Friday, June 21, 2024

వరవరరావుకు స్వేచ్ఛ వచ్చేది ఎప్పుడు?

  • హేమలత ఆవేదన తీరేది ఎన్నడు?

విప్లవ కవి, సరికొత్త సమాజం కోసం విప్లవ రచయిత ల సంఘం స్థాపించిన పెండ్యాల వరవరరావు సంకెళ్ల నుంచి విముక్తి కావడం ఎప్పుడు జరుగుతుందో తెలియదు. కానీ ఆయన జీవితమంతా నాలుగు గోడల మధ్య, తన భావాలను పంచుకునే ఆత్మీయులు లేకుండా, జైలు జీవితంలోనే గడిచిపోతోంది. ఎన్నో కేసుల్లో ఆయన అపరాధి అని తేల్చడానికి లాయర్లు పడుతున్న శ్రమ వృధా అవుతోంది దేశ విద్రోహిగా ఆయనపై మోపిన నేరాలు ఆయనను కుటుంబ సభ్యులకు దూరం చేశాయి. ఆయన దొర నుండి సామాన్య మానవునిగా మార్చి చిన్న పెండ్యాల నుండి పోరాటాల ఖిల్లా వరంగల్ కు మారినప్పటి నుండి ఆయన కష్టాలు మొదలయ్యాయి. తన చదువుకు కార్యకారణ సిద్ధాంతాన్ని జోడించి పిల్లలకు పాఠాలు బోధించడం నేరమైంది. సికెఎమ్ కాలేజీలో ఆయన బోధనను జీర్ణించుకున్న పిల్లలు అడవుల పాలవుతున్నారని పాలకులు ఆయనను అదుపులో పెట్టే ప్రయత్నం చేసి సఫలం అయ్యారు. ఎనభై మూడేళ్ళ ఆయన జీవితంలో పాతిక కేసుల్లో ఆయన దొంగ తనం చేసినట్టు సంకెళ్లు వేసి జైలు కు తరలించిన తీరు ప్రజాస్వామ్య వాదుల చేత కూడా కంటతడి పెట్టించింది. తరువాత ఆయన భార్య హేమలత యాభై ఏళ్ళ నుండి పడ్డ మానసిక వేదన ఎవరూ తీర్చలేరు.

Provide Varavara Rao facility for reading, writing in jail, activist's wife  urges Maharashtra govern- The New Indian Express

యాభై ఏళ్ల వైవాహిక జీవితం లో భర్త కోసం కూడా విప్లవోద్యమాన్ని భుజాల మీద వేసుకొని ఆమె కూడా జైలు పాలయ్యారు. పోలీసుల నిఘా మధ్య వరంగల్లోని గల్లీ గల్లీలో చంటి పిల్లలను పట్టుకొని ఆమె ఇంటింటా తిరిగి పిల్లలను ప్రయోజకులను చేశారు! ఎనభై ఏళ్ళ వయసులో తన భర్తను కాపాడుకోవడానికి మహారాష్ట్రలో బందీ అయిన వరవరరావుని అక్కున చేర్చుకునే ప్రయత్నం చేస్తునే ఉన్నారు. కోరేగావ్- భీమా కేసులో నిందితుడు అయిన వరవరరావు ను ఆయన వయసు దృష్ట్యా బెయిల్ వ్యాజ్యం పై వాదనలు వినిపించే ముందు ఆయన వయసును దృష్టిలో పెట్టుకోవాలని ఎన్ ఐ ఏ కు మహారాష్ట్ర ప్రభుత్వానికి బాంబే హైకోర్టు కూడా సూచన చేసింది.

పెండ్యాల వరవరరావు వరంగల్ సమీపంలోని చిన్న పెండ్యాల లో 1940 లో జన్మించారు.1968-1989 మధ్య వరంగల్ లో ఒక లెక్చరర్ గా ఆయన బోధనలు విద్యార్థులు విప్లవకారులు గా తయారు అయ్యే ప్రమాదం ఉందని ఆయనను పాలకులు బందీ చేశారు. సామాజిక సృజన కోసం అదే పేరిట స్థాపించిన పత్రిక ఆయనకు శాపమైంది! సృజన రాతలు ఆయనను రాడికల్ గా ముద్రవేశాయి. తరువాత ఆ పత్రిక బాధ్యత మోసిన ఆయన భార్య హేమలత కూడా జైలు పాలయ్యారు! 1986 టాడా కేసు మినహా మిగతా 17 కేసుల్లో ఆయన నిరపరాధి! అయినా ఈ ముసలాయన ఇంట్లో కూర్చుని యువతరాన్ని ప్రభావితం చేస్తాడని ఆయన స్థాపించిన విప్లవ రచయుతల సంఘం నామ రూపాలు లేకుండా చేయాలని పోలీసులు ఆయనను ఏదో కేసుల్లో బందీ చేస్తూనే ఉన్నారు! ఇప్పుడు రాష్ట్రం బయట మహారాష్ట్రలో జైలు జీవితం గడుపుతూ మనస్థిమితం కోల్పోయేలా జీవితం గడుపుతున్నారు! ఆయన రాసిన మౌనం యుద్ధ నేరం స్వేచ్ఛ ఆయన కోరుకున్న జీవితాన్ని ఇవ్వలేకపోయాయి. కారణం ఆయన భావ వ్యక్తీకరణ పాలకులకు రుచించదు! కనుక ఆయన స్వేచ్ఛ లేని జీవితానికి కారణం అయింది! కాలం చెల్లిన కమ్యూనిజం పట్టుకు వేలాడడం వరవరరావు చేస్తున్న నేరంగా కూడా ఆయనను విమర్శించే వారు అంటున్న మాటలు ఆయనకు రుచించక పోవచ్చు కానీ ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని వదలకుండా రాజీ పడని ఆయన సమసమాజ స్థాపన ఆయనను శిఖరం పై కూర్చోబెట్టింది! వరవర అంటే శ్రేష్ఠుల్లో కల్లా శ్రేష్ఠుడు అని అర్థం ఆయన ప్రత్యేకత కూడా అదే కావచ్చు. చావుకు దగ్గరయ్యి తన చదువు తనకు శాపమైందని ఆయన ఆవేదన పడుతున్నారో లేదో కానీ ఆయన అందరిలా ఉంటే ఈ పాటికి పిల్ల జెల్లా మనవళ్లు మనవరాల్లతో జనజీవన స్రవంతిలో అద్భుత జీవనం అనుభవించే వారని ఆయన అభిమానులు అంటున్న మాటలు.

Release Varavara Rao', demands family after he fell ill in Pune jail

వరవరరావు భార్య తన కూతుళ్లు సహజ, అనల, పవన లతో గత ముఫై ఏళ్లుగా చేస్తున్న జీవనపోరాటం మాములుది కాదు. వరవరరావు జైలు లో, హేమలత బయట మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ఎన్ని కుట్ర కేసులు ఎన్ని విద్రోహ ముద్రలు. పిల్లల బాల్యం అంతా పోలీసుల బూట్ల చప్పుళ్ల మధ్య నాన్న ప్రేమకు దూరమయ్యి గడుపుతున్న వాళ్ల మానసిక వేదన ఎప్పుడు బహిర్గతం చేయలేదు. 2018 నుండి మహారాష్ర్ట జైలులో మగ్గుతున్న తన భర్తను ఈ వయసులో మానసిక వేదనకు గురిచేయవద్దని హేమలత నాయకులకు చేస్తున్న విజ్ఞప్తి అరణ్య రోదనే అవుతోంది. ఏమి పాపం చేశామో అనే అంతర్మధనం హేమాలతకు వచ్చిందో లేదో కానీ ఆమె కార్చిన కన్నీళ్లు మాత్రం రాతి గుండెను కూడా కరిగిస్తాయి. తెలంగాణ కరణం దొరగా శ్రేష్ఠుడిగా గ్రామంలో పెద్ద భూస్వామి గా బ్రతికి ఉద్యోగం తో రిటైర్ అయ్యి బోధన నామ మాత్రం చేస్తే ఆయన జీవనం అందరూ లెక్చరర్ల మాదిరిగా గడిచిపోయేది! సమ సమాజ స్థాపన లో వరవరరావు ఎంచుకున్న బాట ఎనభై ఏళ్ళు అయినా వార్తల్లోని వ్యక్తిగా ఉంటూ దేశ వ్యాప్త గుర్తింపు వచ్చిందేమో కానీ ఆయన తో పాటు కుటుంబ సభ్యులు పడుతున్న మానసిక వేదన పగవాడికి కూడా రావద్దు!!

Ramprasad Rao Bandaru
Ramprasad Rao Bandaru
Mr. Bandaru Rama Prasad has been a journalist since his 21st year. Starting with Andhra Bhoomi as a sub-editor he became desk in-charge at Andhra Prabha before becoming a freelancer and a script writer in electronic medium. Did his MA from Osmania University. He founded Amrita Tele Films..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles