Sunday, September 15, 2024

న్యాయమూర్తులకూ, నాయుడికీ ఉన్న బంధాలను వెల్లడించిన ఏబీకే ప్రసాద్

  • ఎవరా తెలుగు న్యాయమూర్తి?
  • తెలిసినా రాయకుండా వదిలేసిన సంపాదక ప్రముఖుడు

మన రాష్ట్ర హైకోర్టులోనే బాబు తాను ప్రమోట్‌ చేసిన న్యాయమూర్తిని సుప్రీంకోర్టుకి పంపి, ఈరోజుదాకా సాకుతూ వస్తున్నాడు.  బ్రిటన్‌ ప్రభుత్వ విభాగం అయిన DFID(Department for International Development) ప్రొఫెసర్‌ జేమ్స్‌ మానర్‌ (ససెక్స్‌ యూనివర్సిటీ) ద్వారా చంద్రబాబు హయాంలో నిధుల వాడకం ఎలా జరుగుతుందో అధ్యయనం చేయించింది (2002–2003). దాని ప్రకారం, ‘పెక్కు భారత రాష్ట్రాల్లో మా సంస్థ సాధికారిక సంస్థలతో మాత్రమే చర్చలు జరుపుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అథికార సంస్థలను మినహాయించి కేవలం ఒకే ఒక వ్యక్తితో (చంద్రబాబుతో) మాత్రమే చర్చలు జరపాల్సి వస్తోంది. అధికారులతో ఇంటరాక్షన్‌ అసలు ఉండదు’.

“At the apex level major kickbacks are received for its award of govt contracts in hundreds of cases. Legislators have been permitted to divert the one third of the funds…  many take bribes for favours and collaborate in extortion of criminal gangs. Chief Minister prefers the appearance of reform to the reality. This chief minister sometimes acquires substantial leverage with justice of the high court of AP.  He made intelligent use of a reasonable advocate general who sets the tone for institutional relations with the court”  అని ఆ నివేదికలో వ్యాఖ్యానించింది

అంతేగాక, ‘అడ్వకేట్‌ జనరల్‌ న్యాయమూర్తులతో చక్కటి సంబంధాలను నెరిపేవారు. అలాగే చంద్రబాబు నాయుడికి కూడా న్యాయమూర్తులతో అనుబంధం పెరుగుతూ వచ్చింది. అలాగే చంద్రబాబు ప్రభావం కూడా పెరిగింది. ఎందుకంటే ప్రధాన న్యాయమూర్తితో ఆయన సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకోగలిగాడు’’ అని ఆ నివేదిక పేర్కొంది.

హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టీస్‌ బీఎస్‌ఏ స్వామి సహచర న్యాయమూర్తులకు రాసిన బహిరంగ లేఖ (2001–2003)లో ఇలా అన్నారు. ‘బయటి ప్రాంతాల నుంచి వచ్చిన ప్రధాన న్యాయమూర్తులతో ముఖ్యమంత్రి చాలా సన్నిహితంగా ఉండేవారనేది అందరికీ తెలి సిన విషయమే. తన 29 మంది ఎంపీల వల్లే కేంద్రప్రభుత్వం అధికారంలో ఉందనీ, కేంద్రప్రభుత్వం ఏది చేయాలో, ఏది చేయకూడదో కూడా తానే నిర్దేశించగలననీ  ముఖ్యమంత్రి  న్యాయమూర్తులతో తొలి పరిచయంలోనే చెప్పేవారు. జస్టిస్‌ ఎన్వీ రమణను తన మనిషిగా సీఎం పరిచయం చేసేవారు. చీఫ్‌ జస్టిస్‌కు ఏం కావాలన్నా రమణకు చెప్పవచ్చని సీఎం చెప్పేవారు. చీఫ్‌ జస్టిస్‌ తిరుపతిని సందర్శించినట్లయితే, జడ్జి ఆయనతో పాటు ఉండేవారు’ అని ఆలేఖ పేర్కొంది.

అన్నట్టు, ఒక కీలకమైన హత్యకు సంబంధించిన కేసులో సెషన్స్‌ కోర్టు ముద్దాయిలకు వివిధ సెక్షన్ల కింద ఖరారు చేసి తీర్పు చెప్పగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు బెంచి 17 ఆగస్టు 2012న ఆ కేసును రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పుని కాస్తా సుప్రీంకోర్టు డివిజన్‌ బెంచి కొట్టేసింది. హైకోర్టు తీర్పుని కొట్టివేస్తూ సుప్రసిద్ధ సుప్రీం న్యాయమూర్తులు పినాకీ చంద్రఘోష్, ఆర్‌.ఎఫ్‌. నారీమన్‌ హైకోర్టు తీర్పుని ‘ఆమోద యోగ్యం కాని, వక్రబుద్ధితో కూడిన (పర్వర్స్‌) తీర్పుగా ప్రకటించా రని’ జ్యుడీషియల్‌ అకాడమీ మాజీ డైరెక్టర్‌ మంగారి రాజేందర్‌ ఒక పత్రికలో వెల్లడించారు. ఇంతకూ ఆ ‘పర్వర్స్‌’ తీర్పుని వెలువరించి సుప్రీం తీవ్ర విమర్శకు, అభిశంసనకు గురైన ఆ తెలుగు న్యాయ మూర్తులు ఎవరై ఉంటారో చెప్పగలిగిందెవరు?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles