Friday, October 4, 2024

చిన్న పిల్లలే ఆయనకో పెద్ద ప్రపంచం!

తెలుగు గిజుబాయ్  సి. ఎ. ప్రసాద్

(బాలల ప్రేమికుడి కోసం చిరుపరిచయం)

“What is the definition of someone who is rich? The answer is someone with money. What is the definition of someone who is really rich? The answer is someone with time. What is the definition of someone who is really, really rich? The answer is someone who can spend time with children…”

– John Taylor Gatto

Dumbing us Down

(The hidden curriculum of compulsory schooling)

ఈరోజు నాకు తెలిసిన ఒక పేద్ద ధనవంతుడ్ని మీకు పరిచయం చేస్తాను. తెలుగు సమాజంలో అంత స్థితిమంతుడు ఉండటం అరుదైన సంగతి. కాకపోతే, ఆయన స్థితి ఎప్పుడూ గతిపై ఆధారపడి ఉంటుంది. కళ్ళలో ఆశలు, కాళ్ళలో చక్రాలు కట్టుకుని అవిశ్రాం తంగా నిరంతరం పిల్లల మధ్య పరిభ్రమిస్తూనే ఉంటుంది. తెలంగాణ నుండి ఉత్తరాంధ్ర వరకూ, మహరాష్ట్ర వార్థా ఆశ్రమం నుంచీ చత్తీస్‌గఢ్ ఆదివాసీ ప్రాంతాలవరకూ, తమిళనాడు ప్రయోగశీల సంస్థలతో మొదలెడితే, కర్నాటక, కేరళ, ఎం.పి, యూ.పి, ఢిల్లీ ఇలా ఎన్నో… పిల్లల మధ్య, పిల్లల కోసం తిరగాడే తలనెరిసిన సంచారి తాత. డబ్బులుండో, ఆస్తుల వలనో ధనవంతుడు అయిన వాడు కాదు. దాదాపు మూడు దశాబ్దాలుగా తెలుగు సామాజిక వ్యవస్థల్ని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయడం ద్వారా అసాధారణమైన రీతిలో అనేక విద్యా సంస్థల్ని, పిల్లలతో పనిచేస్తున్న వాళ్ళనీ, భిన్నంగా పిల్లల కోసం ఆలోచించే ఉపాధ్యా యుల్ని ఆలోచింప జేయడం ద్వారా, అమూల్యమైన మానవ సంబంధాల్ని మల్చుకోవడం ద్వారా ‘మానవ వనరులనే ‘ ఆస్తిపాస్తులని ఆర్జించిన అద్వితీయ వ్యక్తి. ఆయనే,

                                   డా. సి. ఏ. ప్రసాద్.

ప్రసాద్

సేవాగ్రామ్ ఆశ్రమ అనుసంధానంలో ఆసియాకి సంబంధించిన విద్యా సమాఖ్యకి దేశంలో ఒక కన్వీనర్‌. చారిత్రక విజ్ఞాన వేదిక వ్యవస్థాపకుల్లో ఒకరు. మహత్తర మద్యపాన వ్యతిరేకోద్యమ నేతల్లో ప్రధానమైనవారు. ఈనాటికీ ఉద్యమ విశేషాల్ని సాధికారికంగా చెప్పగల ఏకైక వ్యక్తి. అంతేకాదు, నాడు ఉద్యమ మహిళలతో స్వయంగా నిర్మించిన when women unite చిత్రాన్ని భధ్రపర్చి రాష్ట్రమంతా ప్రదర్శిస్తున్న వ్యక్తి. సమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం కోసం కృషి చేస్తున్న  ప్రజాసైన్స్ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు. మానవతా మిత్ర మండలి వ్యవ స్థాపకుల్లో ఒకరు. ‘చదువులు – కొత్తదారులు’ , STEP (students, teachers, education & parents), ‘పుస్తకాలతో స్నేహం చేద్దాం’, క్రియ, బాలోత్సవ్, గ్రంథాలయోద్య మాలు వంటి ఎన్నో కార్యక్రమాల్లో భాగస్వామి. పిల్లల కోసం పాఠాల్ని పాటలుగా, ఆటలుగా, నాటికలుగా, ఉల్లాసభరితమైన కేరింతల వాటికలుగా స్కూళ్ళని మలిచినవారు. మిత్రులంతా తెలుగు గిజుభాయిగా పిల్చుకునే అరుదైన వ్యక్తాయన!

స్కూలు పిల్లలతో ప్రసాద్

ఆరెస్సెస్ నుండి కమ్యూనిస్టు పార్టీ కల్లోలాల వరకూ, సరస్వతి శిశు మందిరాల నుంచీ వైజ్ఞానిక ప్రజాతంత్ర నూతన విద్యావిధానాల దాకా చరిత్ర తెలిసిన అనుభవశీలి. ఆచరణలో మాత్రమే ఆశయాలు వికసిస్తాయనే నమ్మకంతో నిత్యం పిల్లలతో గడపడం, పుస్తకాలతో స్నేహం చేయడం,  ప్రజానీకంతో పూర్తిగా మమేకమై ప్రయాణిం చడం ఆయనకి ఇష్టం.  రెండు దశాబ్దాలపాటు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ గా పనిచేసి చుట్టు పక్కల గ్రామాల్లో సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేశారు. చారిత్రక శాస్త్ర విజ్ఞాన జాతాలో పాలుపంచుకున్నారు. ఒకప్పుడు ఉద్యమాలకి ఆయన ఇల్లొక అండ. కాకుంటే, ఇప్పుడు ఆయన అక్కడ ఉండేది తక్కువ. ఎక్కువగా సంచి తగిలించుకుని తిరిగేదే ఎక్కువ. ఆయనో తిరుగులేని సంచార విద్యా బోధకుడు!

మహిళలతో మాట్లాడుతున్న ప్రసాద్

ఈ దేశ సాంస్కృతిక వికాసానికి విద్య చేసే మహోన్నతమైన ఉపకారాన్ని గుర్తించి, అందుకోసం క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్న వ్యక్తి. నాకు తెలిసీ తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఇలా పనిచేస్తున్నది ఇద్దరే ఇద్దరు. ఒకరు సి.ఎ. ప్రసాద్ గారైతే, రెండు కె. శాంతారావు గారు. ప్రసాద్ గారు కార్యా చరణలో భాగంగా సీనియర్. ఆయనతో నా పేచీ స్వీయానుభవాల్ని కాగితం మీద పెట్టమని. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న వినూత్నమైన ప్రయోగాలకి అక్షరరూపం ఇస్తే అవి వర్తమానానికీ,  భవిష్యత్తుకీ కూడా ఎంతో ఉపయోగమనీ. కానీ, ఈ విషయంలో ఆయన ప్రాధాన్యత గుర్తిస్తాననీ ఎప్పటికప్పుడు సరే అంటారు కానీ ఒక్క అక్షరం కూడా రాసిన పాపాన పోలేదు. ఏడెనిమిదేళ్ళ క్రితం ఒకసారి ప్రత్యేకంగా సింగరాయకొండలోని ఆయనింటికి వెళ్ళి ఏదో ఇంటర్వ్యూ చేశాను గానీ అదెక్కడో కనిపించ కుండా పోయింది!

బడి పిల్లలతో మాట్లాడుతున్న ప్రసాద్

పల్లెల్లోని పాఠశాలల నుండీ పట్నాల్లోని గ్రంథాలయాల వరకూ పిల్లల కోసం, మంచి చదువుల కోసం ఆలోచించే, అందుకోసం పనిచేసే ప్రతి వ్యక్తి, ప్రతి సంస్థ ఆయనకి చిరపరిచితాలే‌. ఈ ఏడాదే డెబ్బై ల్లోకి అడుగిడిన ఆయనకి ఈ బాలల దినో త్సవం నాడు మనస్పూర్తిగా శుభాకాంక్షలు తెలియ జేస్తూ, ఆయన ఆరోగ్యం మరింత కాలం మెరుగ్గా ఉండి, మరెన్నో మంచి కార్యక్రమాల రూపకల్పనకి సహకరించాలనీ, మరెన్నో కొత్త ప్రాంతాలు పర్యటించాలనీ, వీటితోపాటూ త్వరలోనే ఆయన విద్యారంగంలో ఆయన అపూర్వమైన ప్రయో గాల్ని ,అమూల్యఅనుభవాల్ని సమగ్రంగా అక్షరరూపంలో ఈ సమాజానికి అందించాలనీ కోరుకుంటూ బాలల దినోత్స వం, గ్రంథాల య వారోత్సవాల సందర్భంగా,  మిత్రులు, పెద్దలు డెబ్భై ఏళ్ళ యువ కుడు, డా. సి. ఎ. ప్రసాద్ గారికి అభినందనలతో ఎప్పటినుండో అనుకుంటున్న ఈ చిన్న రైటప్!

(ఈ రోజు చాచా నెహ్రూ  పుట్టిన రోజు, బాలల దినోత్సవం)

 – గౌరవ్

Gourav
Gourav
గౌరవ్, సామాజిక కార్యకర్త, రామచంద్రాపురం, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles