Friday, April 26, 2024

ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడెమీ అధ్యక్షులుగా కొమ్మినేని శ్రీనివాసరావు బాధ్యతల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నాపై అపారమైన నమ్మకంతో ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి శైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కొమ్మినేని దంపతులు

ప్రెస్ అకాడమీ, విజయవాడ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన ఏపీ సమాచార పౌరసంబంధాల, సినిమాటోగ్రఫీ, బీసీ సంక్షేమ శాఖామాత్యులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ… పాత్రికేయ రంగంలో కొమ్మినేని శ్రీనివాసరావు గారు అందించిన సేవలను గుర్తించి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గారు ప్రెస్ అకాడమీ చైర్మన్ గా అప్పగించిన బాధ్యతను విజయంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షిస్తూ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మంత్రులు అంబటి రాంబాబు, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ మీడియా, అంతరాష్ట్ర వ్యవహారాల సలహాదారు దేవులపల్లి అమర్, అధికార భాషా సంఘం అధ్యక్షులు విజయ్ బాబు, తెలుగు అకాడమీ ఛైర్మన్ లక్ష్మీ పార్వతి, ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, డొక్కా మాణిక్యవరప్రసాద్‌, ప్రెస్ అకాడమీ సెక్రటరీ బాలగంగాధర్ తిలక్, పలువురు జర్నలిస్టులు పాల్గొని నూతన ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు గారికి అభినందనలు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles