Thursday, September 19, 2024

అనపర్తిలో అసైన్డ్ భూములపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే రుణాలు: అనపర్తి ఎంఎల్ఏ ఆరోపణ

వోలేటి దివాకర్

అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి రాజమహేంద్రవరంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజాతో కలిసి విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి, తన రాజకీయ ప్రత్యర్థి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు.

Also read: కరవు కాటకాలకు ఆనకట్ట…కాటన్ బ్యారేజీకీ అంతర్జాతీయ గౌరవం!

తెలుగుదేశం అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ముఖ్యమైన అనుచరులతో అమరావతి ప్రాంతాలలో పేదవారి అసైన్డ్ భూములు ఆక్రమించుకోవడం జరిగిందనీ,  అదే మాదిరిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు అయినా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి నియోజకవర్గంలో పేదల అసైన్డ్ భూములను ఆక్రమించుకుని తెలుగుదేశం పార్టీ పరువును మరింత దిగజారుస్తున్నారనీ అన్నారు.

Also read: అమరావతా? అధికార వికేంద్రీకరణా? ఏది రైటు?

నల్లమల్లి రామకృష్ణారెడ్డి 1993-94 సంవత్సరంలో రాజకీయ ప్రాబల్యాన్నీ అడ్డం పెట్టుకుని అనపర్తి నియోజకవర్గం లోని  ద్వారపూడి గ్రామానికి సంబంధించి వేములపల్లి ప్రాంతంలో పేద ప్రజలకు పంచాల్సిన  అసైన్డ్ ల్యాండ్ తీసుకొని అందులో అక్రమంగా పౌల్ట్రీ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు.

Also read: అధికార పార్టీలో మళ్లీ అంతర్గత పోరు ?! వారు పార్టీలో చేరడం ఆయనకు ఇష్టం లేదా ?

అసైన్డ్ ల్యాండ్ ను  ఏ బ్యాంకులో కూడా తనఖా పెట్టి రుణం పొందే అవకాశం ఉండదని కొన్ని అక్రమ మార్గాల ద్వారా రాజమహేంద్రవరం చెందిన యూకో బ్యాంకులో తనఖా రుణం పొందారని, నేటికి కూడా 9 కోట్ల రూపాయల రుణం ఇంకా చెల్లించాల్సి ఉందన్నారు. గతంలో రామకృష్ణారెడ్డి నిర్మించిన వంశీ పవర్ ప్రాజెక్ట్ లో భాగంగా ఇదే ల్యాండ్ ను  తనఖా పెట్టి రుణం పొందడం జరిగిందనీ, అది నేటికి సుమారు 12 కోట్ల రూపాయలకు చేరిందనీ సూర్యనారాయణ రెడ్డి వెల్లడించారు

స్థానికంగా ఉండే పేద ప్రజలు ఆ స్థలాన్ని కేటాయించాలని, కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళగా దీనిపై సమగ్ర విచారణ జరిపిన కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్డిఓ, మండపేట తాసిల్దార్ రిపోర్టుల  ఆధారంగా అవి అసైన్డ్ భూమిలే అని నిర్ధారణ చేసుకుని భూములను తిరిగి అప్పగించాలని కలెక్టర్ ఆర్డర్ ఇవ్వడం జరిగిందన్నారు.

Also read: గోదావరి తీరంలో బుల్డోజర్ నడిపిస్తారా?!

ఒక మాజీ ప్రజా ప్రతినిధి అయ్యుండి ఒక అసైన్డ్ ల్యాండ్ ను 25 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు అనుభవించడమే కాకుండా దానిమీద వివిధ బ్యాంకులలో తనఖా రుణం తీసుకుని బ్యాంకులను మోసం చేయడమంటే ప్రజాధనాన్ని లూటీ చేయడమేననీ, ఇటువంటి ఆర్థిక నేరాలకు పాల్పడడం  క్షమించరాని నేరమనీ ఆయన అభివర్ణించారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్న అనపర్తి మాజీ శాసనసభ్యులు నల్లమల్లి రామకృష్ణారెడ్డిని తెలుగు దేశం పార్టీ నుండి బర్తరఫ్ చెయ్యాలని అనపర్తి శాసన సభ్యులు సత్తి సూర్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు

అయితే, గత 30 ఏళ్లుగా తన రాజకీయ ప్రత్యర్థి అసైన్డ్ భూములను అనుభవిస్తుంటే సూర్య నారాయణ రెడ్డి ఇప్పటి వరకు ఏం చేస్తున్నారన్నది ప్రశ్న. రుణాలు ఇచ్చిన బ్యాంకు అధికారులపై ఎందుకు ఫిర్యాదు చేయలేదు… మాజీ ఎమ్మెల్యే మోసంపై పోలీసులకు ఫిర్యాదు ఎందుకు చేయలేదన్నదే ప్రజల సందేహం. రాజకీయ ఎత్తుగడలో ఇదో భాగమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also read: నేటి నుంచి దూసుకుపోనున్న రైళ్లు…గరిష్ట వేగం గంటకు 130 కిలోమీటర్లు!

Voleti Diwakar
Voleti Diwakar
వోలేటి దివాకర్ ఆంధ్రభూమి దినపత్రికలో రాజమహేంద్రవరం కేంద్రంలో రెండు దశాబ్దాలకు పైగా పని చేశారు. అంతకు ముందు స్థానిక దినపత్రికలో పని చేశారు. గోదావరి పుష్కరాలు సహా అనేక రాజకీయ, సాంస్కృతిక, సామాజిక ఘట్టాలపై వార్తారచన చేశారు. ప్రస్తుతం ఆన్ లైన్ పత్రికలకు వార్తలూ, వ్యాఖ్యలూ రాస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles