Friday, September 29, 2023

తరగతే వేదిక….నేస్తమే పౌరోహిత్యం

పెళ్లి పిల్లాటగా మారుతోంది. ఎగతాళి అవుతోంది. బొమ్మల పెళ్లే నయమనిపిస్తోంది. వివాహ వయస్సు అర్హత వయస్సును పెంచాలనే  అంశంపై కేంద్రం కసరత్తు చేస్తుంటే  వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా మారుతోంది. తల్లిదండ్రులకు తెలియకుండానే ఇంటర్ విద్యార్థిని సహ విద్యార్థితో తరగతి గదిలోనే పసుపుతాడు కట్టించుకున్న తీరు ఇది. మైనారిటీ తీరిందో లేదో కూడ తెలియదు. రాజమహేంద్రవరంలో గత నెల 23వ తేదీన జరిగినట్లు తెలుస్తున్న ఈ తంతు వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా తిరుగుతోంది.`వాళ్ల వయస్సెంత? వారికి  పెళ్లి పట్ల అవగాహన ఎంత? పాఠశాల  స్థాయిలో  ఒక్కటైన వారి భవిష్యత్ ఏమిటి?`అంటూ వ్యాఖ్యలు వస్తున్నాయి. `బాల` వధూవరుల పెళ్లితంతును వారి స్నేహితురాలు వీడియో తీసినట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన కళాశాల ప్రిన్సిపాల్ ఇద్దరికీ టీసీలు ఇచ్చి పంపేశారట.

also read :కాలేజ్ లో టీనేజ్ ప్రేమికుల పెళ్లి సందడి

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles