Sunday, September 15, 2024

దుబ్బాక విజయంపై ఎవరి ధీమా వారిది

ఉపఎన్నికకు మరో మూడు రోజులే సమయం ఉండటంతో శుక్రవారంనాడు ప్రధాన పార్టీల న్యాయకులు విమర్శలలో దూకుడు పెంచారు. తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు తన సుడిగాలి పర్యటనలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. రాష్ట్రంలో రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని …బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఉచిత విద్యుత్ ఊసే లేదని మంత్రి హరీష్ రావు విమర్శించారు. వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ ఉచితంగా సరఫరా చేస్తున్నామనీ, బీజేపీ మిటర్లు పెడతానంటున్నదనీ విమర్శించారు. టీఆర్ఎస్ అభివృద్ధిని, సంక్షేమాన్ని నమ్ముకుందనీ, బీజేపీ మాత్రం డబ్బులు, మందుసీసాలను నమ్ముకుందని ఎద్దేవా చేశారు. ఉపఎన్నికలో టీఆర్ఎస్ ని గెలిపించి…విపక్షాలకు గట్టిగా బుద్ధి చెప్పాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. దుబ్బాకలో టీఆర్ఎస్ విజయాన్ని ఏ శక్తీ అడ్డుకోలేదని ధీమా వ్యక్తం చేశారు.

దుబ్బాకలో బీజేపీదే విజయం: రాజాసింగ్

మరోవైపు బీజేపీ కూడా టీఆర్ఎస్ విమర్శలకు  థాటిగా సమాధానమిస్తోంది. ఎన్నికల ప్రచారంలో రఘనందన్ తో పాటు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు. దుబ్బాకలో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని రాజాసింగ్ ధీమా వ్యక్తం చేశారు. కుటుంబ పాలనతో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందనీ, దుబ్బాక విజయంతో టీఆర్ఎస్ పతనం ప్రారంభమవుతుందనీ రాజాసింగ్ విమర్శించారు.  ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న టీఆర్ఎస్ కు ఉపఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు.

ప్రకటనలకు అనుమతి తప్పనిసరి

దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజున దినపత్రికల్లో రాజకీయ ప్రకటనల ప్రచురించేందుకు మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ముందస్తు అనుమతి తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ భారతి హోలికేరి స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. దుబ్బాక ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ లో కానీ సిద్ధిపేట పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో కానీ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులు ఇవ్వనున్న ప్రకటనతో పాటు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంసీఎంసీ కమిటీ పరిశీలించి అనుమతి పత్రం జారీ చేస్తుందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ భారతి హోలికేరి తెలిపారు.

పోలింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు

పోలింగ్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ భారతి హోలికేరి అధికారులను ఆదేశించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నట్లు రిటర్నింగ్ అధికారి చెన్నయ్య తెలిపారు. పోలింగ్ సందర్భంగా ఓటర్లు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద గ్లౌజులు, శానిటైజర్లు థర్మల్ స్క్రీనింగ్ మాస్కులను అందుబాటులో ఉంచనున్నట్లు చెన్నయ్య తెలిపారు.

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

2 COMMENTS

  1. I must say, as considerably as I enjoyed reading what you had to say, I couldnt help but lose interest after a while. Its as if you had a good grasp to the topic matter, but you forgot to include your readers. Perhaps you should think about this from additional than one angle. Or maybe you shouldnt generalise so significantly. Its better if you think about what others may have to say instead of just heading for a gut reaction to the subject. Think about adjusting your own believed process and giving others who may read this the benefit of the doubt.

  2. Thank you pertaining to discussing that superb content material on your web site. I ran into it on the search engines. I am going to check to come back after you publish extra aricles.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles