Tuesday, June 25, 2024

నరక బాధ నివారిణి నరక చతుర్దశి

ఏ చతుర్దశి నాటి అభ్యంగన స్నానం వల్ల, దీపదానం వల్ల, యమ తర్పణం వల్ల మానవులు నరకబాధ లేకుండా చేసుకుంటారో దానిని “నరక చతుర్దశి” అంటారు. నరక చతుర్దశి ప్రేత చతుర్దశి అని పర్యాయనామం కలిగి, ఈనాడు నరక ముక్తి కోసం యమ ధర్మరాజును ఉద్దేశించి దీప దానం చేయాలని చూడామణి చెపు తున్నది. గుజరాతీయులు నరక చతుర్దశిని “కాలాచౌదశ్” అంటారు సంస్కృతంలో “కాళ చతుర్దశి”, నరకలోక వాసులకు పుణ్య లోక ప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశికమైన కార్యకలాప దినమని, తమకు నరక లోక భయం లేకుండా చేసుకునే కార్యకలాప దినమని, నరక లోక భయం లేకుండా చేసుకునే చతుర్థశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి.

“చతుర్దశ్యాంతుయే దీపాన్నరకాయ దదంతి చ, తేషాం పితృగణా సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ: “చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం, చీకటి ఉండగా స్నానం చేయని వారు నరకకూపంలో పడతారని, అందుకే తెలవార కుండా ఈరోజు అభ్యంగన స్నానం చేయాలని నిర్దేశం. ప్రతీ మాసంలోనూ బహుళ చతుర్దశి మాస శివరాత్రి. ఆనాడు కాని, మరు నాడు కాని తెల్లవార కుండా అభ్యంగన స్నానం చేయకూడదనే నిషేధం హిందూ సమాజంలో ఉంది. అయితే, ఆశ్వయుఖ బహుళ చతుర్ధికి అమావాస్య లేదు. పైగా ఈనాడు అభ్యంగన స్నానం విధిగా చేయాలని ప్రత చూడామణి మున్నగు గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి.

Also Read: ధన త్రయోదశితో దీపారాధనకు శ్రీకారం

స్నానం చేస్తుండగా తలచుట్టూ దీపం తిప్పడం, టపాసులు కాల్చడం ముఖ్య ఆచారం. వధకు పూర్వం నరకాసురుడు శ్రీకృష్ణుడు దైవాంశ సంభూతుడని తెలుసుకుని, పరమాత్ముని క్షమాభిక్ష కోరాడు. ఆ పరంధాముడు మన్నించాడు. క్షమాభిక్ష కారణంగానే నరకుడు తనకూ, తన మరణ దినం నాడు స్నానం చేసే వారికీ పాప విముక్తి సంపాదించు కున్నాడు, వేకువ జామునే తైలాభ్యంగన స్నానం చేసి, యమ తర్పణం చేసే వారికి యమదర్శనం లేదని శాస్త్రం వివరిస్తున్నది. ఆశ్వయుజ బహుళ త్రయోదశి, చతుర్దశి తిధుల మధ్య కాలంలో శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా ఈ దినాన పండువ జరుపుకోవడం ఆచారమైనది.

స్నాన సమయం

బహుళ చతుర్దశినాడు చంద్రోదయం ఇరవై ఎనిమిది గడియలకు అవుతుంది. అప్పటికి ఒక గంట మాత్రమే రాత్రి మిగిలి ఉంటుంది. చంద్రుడు ఉండగానే తెల్లవారుజామున తలంటి పోసుకో వాలి, తిలవైలంలో లక్ష్మీదేవి ఉంటుందనే భావనతో చతుర్దశినాడు నువ్వుల నూనెతో తలంటు కోవడం సంప్రదాయం.

స్నాన జలం

ఈనాడు జలమందు గంగాదేవి కళలు సమాహితమై ఉంటాయని శాస్త్ర వచనం. అభ్యంగన స్నానమునకు వలయు నీటిని పూర్వదిన రాత్రియందే పాత్రలందు నింపి, ఆ నీటిలోనికి జలాది దేవతను ఆహ్వానించి, సకల మహానదీ దివ్య తీర్థ సాన్నిధ్యమును కలుగ చేసి, పూజించి, ఆ నీటినే ఉదయాత్పూర్వము స్నానమాచరించాలని వివరించబడింది.

ఇతర విధులు

స్నాన సందర్భంలో మరికొన్ని విధులు నిర్దేశితాలు. స్నానానికి ఉత్తరేణి, తుమ్మి తగిలిన చెట్ల కొమ్మలతో కలియబెట్టి, కలి పిన జలంలో విద్యుత్ ఉత్పాదనం అవుతుంది కనుక ఓషధుల సమ్మిళితమైన సదరు నీరు ఆరోగ్యకరం కనుక అలా వినియో గించాలి. నరకబాధ తప్పించేందుకు ఉత్తరేణి ఆకులను తలపై ఉంచుకుని, దక్షిణాభిముఖంగా కూర్చుని, 14 నామాలతో యమ ధర్మరాజుకు తర్పణం చేయాలి. ఈదినం తిలలతో చేసిన పిండి వంటలను తప్పక తినాలి. ప్రదోష కాలమందు దీప దానం చేయాలి. దేవాలయాలలో, మఠాలలో దీప పంక్తులుంచాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles