Saturday, May 4, 2024

ప్రయోగాల బాటలో ఆర్టీసి

  • నష్టాల తగ్గించుకునే దిశగా అడుగులు

నల్లగొండ: అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీ పరిస్ధితి కరోనా ఎఫెక్ట్ తో మూలిగే నక్క పై తాటిపండు అన్న చందంగా తయారైంది. దీని నుంచి ఆర్టీసీని గట్టెక్కించేందుకు సరికొత్త ఆదాయ మార్గాలు అన్వేషిస్తున్నారు అధికారులు. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్శిల్స్, కొరియర్ సర్వీస్ లను ప్రారంభించిన ఆర్టీసీ తాజాగా డ్రైవింగ్ స్కూల్స్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. దీనిద్వారా ఆర్టీసీ అదనపు ఆదాయం పొందడమే కాకుండా నష్టాలను పూడ్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆర్టీసీ సంస్థ ప్రారంభించిన  పార్శిల్స్, కొరియర్ సర్వీస్ ఆర్టీసీకి మంచి ఆదాయాన్ని తెచ్చి పెడుతోంది.

డ్రైవింగ్ స్కూల్స్

దీంతోపాటు  ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్స్ ఏర్పాటు చేసి మరింత ఆదాయం పొందేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లా కేంద్రాల్లో ఈ ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్స్ ను  ఏర్పాటు చేయనున్నారు. మరో వారం పదిరోజుల్లో వీటిని ప్రారంభించనున్నట్లు సమాచారం. ఆర్టీసీ లోని సీనియర్ డ్రైవర్ల ద్వారా డ్రైవింగ్ పాఠాలతోపాటు ఫీల్డ్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ప్రజల నుంచి వచ్చే ఆదరణ ను బట్టి మరిన్ని డ్రైవింగ్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ డ్రైవింగ్ స్కూల్స్ లో కేవలం భారీ వాహనాలకు మాత్రమే శిక్షణ ఇవ్వనున్నారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ను బట్టి తర్వాత లైట్ మోటార్ వెహికిల్ డ్రైవింగ్  కూడా నేర్పించనున్నారు.

ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్ లో  డ్రైవింగ్ పాఠాలు  నేర్పేందుకు బస్సులో ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. బస్సులో రెండు వైపుల స్టీరింగ్ ,క్లచ్, బ్రేక్ మరియు ఎక్సలేటర్ అమర్చుతున్నారు. ఇక హెవీ వెహికిల్స్ డ్రైవింగ్ నేర్చుకుందుకు ట్రైనీలు 15 వేల 8 వందలు రూపాయిలు చెల్లించాల్సి ఉంటుంది. 20 సంవత్సరాల వయస్సు పైబడి ఒక సంవత్సరం ముందు లైట్ మోటర్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉన్న వారికి  రీజనల్ మేనేజర్, డిపో మేనేజర్ పర్యవేక్షణ లో  వెహికిల్ డ్రైవింగ్ నేర్పనున్నారు. ఆర్టీసీ లో డ్రైవింగ్ స్కూల్స్ ఏర్పాటు చేయడం వల్ల ఎంతోమందికి ఉపయోగపడుతుందంటున్నారు ఆర్టీసీ ఉద్యోగులు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటపట్టించేందుకు ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్స్ ఉపయోగపడే అవకాశం ఉంది. ఇలాంటి సరికొత్త ప్రయోగాలతో అయినా ఆర్టీసీ నష్టాలనుంచి గట్టెకుతుందో లేదో చూడాలి మరి!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles