Friday, September 29, 2023

ఏపీ ఎస్ ఇ సీ విడియో సమావేశం రద్దు

విజయవాడ : జిల్లా కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికార్లతో ఎస్ ఈ సీ వీడియో కాన్ఫరెన్స్ రద్దు అయింది. బుధవారం మధ్యాహ్నం  3నుంచి 5గంటల వరకు సమావేశం నిర్వహించాలని ఎస్ఈసీ రమేష్ కుమార్ ముందుగా నిర్ణయించారు.  వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనాలని  నిన్న అధికారులకు  ఎస్ఈసీ లేఖ రాశారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించనున్నట్లు లేఖలో తెలిపారు. పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శినీ, కమిషనర్ నీ  సమావేశంలో పాల్గొనాలని రమేష్ కుమార్ కోరారు.  సమావేశంలో పాల్గొనేందుకు సీఎస్ ను ఇప్పటికే  అనుమతి కోరినట్లు అధికారులు  ఎస్ఈ సీకి తెలియజేశారు. సమావేశంపై సీఎస్ అభ్యంతరం తెలపుతూ లేఖ రాయడం వల్ల వీడియో కాన్ఫరెన్స ను  ఎస్ఈసీ రద్దు చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles