎలా అంటే. సినిమా తెర మీద మొదట స్లైడులు వేస్తారు. ఒక స్లైడుకు మరొక దానికి మధ్య సమయం ఉంటుంది. అప్పుడు మనకు తెల్లని తెర కనపడుతుంది. అవే స్లైడులు మన కన్ను గుర్తించలేనంత వేగంగా వేస్తే అది సినిమా. అంటే వేగంగా వచ్చే స్లైడులు మన సంకల్పాలు లేదా ఆలోచనలయితే, స్లైడులు వేసే ప్రొజెక్టర్‌ మన మనస్సు.

ఆలోచనల వేగం ఎంత తగ్గి తెర ఎంతగా కనపడితే మన ఆత్మదర్శనం అంత అయినట్లు. ఇక ఈ ఆలోచనలను అమలు చేసే విచక్షణా శక్తిని బుద్ధి అని అంటాము. Logical yes or no!

పుట్టిన ప్రతివాడు నేను ఏమిటో తెలియకపోయినా ’’నేను’’ అని అంటూనే వుంటాడు. ఇది ఎంత యోగికయినా చివరి శ్వాస వరకు ఉంటుంది. దీనిని ‘‘అహంకారం ’’ అని అంటాము…

ఇది అంతా జడప్రకృతి అని చెపుతారు పరమాత్మ. దీనినే ‘‘అపరా’’ అని అంటారు. ఇదంతా ఒక ఎత్తైతే వీటికి పయిన ఇంకొకటి ఉంది!

Who breathed life into zygote. తల్లి కడుపులోని పిండానికి ప్రాణమూదిన వాడు ఎవడు? వాడే పరమాత్మ!

అదే విశ్వచైతన్యం! Universal consciousness. అది పరమాత్మది!

భూమిరాపో అనలో వాయుః ఖం మనో బుద్దిరేవచ

అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా॥

అపరేయమితస్త్వన్యాం ప్రకృతిమ్‌ విద్ధి మే పరామ్‌

జీవభూతామ్‌ మహాబాహో యయేదం ధార్యతే జగత్‌ ॥

పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం అని నా ప్రకృతి ఎనిమిది విధములు కలదు. దీనిని ‘‘అపరా ‘‘లేక ‘‘జడ’’ప్రకృతి అని అంటారు.

ఇదికాక ఈ పూర్ణ జగత్తును ధరించునట్టి మరియొక ప్రకృతి కలదు. అదియే నా జీవరూప పరాప్రకృతి లేక చేతన ప్రకృతి అని తెలుసుకో.

Also read: మనకు మనమే శత్రువు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles