Wednesday, November 6, 2024

దీపావళి… లక్ష్మీ పూజ

దీపమాలికలతో లక్ష్మికి నీరాజనమిచ్చే రోజు కావటం వల్ల దీనికి దీపావళి అని పేరు. నరకలోక వాసులకై దీప + ఆవళి కల్పించే దినం కనుక దీపావళి అని వాడుక లోని వచ్చింది. దీపావళి అంటే దీపాల సమూహం. హిందూ మత సంప్రదాయానికి దీపావళి పర్వం ఒక చిహ్నం. రాక్షస రాజు బలి చక్రవర్తిని పాతాళానికి విష్ణువు అణగదొక్కిన దినం కనుక ఒక మహోత్సవంగా పరిగణింప బడుతున్నది.  శ్రీరాముడు పట్టాభిషిక్తుడైన దినం కావున ప్రధాన్యత సంతరించుకుంది. విక్రమశక స్థాపకుడైన విక్రమార్క చక్రవర్తి పట్టాభిషేకదినం కూడా ఇదే.

లక్మీదేవి ప్రతిగడపా తొక్కుతుందని విశ్వాసం

లక్ష్మీదేవి ఈనాడు భూలోకానికి దిగి వచ్చి ఇల్లిల్లూ తిరుగుతుందని ప్రజల విశ్వాసం. మధ్యాహ్నం పిండివంటలతో భోజనం, అనంతరం లక్ష్మీదేవి తమ ఇంటికి రావడానికి దారి చూపేందుకే దీపాలంకరణలు. వామనమూర్తి బలిచక్రవర్తిని పాతాళానికి అణచివేసి ఆయన కారాగారంలో ఉన్న దేవతలను విడుదల చేశారు. అలా విడుదలైన వారిని లక్ష్మీదే వితో పాటు క్షీరసాగరానికి తీసుకెళ్ళారు. ఆ ఆనందానికి గుర్తుగా పండువ ఏర్పడింది. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది. అందుకే దీపావళి పర్వది నాన లక్ష్మీపూజ ప్రధాన కార్యంగా మారింది.

కొత్త అల్లుళ్ళకు ఆహ్వానం

పెళ్ళి అయిన కొత్త అల్లుళ్ళను హిందువులు పండగకు తప్పక ఆహ్వానిస్తారు. అల్లుని రాక సందర్భంగా సంతోష సూచకంగా బాణాసంచా కాలుస్తారు. భోజన సమయంలో కొత్త దుస్తులు ఇచ్చి గౌరవిస్తారు. మామతో అల్లుడు  కలిసి పంక్తి భోజనం చేస్తారు. రకర కాల పిండి వంటలు వడ్డిస్తారు. ఆశ్వయుజ అమావాస్య విక్రమ సంవత్సరానికి ఆఖరి రోజు. మహారాష్ట్ర ప్రజలు  పెదిపూజన్ అంటారు.  వారు లక్ష్మీ సరస్వతులను పూజిస్తారు. ఈ నాటి సాయంత్రం జమా ఖర్చులు  సరి చూసుకుని, కొత్త పుస్తకాలు పెట్టుకుంటారు. వాటికి పూజ చేస్తారు. నౌకర్లకు బహుమతులు ఇస్తారు. సాయంత్రం దీపాలు వెలిగిస్తారు.

అర్ధరాత్రి దాకా ‘డిండిమం’

దీపావళి నాటి రాత్రి లక్ష్మీపూజ చేసిన తర్వాత నిద్ర పోకుండా ఉండి, అర్ధరాత్రి దాటాక చేటల మీద కర్రలు కొట్టి, డిండిమం అనే వాయిద్యం వాయించాలని శాస్త్ర వచనం. ఆ వాద్యాలే ఇప్పుడు టపాకాయలుగా కాల్చడం జరుగుతున్నది. నరకాసురుడి చావుకి సంతోషించి, భూలోక వాసులు బాణాసంచా కాలుస్తూ వస్తున్నట్లు వాడుక. ఉల్కా – దర్శనం, అగ్గిపుల్లలు, కాకర పువ్వొత్తులు, దీపపు – కడ్డీలు, చిచ్చుబుడ్లు, మతాబులు, తారాజువ్వలు, చేటలు, డిండిమలు, తాటాకు టపాకాయలు ఫిరంగి కాయలు, నేల టపాకాయలు పేల్చుట జరు గుతున్నది.

క్రిమినాశనం

దీపావళి నాటి నుండి నెల రోజులు పెట్టే దీపాలతో క్రిమికీటకాదులు నశిస్తాయి. మందుల కాల్పుల వల్ల దీపాల వెలిగింపు వల్ల వాయువులో కీటకాదులను నశింప చేసే శక్తి ఉంది. దీపావళి నాడు సైతం పాప క్షయార్ధం సూర్యోదయానికి ముందే తైలాభ్యంగన స్నానం చేయాలి. ప్రదోష కాలమందు దీపాలను ఉంచాలి. దీపావళి నాటి లక్ష్మీ పూజ వల్ల ఉన్న లక్ష్మిని తొలగించి,   లక్ష్మి దేవిని  ప్రసన్నం చేసుకోవడానికి దోహదం చేస్తుందని నమ్మకం. దీపావళి అమావాస్య మొదలు నెల రోజులు ఆకాశదీపం పెట్టే వారికి అనంత పుణ్యమని శాస్త్రాధారం.

(కోవిద్ మహమ్మారి కారణంగా ఈ దీపావళికి బాణసంచా కొనరాదనీ, అమ్మరాదనీ, కాల్చరాదనీ తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అందరూ ఈ ఆదేశాన్ని విధిగా పాటించాలని విజ్ఞప్తి – ఎడిటర్)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles