Saturday, October 1, 2022

Dr N.Gopi

36 POSTS0 COMMENTS
ప్రముఖ కవి, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ కులపతి

ఒక రోజు

మరీ పొద్దున తలుపు తెరవగానే గాలి కవిత్వంలా చుట్టుముట్టింది. ఆకుల మీంచి ఒక్కొక్క బొట్టే రాలి పడుతున్నట్టు మనసులో పదాలు తయారౌతున్నాయి. ఏదో ప్రాక్తన సంవేదన దిగంచలాల నుంచి ప్రసారమౌతున్నట్టు. త్వర పడాలి వార్తాపత్రిక రాకముందే ఈ ప్రక్రియ ముగిసి పోవాలి. రాత్రంతా  కలల కల్లాపి చల్లి శుభ్రపరురచుకున్న మనసు వాకిలి...

ప్రేమ తత్త్వం

తెలియ లేదు గాని నూనూగు మీసాలప్పుడే మొలకెత్తింది, దూరంగా కనుచూపు మేరలో కదిలే ఆనాటి అమ్మాయిని చేరుకోవాలని చిరకాలం కొనసాగిన నడక. క్లాస్‌మేట్‌కు పుస్తకంలో నెమలీక పెట్టిచ్చినప్పుడు చెలరేగిన ఉద్వేగపూరిత క్షణాలు! నిజానికి అతని మొట్టమొదటి కవిత్వం ప్రేమ లేఖలే! పోస్ట్ మ్యాన్‌ను మించిన ఆత్మీయుడు ఇప్పటికీ కనిపించడు. వీధి మలుపులో...

పరామర్శ

అన్నీ కాదు గాని కొన్ని మకరి బాష్పాలు. మృదువుగా విచ్చుకున్న పుష్పాల్లా కొందరి పలకరింపులకు రోగి లేచి కూర్చుంటాడు. అందరికీ కాదు గాని కొందరికి కుతూహలమెక్కువ. వివరాల మీదే దృష్టి ఆంతరిక వివరం పట్ల కాదు. ముందే బిక్క చచ్చిన రోగి సందర్భాలు చెప్పలేక చస్తాడు. కష్టాల్లో ఉన్నవారిని...

గ్రంథోపనిషత్

ఘనంగా కవి గోపి 73 జన్మదినోత్సవం ఆ గొడవ వేరు డబ్బులే కావాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారమే చేసేవాణ్ని. కవిత్వం ఎందుకు రాస్తాను! పుస్తకాలు అమ్ముడు పోలేదని అంగలార్చను లక్షలు గుమ్మరించి అచ్చువేసుకుంటాను. ఎవరూ కొనడం లేదని దుఃఖ మేల! కొందరైనా దుకాణాదారులకు భృతిని కల్పించడంలో సంతోష పడతాను. పాఠకులు...

శీలా వీర్రాజు స్మృతిలో..

డా౹౹ ఎన్. గోపి వీర్రాజు గారూ! మీరిక లేరంటే రాత్రంతా నిద్ర పట్టలేదు మీరు లేకుండానే తెల్లారటం ఒక నల్లని వాస్తవం. సాహిత్యంలో ఎన్నో మైలురాళ్లను నాటారు మీరు మీ మంచితనంతో అసంఖ్యాక హృదయాలను మీటారు. మిమ్మల్ని కలిస్తే మనిషిని కలిసి నట్టుండేది తెలంగాణా పల్లెల్లోని కవి కిశోరాలు దశబ్దాల పాటు మీ...

Cataract సర్జరీకి ముందు

కనుగుడ్డు భూగోళమంత ముఖ్యమైంది. అది దృష్టి ఇది అనంత సృష్టి. కన్ను తెరిస్తే అది దృశ్యం మూసుకుంటే ఒక స్వప్నం. అక్షరాల మైదానాల్లో తిరిగి తిరిగి అలిసి పోయి నట్టున్నాయి. లీలగా మసక గాలికి లేచిన ఇసక. కండ్లు దేహానికి కిటికీలు నాలుకను మించిన బహు భాషా వేదికలు. ఇంత జలం ఎక్కడి నుంచి...

అతీత

వాక్యాన్ని అల్లుతుంటే తీగ మీద నడుస్తున్నట్టుగా వుంది. భాషా భాగాల మధ్య సమన్వయం కుదరనప్పుడు అర్థం ఏ ఆగాధాల్లో కూలి పోతుందో తెలియదు. సాంకేతిక సమ్మతి గురించి కాదు మాట్లాడేది స్పందనల తుఫానులకు మూలమేదో అవాఙ్మానస గోచర మయ్యింది. ఒక పదాన్ని ముట్టుకుంటే ఇది ఇదివరకటి స్పర్శ...

లత జ్ఞాపకాలు

నాలుగో యేటి నుంచే సినిమాలు చూసే వాణ్ని. మా ఊరి టాకీస్ గడ్డి పొలాల మధ్యన వుండేది. దాని సిగలోంచి వెలువడే లత పాటలువింటూ అది మరింత పచ్చగా మొలిచేది. ప్రత్యక్షంగా ఆమెను నేను చూడలేదు. అందుకే భౌతికంగా మన మధ్య లేదనే బెంగ లేదు. సర్వాంతర్యామికి రూపం లేకున్నా...
- Advertisement -

Latest Articles