Thursday, April 18, 2024

శాంతి – యుద్ధము

                    ———–  ————-

(‘ PEACE AND WAR’ FROM ‘THE WANDERER’ ,BY KAHLIL GIBRAN)

అనువాదం:డా.సి. బి. చంద్ర మోహన్

               15. సంచారి తత్త్వాలు

               ————–   —————-

        మూడు శునకాలు ఎండలో మొరుగుతూ ఇట్లా మాట్లాడుకుంటున్నాయి.

         మొదటి కుక్క పారవశ్యంగా ఇట్లా  అంది ” ఈ శునక రాజ్యంలో జీవించడం చాలా ఆనందంగా ఉంది. మనం ఎంత సులభంగా నీళ్లలోనూ, భూమిపైనా , ఆకాశంలోనూ ప్రయాణించ గలుగుతున్నామో చూడండి ! శునకాల సుఖం కోసం కనుగొన్న సాధనాలు (చివరకు మన చెవులకు, కళ్ళకుముక్కులకు కూడా ) ఒక్కసారి తలుచుకోండి.”

          రెండో  శునకం ఇలా అంది ” మనం కళలలో  చాలా శ్రధ్ద చూపిస్తున్నాము. మనం – మన తాత, ముత్తాతల కంటే చంద్రుణ్ణి చూసి చాలా శ్రావ్యంగా మొరుగుతాం. నీళ్లలో మన ప్రతిబింబాలు చూసుకుంటే , మన ముఖాలు పూర్వం కన్నా స్వచ్ఛంగా ఉంటాయి.”

            మూడో కుక్క ” శునక రాజ్యాల మధ్య ఉన్న శాంతియుత అవగాహన నాకు ఆసక్తి కలిగిస్తుంది. నా దృష్టి అంతా దాని మీదే ఉంది !” అంది.

            అదే సమయంలో కుక్కలు పట్టే మనిషి రావడం చూసాయి ఆ శునకాలు.

            ఆ మూడు శునకాలు ఒక్క ఉరుకు ఉరికి రోడ్డున పడ్డాయి. పరుగు తీస్తూనే  మూడో  శునకం ఇట్లా అంది ” మీ ప్రాణాలు కాపాడు కోండి. నాగరికత మనల్ని తరుముకొస్తోంది. “

Also read: “నేతి”

Also read: వేదన

Also read: మూడు కానుకలు

Also read: సౌందర్యం

Also read: ప్రజలే ప్రభువులు

Dr. C. B. Chandra Mohan
Dr. C. B. Chandra Mohan
మనుషుల్నీ, జీవితాల్నీ, సాహిత్యాన్నీ ప్రేమించేవాళ్ళు మంచి రచయితలు కాగలుగుతారు. ఇన్నిమంచి లక్షణాలూ పుష్కలంగా ఉన్న అరుదైన రచయిత డాక్టర్ సీబీ చంద్రమోహన్. మొబైల్ 9440108149

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles