Saturday, May 4, 2024

19 మంది మహిళా ఖైదీలకు విముక్తి

యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నమహిళలను సత్ప్రవర్తన ప్రాతిపదికన ముందుగానే విడుదల చేయాలన్న ఏపీ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు రాజమహేంద్రవరం కేంద్రకారాగారం నుంచి  19 మంది విడుదలయ్యారు.  ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తీసుకున్న నిర్ణయం మేరకు వారు అప్పడే విడుదల కావలసి ఉంది. కానీ కరోనా పరిస్థితుల కారణంగా జాప్యమైంది. మహిళా ఖైదీలు  జైలులో వివిధ రకాల శిక్షణ తీసుకోగా, అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా ఇద్దరు పీజీ, ఇద్దరు డిగ్రీ పట్టభద్రులయ్యారు. విడుదలైన మహిళా ఖైదీల్లో ప్రధానంగా వరకట్న కేసుల్లో శిక్ష అనుభవించినవారున్నారు.

 ఈ జైలుతో పాటు కడప నుంచి 27 మంది, నెల్లూరు నుంచి అయిదుగురవిశాఖపట్నం నుంచి ఇద్దరి విడుదలకు సంబంధించి  ప్రభుత్వం   ఉత్వర్వులు జారీ  చేసిన సంగతి తెలిసిందే.  క్షమాభిక్షతో విడుదలైన వీరికి శ్రీ త్రిదండ శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్‌ స్వామి ట్రస్ట్‌  సౌజన్యంతో కుట్టు మిషన్లు అందచేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles