Monday, May 6, 2024

సింగరేణి అధికారులకు పిఆర్‌పి చెల్లింపుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

  • అధికారులకు పి.ఆర్‌.పి. చెల్లింపు సీఎం అంగీకారం
  • పిఆర్‌పి కింద 111 కోట్ల రూపాయల మంజూరు
  • సీఎంకు  కృతజ్ఞతలు తెలిపిన సింగరేణి అధికారుల సంఘం

సింగరేణి అధికారులు, కార్మికులకు 2018-19 సంవత్సరానికి చెల్లించాల్సిన పిఆర్‌పి (ఫెర్ఫార్మెన్సు లింక్‌డ్‌ రివార్డ్‌ స్కీం)ని చెల్లించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం (జనవరి 06వ తేదీ) నాడు అంగీకరించారు.  కోల్ ఇండియా సంస్థ ప్రతీ ఏడాది కార్మికులకు పనితీరును బట్టి పిఎల్‌ఆర్‌ఎస్‌ను దీపావళి బోనస్‌ పేరుతోచెల్లిస్తుంది. ఇదే రకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సింగరేణి కార్మికులకు ప్రతీ ఏడాది లాభాలలో  బోనస్‌ తో పాటు దీపావళి బోనస్‌ కూడా చెల్లించడానికి అనుమతిస్తున్నారు. 2019-20 సంవత్సరంలో లాభాల బోనస్‌ 28% శాతం కింద 278 కోట్ల రూపాయలు, దీపావళి బోనస్‌ కింద 261 కోట్ల రూపాయలు మొత్తం కలిపి 539 కోట్ల రూపాయలు చెల్లించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారు. దీంతో ఒక్కొక్క కార్మికుడు సగటున లక్షా 60 వేల రూపాయలను బోనస్ గా పొందనున్నాడు.

ఇది చదవండి: కొత్తగూడెంలో జరిగిన 99వ సింగరేణి వార్షిక జనరల్‌ బాడీ మీటింగ్‌

కార్మికులకు దీపావళి బోనస్‌ – అధికారులకు పిఆర్‌పి

అయితే కార్మికులకు చెల్లించినట్లు అధికారులకు దీపావళి బోనస్‌ చెల్లించరు. దీనికి ప్రత్యామ్నాయంగా కేంద్ర భారీ పరిశ్రమ మంత్రిత్వ శాఖ పిఆర్‌పి ని చెల్లించాలని 2007లో నిర్ణయించారు. దీని ప్రకారం దేశంలో గల 230 భారీ పరిశ్రమల్లో పనిచేసే అధికారులకు వేతన సవరణ చట్టం ప్రకారం ప్రతీ ఏడాది ఆయా పరిశ్రమల పనితీరు ఆధారంగా పిఆర్‌పి (ఫెర్ఫార్మెన్సు లింక్‌డ్‌ రివార్డ్‌ స్కీం)ని చెల్లిస్తూ వస్తున్నారు. కోల్ ఇండియాతో పాటు సింగరేణికి కూడా ఇది వర్తిస్తుంది. 2007 నుండి కోల్ ఇండియాలో అమలుల్లో ఉన్నప్పటికీ సింగరేణిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకూ ఈ పిఆర్‌పి చెల్లించ లేదు. దీని వలన ప్రతీ ఏడాది నష్టం వాటిల్లుతుందని అధికారులు వాపోతున్నారు. కానీ 2014-15లో సిఎండి గా నియమితులైన ఎన్‌.శ్రీధర్‌ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో సమస్యలపై ఆయన సానుకూలంగా స్పందిస్తూ, అదే ఏడాది నుండి పిఆర్‌పి అమలుకు అంగీకరించారు. 2018-19 నాటి పిఆర్‌పి 111 కోట్ల రూపాయల చెల్లించడంద్వారా సింగరేణిలోని 2,500 మంది అధికారులు లబ్ధి పొందనున్నారు. దీంతో సింగరేణి అధికారులు సుమారు లక్ష రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు పిఆర్‌పి గా పొందనున్నారు.

ఇది చదవండి: నీటిపై తేలియాడే సోలార్‌ ప్లాంటుల నిర్మాణంపై సింగరేణి యోచన

సీఎంకు ధన్యవాదాలు తెలిపిన సంస్థ సీఎండి, అధికారుల సంఘం

పిఆర్‌పి చెల్లింపుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించడంతో కోల్‌ మైన్స్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సింగరేణి బ్రాంచ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు  రమేష్‌, ఎన్‌.వి.రాజశేఖర్‌ రావు లు కృతజ్ఞతలు తెలిపారు. పిఆర్‌పి ని కోల్‌ ఇండియాలో 2007 నుండే అమలు జరుపుతున్నప్పటికీ సింగరేణిలో తెలంగాణా వచ్చేంత వరకూ అమలుకాలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ కనబరచడంతో కల సాకారమయిందని అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇది చదవండి: ఎమ్మెల్సీకవితతో సింగరేణి ఎస్సి ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నేతల భేటి

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles