Tuesday, March 28, 2023

Perugu Ramakrishna

18 POSTS0 COMMENTS
కవి పరిచయం..! 1975 లో 10 వ తరగతిలోనే తొలికవిత రాసి కవిత్వ యాత్ర మొదలెట్టిన కవి. కవిత్వమే ఊపిరిగా జాతీయ , అంతర్జాతీయ కవిగా ఎదిగిన సుపరిచితులు. వెన్నెల జలపాతం(1996) , ఫ్లెమింగో (దీర్ఘ కవిత2006), నువ్వెళ్ళిపోయాక (దీర్ఘకవిత2003), ముంజలు (మినీకవితలు2007) పూలమ్మిన ఊరు (2012) ఒకపరిమళభరిత కాంతి దీపం(2017), దూదిపింజల వాన (2020) మరియు మొత్తం 26 ప్రచురితాలు ..అంతేగాక సుమారు 200 అంతర్జాతీయ సంకలనాల్లో తన ఆంగ్ల అనువాద కవితలు నమోదు చేసుకున్న అరుదైన భారతీయ తెలుగు ప్రాంత కవి. 15 దేశాలు కవిత్వం కోసం పర్యటించి పలు విశ్వ వేదికలపై తెలుగు కవితా వాణి బలంగా వినిపించిన విశేష కవి. రంజని -కుందుర్తి ప్రధాన అవార్డ్ , ఎక్స్ రే ప్రధాన అవార్డ్ లతో మొదలెట్టి సుమారు 100 విశిష్ట అవార్డ్ లు ,2008 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి డా వై యస్సార్ ద్వారా రాష్ట్ర ఉగాది విశిష్ట పురస్కారం, గ్రీస్ , జపాన్, మలేషియా, కెనడా, అమెరికా, చెక్ రిపబ్లిక్ , ఘనా, సింగపూర్, లాంటి ఎన్నో దేశాల పురస్కారాలు , తాజాగా 2019 భారత స్వాతంత్ర్య దినం సందర్భంగా గుజరాత్ సాహిత్య అకాడెమీ పురస్కారం ..లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక గౌరవాలు పొందారు. చెక్ రిపబ్లిక్ (2016) మెక్సికో (2019) లనుండి రెండు గౌరవ డి లిట్ లు అందుకున్నారు. వీరి రెండు కవితా సంపుటుల మీద రెండు విశ్వ విద్యాలయాలు ఎం.ఫిల్ డిగ్రీలు ప్రదానం చేయగా , మద్రాసు విశ్వ విద్యాలయంలో మొత్తం కవిత్వ గ్రంధాల పై పి హెచ్ డి పరిశోధన జరుగుతుంది. వీరి కవిత్వం పలు భారతీయ భాషల్లోకి స్పానిష్, ఫ్రెంచి, జపాన్, గ్రీస్, అల్బేనియా, రుమేనియా, అరబ్ లాంటి ప్రపంచ భాషల్లోకి అనువాదమై ప్రచురణ పొందింది.

ఫ్లెమింగో-15

ఆకాశం రంగుపూలు పూచిన దృశ్యం రబ్బరు చెట్ల కొమ్మల్లో ఫ్లెమింగో, పెలికాన్ ల కాపురం విస్తరిస్తున్న అపార్ట్ మెంట్ సంస్కృతిలో  వేలాడుతున్న మనిషి కుటుంబాల ప్రతిబింబం  ప్రళయ కావేరి నీటి పడగల నీడలో సైబీరియా ఆనందాల అభ్యంగనం వేల మైళ్ళ దూరభారాల అలసట...

ఫ్లెమింగో-14

నిన్న పుట్టిన నారాయణ కొంగ ఈ నేల ఉప్పు తిన్న జలరాచిల్క ఈ చెట్టుగూట్లో పీల్చిన తొలి ఊపిరి మరువగలుగుతుందా విదేశీ శబరి ఫెలికాన్ కన్న రంగురంగుల కలలు ఇక్కడి రాత్రిళ్ళు కొసరిన ఆశల కుసుమాలు నేలపట్టు మట్టివాసన మరుపురాని మలయ...

ఫ్లెమింగో-13

ఇంధ్రధనువులు జలకాలాడినట్టు అప్సరసలు హొయలు వొలికించినట్టు పులికాట్టు అలలనిండా రంగేళీ పిల్ల పిచ్చుకల పారువేట కేళి పిల్లలు నిండిన జలమైదానం ఆనందాల ఉల్లాస కచ్చేరి అనిపిస్తుంది దర్శక చక్షువుల కనుపాపల్లో వర్ణార్ణవ మేళాగా ప్రతిబింబిస్తుంది నేలపట్టు నుంచి పులికాట్టు వరకు రంగులగంగ ధారగా ప్రవహిస్తుంది పక్షుల పండుగ సంబరం...

ఫ్లెమింగో-12

ముక్కున కరచి తెచ్చిన బేడిసని మూరపెంగా ముద్దరాలి కందిస్తుంది ఫ్లెమింగో తిర్రె తిఱికిణి సాధించిన వేళ ప్రియురాలి నెంతగా కలవరిస్తోందో వంజరం ముక్కు పంజరాన పరవశించి రెక్కలెగదన్ని పిల్లల్ని కలగంటుంది ఎవరు నేర్పాలో ఇన్ని రాగాలీ పక్షలకి ఎలా అమరిందో ఇంత ప్రేమ...

ఫ్లెమింగో-11

కాలం ఎప్పుడూ తెరిచిన పుస్తకం అన్నీ తనలో యిమిడిన బహిరంగ రహస్యాలే ఎవరికీ ఏమీ నేర్పని గురువు కాలం అందరికీ అన్నీ తెలిపే రాయబారి కాలం జీవన యాగ జ్ఞానులు విదేశీ పక్షులు సీమాంతర ద్వేషాలెరుగని ఆత్మీయ మిత్రులు ఇంద్రియ చాపల్యం...

ఫ్లెమింగో-10

ఒక్క దేవకాకులే కాదు పక్షులన్నీ పురాత్మా బంధువులే! మనల్ని పలకరించను చేరవచ్చిన మన్వంతరాల పురందరులే! పిగిలిపిట్టని మనం పరదేశి అనుకుంటాం శాంతి సంగాతిగా చూసిందెప్పుడు? గుడ్డికొంగను దెయ్యం పక్కిగా భావిస్తాం సౌజన్యరథసారథిగా లెక్కించిందెప్పుడు? నల్ల చిలువ నల్లనిదే అయినా నల్లన్నయ్యంత చల్లని గుండెల తండ్రి ఎర్ర తీతువు...

ఫ్లెమింగో-9

తరలి వచ్చిన బంజార పక్షులు కువకువల గీతికలని ఆలపిస్తాయి గుండెల్లో దాచుకున్న ప్రేమనిధుల్ని గుదిగూట్లో ఆరాబోస్తాయి ప్రణయ కలాప లాటీల ఘోషకు చుక్కలన్నీ నేలకు తొంగి చూస్తాయి తరుణ హృదయకేళీ విలాసాలు యామిని ఏకాంతంలో కోరిక లూదుతాయి ఉదయం దినబాలుడు కిరణకరాలు చాచి గోరింట పూసుకుంటాడు...

ఫ్లెమింగో-8

అక్కడ కొమ్మ కొమ్మకో కచ్చేరి గూటి గూటికో రాగవల్లరి ప్రతిచెట్టూ రంగుల దొంతర నేల పట్టంతా పక్షుల జాతర కుహు కుహులు కిత కితలు కువకువలు కిలకిలలు ఎన్ని రాగ వసంతాల సంగమాలో ఎన్నెన్ని సంబరాల దొంతరలో వలయాక్షుల ఉల్లాసగానాలతో వాతావరణం ఉత్పుల్ల మౌతుంది విహాయస విద్యుత్ రహదారిలో రంగుల...
- Advertisement -

Latest Articles