Friday, April 19, 2024

కరవు కాటకాలకు ఆనకట్ట…కాటన్ బ్యారేజీకీ అంతర్జాతీయ గౌరవం!

వోలేటి దివాకర్

ఆనాడు స్వాతంత్ర్య పోరాట సమయంలో దేశాన్ని దోచుకున్న బ్రిటీష్ వారిని భారతీయులు తీవ్రంగా ద్వేషించారు. అయితే, ఒక బ్రిటీష్ ఇంజనీర్ కు మాత్రం మినహాయింపు లభించింది. ఆయనను ఇప్పటికే కోస్తాంధ్ర ప్రజలు గుండెల్లో పెట్టుకుని దేవుడిగా పూజిస్తారు. ఆయనే సర్ ఆర్థర్ కాటన్. గోదావరి పై ఆయన నిర్మించిన ధవళేశ్వరం బ్యారేజీకి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది 160 సంవత్సరాల పురాతన నీటిపారుదల నిర్మాణం.  వరదల నుండి గోదావరి డెల్టాను గొప్ప ధాన్యాగారంగా మార్చింది.

Also read: అమరావతా? అధికార వికేంద్రీకరణా? ఏది రైటు?

dowleswaram-barrage
సర్ ఆర్దర్ కాటన్ విగ్రహం

బ్యారేజీ నిర్మాణానికి ముందు కరువు

గోదావరిపై ధవశ్వరం వద్ద బ్యారేజీ నిర్మించడానికి ముందు, గోదావరి డెల్టాలోని రెండు జిల్లాల ప్రజలు తీవ్రమైన కరువు పరిస్థితులతో బాధపడ్డారు.  అధికారిక రికార్డుల ప్రకారం, 1833లో కరువు వచ్చి వేలాది మంది మరణించారు.  1839లో,  తుఫానులు, వరదలు పొలాలు, గ్రామాలు మునిగిపోయాయి. వేలాది మంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. అప్పటి జిల్లా అధికారి సర్ హెన్రీ మౌంట్ ఈ విపత్కర పరిస్థితులపై బ్రిటిష్ ప్రభుత్వానికి నివేదిక పంపారు.

గోదావరి నదిపై ఆనకట్ట నిర్మాణం సాధ్యాసాధ్యాలను అంచనా వేయడానికి ఆర్థర్ కాటన్ అనే ఇంజనీర్‌ను పంపారు.  అనేక ప్రాంతాలను శోధించిన తరువాత, అయన ధవశ్వరం – విజ్జేశ్వరం మధ్య నది వెడల్పు కారణంగా ఆనకట్ట నిర్మాణానికి అనుకూలమైన ప్రాంతంగా ఎంచుకున్నారు.  డిసెంబర్ 23, 1846న బ్రిటిష్ ప్రభుత్వం ఆనకట్ట నిర్మాణానికి ఆమోదం తెలిపింది.

Also read: అధికార పార్టీలో మళ్లీ అంతర్గత పోరు ?! వారు పార్టీలో చేరడం ఆయనకు ఇష్టం లేదా ?

వెయ్యిమంది కూలీలు

సుమారు 10,000 మంది కూలీలు, 500 మంది కార్ పెంటర్లు , 500 మంది కమ్మరిలను నియమించారు. రాయిని రైల్వే వ్యాగన్ల ద్వారా నది ఒడ్డుకు తీసుకువచ్చారు.  ఫిబ్రవరి 1849లో, విజ్జేశ్వరం వైపున ఆనకట్ట పనులు ప్రారంభమై 1852లో పూర్తయ్యాయి. ఆర్థర్ కాటన్ ఈ నిర్మాణాన్ని నిర్మించడానికి అందరితో పాటు కూలీగా పనిచేశారు. వీణం వీరన్న అనే సబ్‌ ఇంజినీర్‌ ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఎంతగానో సహకరించారు. ఆనకట్టపై ఆయన పేరుతో ఫలకాన్ని ఏర్పాటు చేశారు.

1897-99లో, ఎత్తును తొమ్మిది అంగుళాలు పెంచారు. 1862-67 మధ్య ఆనకట్ట ఎత్తు రెండు అడుగుల మేర పెరిగింది. ఆనకట్ట బలహీనపడటంతో, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1970లో రోడ్డుతో కొత్త ఆనకట్టను ప్రారంభించి 1982లో పూర్తి చేసింది. దీనికి సర్ ఆర్థర్ కాటన్ పేరు పెట్టారు.

Also read: గోదావరి తీరంలో బుల్డోజర్ నడిపిస్తారా?!

ప్రపంచ వారసత్వ కట్టడం

సర్ ఆర్థర్ కాటన్  బ్యారేజ్ ప్రపంచ నీటిపారుదల వారసత్వ నిర్మాణంగా గుర్తించబడింది.  నీటి పారుదలపై అంతర్ జాతీయ కమిషన్ (ICID) దీనిని వారసత్వ నిర్మాణంగా ధృవీకరించింది. ఆస్ట్రేలియా లోని అడిలైడ్ లో అంత ర్జాతీయ సదస్సులో ప్రపంచ వారసత్వ నీటి పారుదల కట్టడంగా ధవళేశ్వరం బ్యారేజీని గుర్తిస్తూ అవార్డును ప్రకటించారు.ఇది ఉభయ గోదావరి జిల్లాలకు ఆనందదాయకం…దేశానికి గర్వకారణం. ప్రాతఃస్మరణీయుడు కాటన్ కు ఘనమైన నివాళి.

Also read: నేటి నుంచి దూసుకుపోనున్న రైళ్లు…గరిష్ట వేగం గంటకు 130 కిలోమీటర్లు!

Voleti Diwakar
Voleti Diwakar
వోలేటి దివాకర్ ఆంధ్రభూమి దినపత్రికలో రాజమహేంద్రవరం కేంద్రంలో రెండు దశాబ్దాలకు పైగా పని చేశారు. అంతకు ముందు స్థానిక దినపత్రికలో పని చేశారు. గోదావరి పుష్కరాలు సహా అనేక రాజకీయ, సాంస్కృతిక, సామాజిక ఘట్టాలపై వార్తారచన చేశారు. ప్రస్తుతం ఆన్ లైన్ పత్రికలకు వార్తలూ, వ్యాఖ్యలూ రాస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles