Tuesday, April 30, 2024

యూపీలో చరిత్ర సృష్టించిన బీజేపీ, రెండో సారీ అఖండ విజయం

  • ప్రజల హృదయాలను గెలుచుకోవడంలో ప్రతిపక్షాల వైఫల్యం
  • రైతుల ఆగ్రహం ఎన్నికల ఫలితాలలో ప్రతిఫలించని వైనం
  • మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి యోగీ రెడీ
  • బీఎస్పీ, కాంగ్రెస్ దొందూదొందే

బీజేపీ ఉత్తరప్రదేశ్ లో అధికారం నిలబెట్టుకొని చరిత్ర సృష్టించింది. గత ఆరు అసెంబ్లీ ఎన్నికలలోనూ ఒక అధికార పార్టీని గెలుపొందడం ఇదే ప్రథమం. మొదట పాతికేళ్ళ కిందట బీజేపీ, ఇరవై ఏళ్ళ క్రితం ఎస్ పీ, పదిహేనేళ్ళ కిందట బిఎస్ పీ, పదేళ్ళ కిందట, అంటే 2012లో ఎస్ పీ, 2017లో  బీజేపీని గెలిపించిన యూపీ ఓటర్లు ఈ సారి అధికారంలో ఉన్న బీజేపీని ఆనవాయితీ ప్రకారం తిరస్కరించి వేరే పార్టీకి పట్టంకట్టకుండా బీజేపీనే మళ్ళీ అఖండ మెజారిటీతో గెలిపించడం విశేషం. అయితే, సమాజ్ వాదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైనన్ని స్థానాలు గెలుచుకోకపోయినప్పటికీ 2017 నాటి కంటే చాలా ఎక్కువ సీట్లు గెలుచుకున్నది. అప్పటి కంటే 72 స్థానాలు అధికంగా సంపాదించింది. అది గొప్ప విశేషం. మాయావతి నాయకత్వంలోని బీఎస్ పీ ఈ సారి కుదేలయింది. పోటీలో అన్యమనస్కంగా పాల్గొన్నది. కాంగ్రెస్ తరఫున ప్రియాంకాగాంధీవద్రా శ్రమించినప్పటికీ ఫలితం బొత్తిగా దక్కలేదు.

యోగీ ఆదిత్యనాథ్ మరోసారి ముఖ్యమంత్రిగా పదవీస్వీకారానికి సిద్ధంగా ఉన్నారు. రైతులు ఆగ్రహంగా ఉన్నారనీ, ఉత్తరప్రదేశ్ పశ్చిమభాగంలో బీజేపీ దెబ్బతింటుందనీ అనుకున్నారు. అది కూడా ఊహమాత్రంగానే మిగిలిపోయింది. వెస్టర్న్ యూపీలో బీజేపీ బ్రహ్మాండంగా గెలుపొందింది. 403 స్థానాలు ఉన్న యూపీ అసెంబ్లీలో బీజేపీ 274 స్థానాలనూ, సమాజ్ వాదీపార్టీ 124 స్థానాలనూ గెలుచుకున్నాయి. బీఎస్పీ , కాంగ్రెస్ లు వరుసగా ఒకటి, రెండు స్ర్థానాలు గెలుచుకున్నాయి.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్ లోనూ, ప్రతిపక్ష నాయకుడు అఖిలేష్ యాదవ్ కర్హాల్ లోనూ, ఆయన పినతండ్రి శివపాల్ యాదవ్ జస్వంత్ నగర్ లోనూ, ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య సిరాతులోనూ విజయాలు సాధించారు.

సమాజ్ వాదీ పార్టీ 2017 ఎన్నికలలో కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకున్నది. 2019 లోక్ సభ ఎన్నికలలో బీఎస్పీతో ఎన్నకల పొత్తు కుదుర్చుకున్నది. రెండు ప్రయోగాలూ దారుణంగా విఫలమైనాయి. అందుకని ఈ సారి ఓబీసీలకు చెందిన చిన్నాచితకా పార్టీలను దరిచేర్చి ఒక కూటమి నిర్మించింది. యాదవ్ లూ, ముస్లింలూ, ఓబీసీలూ కలసి బీజేపీకి గట్టిపోటీ ఇస్తారని పరిశీలకులు భావించారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ రెండు పర్యాయాలు యూపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయినప్పటికీ ఫలితాలు బీజేపీకి అనుకూలంగానే వచ్చాయి. ఇందుకు ప్రధాన కారణం ప్రభుత్వ సంక్షేమపథకాలు (ముఖ్యంగా గ్యాస్ సబ్సిడీ)పేద ప్రజలకు చేరుతున్నాయి. శాంతిభద్రతల విషయం యోగీ హయాంలో మెరుగనే అభిప్రాయం జనబాహుళ్యంలో ఉంది. అఖిలేష్ హయాంలో ఒక గ్రామంలో పోలీసు స్టేషన్ ఆ గ్రామ నాయకుడైనా యాదవ్ చేతిలోనో, ఒక ముస్లిం నాయకుడి చేతిలోనో ఉండేది. ఆ నాయకుడు చెప్పినట్టు పోలీసులు నడుచుకునేవారు. బీజేపీ హయాంలో పోలీసు స్టేషన్లపైన బీజేపీ స్థానిక నాయకుల పెత్తనం లేకుండా సీఎంఓ (చీఫ్ మినిస్టర్ ఆఫీసు) కట్టుదిట్టమైన నియంత్రణ పెట్టుకున్నది. అందువల్ల శాంతిభద్రతల పరిస్థితి కొంత మెరుగు. హిందూత్వవాదం ఉండనే ఉంది. ప్రధాన ప్రతిపక్షాలైన ఎస్ పీ, బీఎస్ పీ, కాంగ్రెస్ ల మధ్య ఐకమత్యం లేదు. ఈ కారణాల వల్ల బీజేపీని ప్రజలు మళ్ళీ గెలిపించారని అనుకోవలసి వస్తుంది.  

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles