Saturday, December 7, 2024

పూనకాలతో ఊగుతున్న కేడర్, ముగిసిన ప్రచారం

  • గెలుపు మాదంటే మాదేనని ప్రధాన  పార్టీల ధీమా
  • అగ్రనేతల సుడిగాలి ప్రచారాలు
  • నేటితో ముగియనున్నఎన్నికల ప్రచారం.
  • బీజేపీ, బీఆరెస్, కాంగ్రెస్ పోటాపోటీగా హామీలు
  • గెలుపుపై  ధీమా

ఈ నెల 30 న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా  మంగళవారం ఎన్నికల ప్రచారం  ముగుస్తుంది. గత 15 రోజులుగా  అన్ని రాజకీయ పార్టీలు  ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయాయి. ప్రధాన రాజకీయ పార్టీలు బీజేపీ, బీఆరెస్, కాంగ్రెస్ లు తమ కేడర్ ను ఎన్నికల ప్రచారంలో  పరిగెత్తించాయి. తమ నేతల హామీలు, ఉపన్యాసాలతో కేడర్ లో జోష్ నింపింది. పార్టీల గెలుపు కోసం కేడర్ అహర్నిశసలు పనిచేసింది. దీంతో ప్రధాన పార్టీల్లో  గెలుపుపై ధీమా పెరిగింది.

డిసెంబర్ 3వ తేదీ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి గా తమ పార్టీ నేతలే  సీఎం  సీట్లో కూర్చుంటారని ఆయా పార్టీలు గట్టిగా నమ్ముతున్నాయి. తెలంగాణలో మొదటి సారి బీసీ ముఖ్యమంత్రిని చేస్తున్నామని, బీజేపీ అగ్రనేత, ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ ప్రకటించారు. మరో పక్క కాంగ్రెస్ పార్టీ తమ సిఎం అభ్యర్థిని అధిష్టానం ఎంపిక చేస్తుందని ప్రకటించింది. ఇక  అధికార తెలంగాణ పార్టీ అయిన బీఆరెస్ మాత్రం తమ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ  ఎన్నికల ప్రచారలో ప్రశకటించింది.

హైదరాబాద్ రోడ్ షో లో ప్రధాని మోదీకి ఇరువైపులా లక్ష్మణ్, కిషన్ రెడ్డి

ముగిసిన మోదీ ప్రచారం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  చివరిగా తన ఎన్నికల ప్రచారాన్ని  హైద్రాబాద్ లో రోడ్ షో తో సోమవారం ముగించారు. మోదీ తన ఎన్నికల ప్రచారం అంతా  కాంగ్రెస్, బీఆరెస్ పైనే ఫోకస్ పెట్టారు. కేంద్రంలో కాంగ్రెస్ ను, రాష్ట్రంలో బీఆరెస్ పార్టీలను నమ్మవద్దు అన్నారు. అధికారం కోసం  కాంగ్రెస్, బీఆరెస్ పార్టీలు  పనిచేస్తున్నాయని,  ఘాటుగా మోదీ  విమర్శలు చేసారు.  బీజేపీ అగ్రనేతలు తెలంగాణ ఎన్నికలకు తరలివచ్చారు. దీంతో  తెలంగాణ బీజేపీ  నేతలతో పాటు ఆ పార్టీ కేడర్ లో  ఉత్సహం పెరిగింది. బీజేపీ నేతలు ప్రధానగా బీఆరెస్ పై  విమర్శలు, ఆరోపణలు గుప్పించేసారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మూఢనమ్మకాలతో పాలన చేయడాన్ని బీజేపీ తీవ్రoగా  విమర్శించింది. కేవలం కేసీఆర్ కుటుంబానికి  ఉద్యోగాలు వచ్చాయని ఎన్నికల ప్రచారలో ఓటర్లకు వివరించారు. తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు దక్కక పోవడం పట్ల  బీజేపీ తీవ్రంగా తప్పు పట్టింది.

కేంద్రంలో కాంగ్రెస్ ను, రాష్ట్రంలో బీఆరెస్ పార్టీలను నమ్మవద్దు అన్నారు. అధికారం కోసం  కాంగ్రెస్, బీఆరెస్ పార్టీలు  పనిచేస్తున్నాయంటూ  ఘాటుగా మోదీ  విమర్శలు చేసారు.  బీజేపీ అగ్రనేతలు తెలంగాణ ఎన్నికలకు తరలివచారు. దీంతో  తెలంగాణ బీజేపీ  నేతలతో పాటు ఆ పార్టీ కేడర్ లో  ఉత్సాహం పెరిగింది. బీజేపీ నేతలు ప్రధానగా బీఆరెస్ పై  విమర్శలు, ఆరోపణలు గుప్పించేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మూఢనమ్మకాలతో పాలన చేయడాన్ని బీజేపీ తీవ్రoగా  విమర్శించింది. కేవలం కేసీఆర్ కుటుంబానికి  ఉద్యోగాలు వచ్చాయని ఎన్నికల ప్రచారలో ఓటర్లకు వివరించారు. తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు దక్కక పోవడం పట్ల  బీజేపీ తీవ్రంగా తప్పు పట్టింది.

ప్రచారం హోరెత్తించిన కల్వకుంట్ల తారకరామారావు, చంద్రశేఖరరావు

బీజేపీ, కాంగ్రెస్ పై కేసీఆర్ సెటైర్లు

ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం  తన ఎన్నికల ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై సెటైర్ లు వేస్తూ ఓటర్లను ఆకట్టుకొనన్నారు. కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో కేడర్ ను  భుజం తట్టి నడిపించారు. నేను వున్నాను మీవెంట అంటూ ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్ సాగించారు. కేసీఆర్ ప్రధానంగా విద్యుత్. సాగునీటి  ప్రాజెక్టు లు, పెన్షన్. రైతుబంధు పథకాలను  ఓటర్లకు వివరించడంలో సక్సెస్ అయ్యారు.

ప్రచారాన్ని రక్తికట్టించిన రాహుల్, ప్రియాంక

కాంగ్రెస్ అగ్రనేతల ప్రచారం

కాంగ్రెస్ పార్టీ  తన అగ్రనేతల ను ఎన్నికల ప్రచారంలో  పరిగెత్తించింది. బీజేపీని మత పార్టీగా విస్తృత ప్రచారం చేసింది. బీజేపీకి ఓటు వేస్తే బీఆరెస్ కు ఓటు వేసినట్లేనని కాంగ్రెస్  వివరించింది. కాంగ్రెస్ నుంచి  అపార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్జ్ గే తో పాటు  రాహుల్ గాంధీ. ప్రియాంక గాంధీ. కర్ణాటక నుంచి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ తో పాటు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  ఎన్నికల ప్రచారంలో  సుడిగాలి పర్యటన చేసారు. రేవంత్ ప్రధానంగా కేసీఆర్ పై విమర్శలు గుప్పించేశారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ను బొంద పెట్టాల్సిందే నని దుయ్య బట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు పెట్టి, సంక్షేమ పథకాల్లో వేల కోట్ల రూపాయలు కేసీఆర్ లూటీ చేశారని రేవంత్ నిప్పులు చేరిగారు. తెలంగాణలో ‘మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి’ అంటూ  ప్రచారాన్ని హోరేంతిచేసారు. ఇలా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారంలో   హోరేంత్తించాయి.

హోరేత్తిన ప్రచారంలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోశారు. నువ్వు దొంగ అంటే నువ్వే గజదొంగ అంటూ కన్నెర్ర చేశారు. మహిళన్ని ఆకట్టుకోవడానికి హామీల వర్షం కురిపించారు.

C.S. Kulasekhar Reddy
C.S. Kulasekhar Reddy
కులశేఖర రెడ్డి 1992 నుంచి ఆంధ్రభూమి లో పనిచేశారు. వ్యవసాయం, నీటి పారుదల, విధ్యుత్ రంగాలపై పలు వ్యాసాలు రాసారు. అనంతపురం, చిత్తూరు, విజయవాడ, కడప, కర్నూల్, హైదరాబాద్ లలో 27 సంవత్సరాలు విలేఖరిగా పని చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles