Friday, April 26, 2024

వారేవ్వా!…మోతేరా!

  • ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం
  • 700 కోట్ల ఖర్చుతో అత్యాధునిక హంగులు
  • వరుసగా ఏడు అంతర్జాతీయ మ్యాచ్ లకు ఆతిథ్యం

ప్రపంచ క్రికెట్లో అతిపెద్ద వేదిక ఏదంటే ఆస్ట్ర్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం అని చెప్పుకొనే రోజులు పోయాయి. మెల్బోర్న్ తలదన్నే రీతిలో క్రికెట్ క్రేజీ భారత్ లోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణం పూర్తయ్యింది.అహ్మదాబాద్ నగరంలో సబర్మతీ నదీతీరంలో గుజరాత్ క్రికెట్ సంఘం 700 కోట్ల రూపాయల భారీవ్యయంతో నిర్మించిన మెగావేదిక సర్దార్ పటేల్ కమ్ మోతేరా స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా గుర్తింపు సంపాదించింది.63 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో అత్యాధునిక హంగులతో నిర్మాణం పూర్తి చేసుకొని అంతర్జాతీయ మ్యాచ్ లకు ఆతిథ్యమివ్వడానికి ముస్తాబయ్యింది.కుండపోతగా వర్షం కురిసినా మ్యాచ్ కొనసాగించడానికి తగ్గ ఏర్పాట్లున్నాయి. కేవలం 30 నిమిషాల్లోనే మైదానం ఎండిపోయే విధంగా వ్యవస్థను రూపొందించారు. 8 సెం.మీ వర్షం కురిసినా మ్యాచ్ రద్దు చేయకుండా ఉండేలా వ్యవస్థను సిద్ధం చేశారు.

లక్షా 10 వేల మందికి చోటు:

మోతేరా స్టేడియంలో ఏకకాలంలో లక్షా 10 వేల మంది కూర్చొని మ్యాచ్ చూడటానికి వీలుగా ఏర్పాట్లు ఉన్నాయి. మెల్బోర్న్ స్టేడియం సీటింగ్ సామర్థ్యం 90వేలు మాత్రమే కాగా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ స్టేడియం 60 నుంచి 70 వేలు మాత్రమే. అంతేకాదు స్టేడియం మధ్యలో ఒక్క స్తంభంగానీ, మరే ఇతర అడ్డంకులుగానీ లేకుండా నిర్మించడంతో అంటే ఏ స్టాండ్‌లో కూర్చోని అయినా మ్యాచ్‌ను అడ్డంకులు లేకుండా వీక్షించే అవకాశం ఉంది.

Also Read: డే-నైట్ టెస్టుకు వేళాయెరా…!

బంకమన్ను, ఎర్రమన్నుతో తయారు చేసిన మొత్తం 11 పిచ్‌లను ఏర్పాటు చేశారు. మోతేరా ప్రధాన మైదానంతో పాటు రెండు ప్రాక్టీస్ మైదానాలు కూడా ఉన్నాయి. ఈ రెండు ప్రాక్టీస్‌ మైదానాల్లో కూడా 9 చొప్పున పిచ్‌లు ఉన్నాయి. వీటిలో 5 పిచ్‌లు ఎర్రమట్టితో, 4 పిచ్‌లు నల్ల బంకమట్టితో తయారయ్యాయి.

 స్టేడియం కాంప్లెక్స్ మొత్తం 63 ఎకరాల్లో నిర్మించారు. ఒలింపిక్స్ స్టేడియాన్ని తలపించేలా, ఈత కొలను సైతం ఉండటం ఈ స్టేడియం ప్రత్యేకత. 4 డ్రెస్సింగ్ రూములు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రతి డ్రెస్సింగ్ రూంకు జిమ్నాజియంను జతచేశారు. స్టేడియంలో 6 ఇండోర్ పిచ్‌లు ఉన్నాయి. ఇక్కడ బౌలింగ్ యంత్రాల సౌకర్యాలు కూడా ఉన్నాయి.

కార్పొరేట్ బాక్సులేబాక్సులు:

వీఐపీలు కూర్చిన మ్యాచ్‌ వీక్షించేందుకు వీలుగా ఈ స్టేడియంలో 76 కార్పొరేట్ బాక్సులు ఉన్నాయి. ప్రతి పెట్టెలో 25 సీట్లు ఉంటాయి. అంటే స్టేడియంలో పెద్ద సెలబ్రిటీల కోసం 1,900 సీట్లు కేటాయించారన్నమాట. ప్రతి స్టాండ్‌లో ఫుడ్‌, సర్వీసెస్‌ సెక్షన్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఏ మూలలోనైనా కూర్చున్న ప్రేక్షకులకు ఫుడ్‌ సౌకర్యం అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.

Motera Cricket Stadium - GCA Motera Stadium

Also Read: స్వదేశీ సిరీస్ ల్లో పులి భారత్

ఎల్‌ఈడీ దీపాల వెలుగులు:

ఇప్పటివరకు, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ దేశాల స్టేడియాలలో మాత్రమే ఎల్‌ఈడీ లైట్ల వాడకం ఉంది. ఇప్పుడు భారత్ సైతం అదేబాటలో పయనిస్తోంది. మోతేరా స్టేడియంలో కూడా ఎల్‌ఈడీ లైట్లను భిగించారు. ఎల్‌ఈడీ లైట్లను ఉపయోగించిన భారత తొలి స్టేడియం ఇదే కానుంది. ఎల్‌ఈడీ లైట్ల వాడకం తో నీడకానీ, ప్రతిబింబం కానీ పడవు.

అత్యాధునిక క్లబ్ హౌస్:

మోతేరాలో అత్యాధునిక క్లబ్ హౌస్ ను సైతం ఏర్పాటు చేశారు. ఇందులో 50 డీలక్స్ గదులు, ఐదు సూట్లు, ఇండోర్, అవుట్‌ డోర్ గేమ్స్, రెస్టారెంట్లు, పార్టీ ఏరియా, 3 డీ ప్రొజెక్టర్ థియేటర్, టీవీ రూమ్ వంటివి ఉన్నాయి. ప్రతిభావంతులైన ఆటగాళ్లను తయారు చేయడానికి వీలుగా అత్యాధునిక శిక్షణ సదుపాయాలతో ఏర్పాట్లు చేశారు.  క్రికెట్‌తోపాటు క్రికెటేతర క్రీడలైన ఫుట్‌బాల్, హాకీ, బాస్కెట్‌బాల్, కబడ్డీ, బాక్సింగ్, లాన్ టెన్నిస్, రన్నింగ్ ట్రాక్ వంటి ఇతర క్రీడలకు స్పోర్ట్స్ అకాడమీని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

Also Read: వందవ టెస్టుకు ఇశాంత్ రెడీ

వరుసగా 7 అంతర్జాతీయ మ్యాచ్ లు:

వరుసగా ఏడు అంతర్జాతీయ మ్యాచ్ లకు ఆతిథ్యమిచ్చిన మొట్టమొదటి స్టేడియంగా మోతేరా స్టేడియం చరిత్ర సృష్టించనుంది. ఇంగ్లండ్ తో నాలుగుమ్యాచ్ ల సిరీస్ లోని ఆఖరి రెండుటెస్టులతో పాటు ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ ను సైతం అహ్మదాబాద్ స్టేడియం వేదికగానే నిర్వహిస్తున్నారు. భారత గడ్డపై డే-నైట్ టెస్టుకు ఆతిథ్యమిస్తున్న రెండోస్టేడియంగా, ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదికగా మోతేరా నిలిచిపోనుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles