Saturday, April 27, 2024

నేను సచ్చిదానంద రూపుడను

భగవద్గీత – 35

శాస్త్రీయ విద్య కావాలి!

దేవుడుంటే చూపించండి! కనపడాలిగా!

ఎందుకు నమ్మాలి? అసలు దేముడే లేడు!

ఇత్యాది ప్రశ్నలు వేసి శాస్త్రీయంగా ఆలోచించమంటారు! సరే శాస్త్రీయంగానే ఆలోచిద్దాం!

పదార్ధం దేనితో నిర్మింపబడ్డది? వెంటనే పరమాణువు అని సమాధానం వస్తుంది!

పరమాణువులో ఏమున్నాయి? ఎలక్ట్రాన్లు, ప్రోటానులు, న్యూట్రాన్లు! ఇదీ జవాబు!

Also read:ఒక్క శ్లోకాన్నిఅర్థం చేసుకొని మననం చేసుకుంటే  చాలు!

మరి మీరు ఎలక్ట్రాన్లు చూశారా! ఇక్కడ ఏం సమాధానం వస్తుంది?

No subatomic particle has so far been seen!

ఇంతవరకూ ఎవరూ చూడలేదు. మరి చూడనిదానిని ఉన్నది అని ఎలా చెపుతున్నావు?

అంటే…భావించాము అని సమాధానం! ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోపు తయారు చేశాము. కానీ ఎలక్ట్రాన్ను మాత్రం చూడలేక పోయాం!

అమ్మవారికి ‘‘భవానీ భావనాగమ్యా’’ అని ఒక నామం ఉన్నది! అంటే ఆవిడ మనభావనలోనే ఉన్నదట! అలాగే ఈ ప్రపంచమంతా ఆయన విభూతే! ఆయన సాధారణ మానవుడా ఈ కళ్లతో చూడటానికి! X-ray photograph తీస్తాం! మన మామూలు కళ్లతో X-ray చూడగలమా?

గాలిపీలుస్తున్నాం! కాని గాలిని చూడగలుగుతున్నామా?

Also read: త్రిగుణాల సమన్వయకర్త స్త్రీ!

నిప్పును చూడగలుగుతున్నాం. కానీ చర్మం ఆ స్పర్శ భరించగలదా?

అంతెందుకు? రోజూ వెలుతురునిచ్చే సూర్యుని మామూలు కళ్ళతో చూడగలమా?

దేవుడు మాత్రం కనపడాలట! అనంతుడిని అంతర్నేత్రంతో మాత్రమే చూడగలం! భావించగలం!

మన ఇంద్రియాలకున్న శక్తి ఎంతవరకు అంటే మన బ్రతుకు బ్రతకటానికి మాత్రమే! పరమాత్మను చూసే శక్తి వాటికిలేదు!

‘‘నేను శాశ్వతమైనవాడను, సర్వోత్తముడను! ఇంద్రియములకు, మనస్సునకు, గోచరింపనివాడను! ఈ పరమభావమును బుద్ధిహీనులు గ్రహింపక సచ్చిదానంద రూపుడయిన నన్ను సాధారణ మనుష్యునిగా తలుస్తున్నారు!’’

అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః

పరం భావమజానంతో మమావ్యయమనుత్తమమ్‌!

Also read: జ్ఞాని పరమాత్మకు మిక్కిలి ఇష్టుడు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles