Saturday, February 24, 2024

3 రాజ్యాంగ పీఠిక, పాట కాదు ఒక పాఠం, ఒక ప్రతిజ్ఞ

భారత రాజ్యాంగ పీఠిక ఒక జాతీయ గీతం వలె కనిపిస్తుంది, వినిపిస్తుంది. కవీంద్ర రవీంద్రుడు వ్రాసిన జాతీయ గీతం జనగణమన అధినాయక జయహే ఒక దేశభక్తి గీతం, సందేహం లేదు. ఒక గౌరవ వందనగీతం. ఈ పీఠిక, పాట కాదు. ఒక పాఠం, ఒక ప్రతిజ్ఞ, ఒక ప్రకటన. ఒక లక్ష్య వాగ్దానం. ఇందులో నిరంతరం గుర్తుంచుకోవలసిన మంత్రాక్షరాలున్నాయి. దిశా నిర్దేశనం నిమంత్రణ చేసే ఒక ఆదేశ పత్రం. ప్రజాసార్వభౌములు జారీ చేసిన ఒక రిట్. అనుల్లంఘనీయ శాసనం. కాని రక్షిస్తామన్నవారు, పాటిస్తామన్నవారూ, చదవవలసిన వారు, అర్థం చేసుకోవలసిన వారు అందరూ మరిచిపోయారు.

A Subordinate Judge dared enough to send jail to reading Preamble the Constitution. (‘Reading Of Preamble Not Incitement To Offence’ : Delhi Court In Chandra Shekhar Azad’s Bail Order, 15.1.2020)

Azad was arrested by Daryaganj police on December 21 on allegations of violence during protests against the Citizenship Amendment Act 2019.

అంతా తమ ప్రయోజకత్వం తామే భువి కధినాధులమని,

స్థాపించిన సామ్యాజ్యాలూ,నిర్మించిన కృత్రిమచట్టాల్‌, అని శ్రీ శ్రీ అన్నట్టు

ఈ చట్టపు పీఠిక చదవడం ప్రభువులకు కోపకారణం అయింది. పోలీసులు లాఠీలెత్తారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని విమర్శిస్తూ ప్రసంగించిన చంద్రశేఖర్ ఆజాద్ పై, పీఠిక చదివినందుకు రాజ్యాంగాన్ని జనానికి చూపినందుకు క్రిమినల్ కేసులు పెట్టారు.  పీఠికను గుర్తు చేయడం తరాజులకు నచ్చడం లేదు. యుఎపిఎ చట్టం కింద బెయిల్ రాని సెక్షన్లతో కొడుతున్నారు. తిడుతున్నారు. రాజు దైవమై పోతున్నాడు. కోర్టులు బెయిల్ ఇవ్వడం దైవాధీనంగా మారిపోయింది. చివరికు డిల్లీ కోర్టు న్యాయాధికారి కామినీ లావ్ ‘‘ధర్నా చేస్తే తప్పేమిటి, నిరసన చేయడం నేరమా? అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు కదా? మీరు అసలు రాజ్యాంగం చదివారా?’’ అని పోలీసులను అడిగారు. న్యాయమూర్తులకు న్యాయాధికారులకు, రాజ్యాంగం కింద నియుక్తులైన అధికారులకు అందరికీ రాజ్యాంగం పవిత్ర పత్రమైనపుడు ఆ రాజ్యాంగం సరైనదైనపుడు, చదివితే నేరమా? ఎంత మాత్రం కాదని ఆ కోర్టు తీర్పు చెప్పవలసి వచ్చింది. పీఠిక రాజ్యాంగాన్ని పరిచయం చేస్తుంది. రాజ్యాంగ లక్ష్యం, సూత్రాలు, మౌలిక తత్వం వివరించిన పీఠం అది. పీఠిక చదివితే అరెస్టు చేయరాదని కోర్టు చెప్పిన తరువాత గాని బెయిల్ దొరకలేదు. విడుదలైన వెంటనే పీఠిక చదివాడాయన, కరతాళ ధ్వనులమధ్య.

ప్రభుత్వ రాజ్యాంగ వ్యతిరేక విధానాలను వ్యతిరేకించడానికి ఉపయోగించే నిరసనోద్యమ దీప్తిగా పీఠికాపఠనం మారిపోయింది.  తరువాత కొన్ని నెలలకు భారత ప్రభుత్వం పీఠికా పఠనాన్ని అధికారిక కార్యక్రమంగా నిర్దేశించింది. 75 సంవత్సరాల అజాదీ ఆమృతోత్సవంలో తప్పని సరిగా కేంద్ర మంత్రిత్వశాఖలు తమ కార్యాలయాల్లో గోడలమీద ప్రవేశిక లిఖించి పెట్టాలని ఆదేశించింది.

Also read: అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాతా? రచయితా?

రాష్ట్రపతి స్వయంగా పీఠికను అందరితోపాటు చదివే కార్యక్రమాన్ని అధికారికంగా ఆరంభించారు 2020లో. 2015లో ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో పీఠిక చదివారు. న్యాయ పర్యావరణశాఖామాత్యులు తన మంత్రిత్వ భవనంలో ప్రియాంబుల్ గోడను ఆవిష్కరించారు. మధ్యప్రదేశ్, కేరళ వంటి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పీఠికను అన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా చదవాలని ఆదేశం జారీ చేసింది. అందుకే శ్రీశ్రీ నిలదీస్తున్నాడు.

బలవంతుల దౌర్జన్యాలూ, ధనవంతుల పన్నాగాలూ

ఇంకానా! ఇకపై చెల్లవు. ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తీ,

ఒక జాతిని వేరొక జాతీ,పీడించే సాంఘిక ధర్మం

ఇంకానా ? ఇకపై సాగదు.

Also read: సంవిధానం పీఠిక చదివితే నేరమా ఓ విధానమా?

మాడభూషి శ్రీధర్ 26.1.2024

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles