Friday, April 26, 2024

విశ్వరూప సందర్శనం

భగవద్గీత – 54

ఒక జ్యువలరీ షాపులోకి వెళ్ళాము. కళ్ళు జిగేల్‌ మనిపించేలా రకరకాల ఆభరణాలు. ఒకదానిని మించిన పనితనం మరొకదానిలో. అన్నింటికన్నా బాగున్నది అని అనిపించినదానిని Select చేసుకున్నాము.

ఒక నగ అన్నింటికన్నా బాగున్నది అని ఎందుకనిపించింది ?

మనకు ప్రతిదానినీ విడివిడిగా చూడటం అలవాటు కాబట్టి, అలా విడివిడిగా కాకుండా అన్నింటినీ కలిపిచూస్తే?

Also read: మోహం తొలగించుకోవడం ఎలా?

అంటే? అన్నింటా ఉన్నది బంగారమేగా. ఇక బాగు ఓగుల ప్రశ్న ఎందుకు? ఏదైనా ఒకటే కదా బంగారమేగా. అన్ని నగలలోనూ వ్యాపించి ఉన్నది బంగారమేగా.

ఆ దృష్టి అన్నమాట. అలాగే సృష్టిని విడివిడిగా చూస్తే నువ్వు, నేను, అతడు, అది, ఆ జీవి…

కానీ సమగ్రంగా అన్నింటినీ కలిపి చూస్తే? సర్వభూతస్తమాత్మానమ్‌ అని ఆత్మగా ఉన్న పరమాత్మే దర్శనమిస్తాడు …

విశ్వం మొత్తాన్ని సమగ్రంగా ఒకే దృష్టితో చూడటమే ‘‘విశ్వ’’రూప సందర్శనము. అదే పరమాత్మ. అనేక బాహూదర నేత్ర వక్త్రమ్‌ అని చెపుతూ… అన్నీ నాలోనే ఉన్నాయి అని విశదపరచారు…

Also read: నోరు మంచిదవుతే ఊరు మంచిదవుతుంది

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles