Friday, October 4, 2024

నరకంలో ప్రవేశించేందుకు మూడు ద్వారాలు

భగవద్గీత – 64

మన ఇంట్లోకి ప్రవేశించడానికి ఉండే మార్గము ద్వారము.  ప్రధాన మార్గాన్ని సింహద్వారము అని పిలుస్తాము. అలాగే నరకములోకి ప్రవేశించడానికి మూడు ప్రధాన ద్వారాలున్నాయట!

నరకము అంటే ఏమిటని అడుగుతారా?

నరకమంటే దుర్గతి. పాపముచేసి అనుభవించే దుర్గతి.

పాపము అంటే? పరులను పీడించడమే పాపము.

Also read: సాత్త్విక తపస్సులు

‘‘పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనమ్‌’’ అని వ్యాసభగవానుడు ఏనాడో నిర్వచించారు.

సరే ఆ మూడు ద్వారాల పేర్లేమిటి?

ఒకటి – కామము

రెండు – క్రోధము

మూడు – లోభము

కామము

మనస్సును ఇష్టంవచ్చినట్లుగా అదుపులేకుండా కనపడిన ప్రతిదానిమీద ప్రసరింపచేసి స్వంతం చేసుకోవాలని ఆరాటపడటం. ఇదే కామము …

కనపడ్డ స్త్రీ కావచ్చు, పురుషుడుకావచ్చు, కనపడ్డ వస్తువుకావచ్చు, అవసరానికి మించిన ఏ కోరిక అయినా కామమే.

Also read: మానసిక తపస్సు అంటే ఏమిటి?

సరే ఈ కామము ఉంటే ఏమవుతుంది?

కావాలనుకున్నదానికోసం మనిషిని నిలువనీయక కానిపనులన్నీ చేయించి చివరకు నాశనమయ్యేలా చేస్తుంది. అందుకు రావణాసురుడే ఉదాహరణ.

లెక్కలేనంతమంది అపూర్వ సౌందర్యరాశులయిన నారీమణులు తనను కోరివచ్చినవారుండగా, వారితో సుఖించక సీతమ్మకోసం వెంపర్లాడాడు. తాడిదన్నేవాడుంటే వాడి తలదన్నేవాడుంటాడుగా!

రామచంద్రమూర్తి చేతిలో తానేకాకుండా తన బంధుమిత్రులు తనవారినందరూ హతులయ్యారు, నాశనమయిపోయారు.

పడతిమీదకోరిక!

పదవిమీదకోరిక!

పదార్ధంమీద కోరిక!

Desire of carnal gratification. వీటిని సాధించడమే విజయం అని మన ప్రస్తుత నాగరిక సమాజం నూరిపోస్తున్నది. ఆ బాట పట్టినవాళ్ళు అది నరకపుబాట అని తెలియక ముందుకు సాగుతున్నారు. టివీలలో ప్రకటనలలో తారల తళుక్కులు, ఎవరో సినిమాతారల కృత్రిమ సౌందర్యం మీద వ్యామోహం… ఇలా చెప్పుకుంటూపోతే అంతూ, దరీలేనివిధంగా తయారయ్యింది నేడు.

మరి రెండవ ద్వారం.

‘‘క్రోధం’’

క్రోధం అంటే?

కోపము, కినుక…క్రోధము వలన మనమేంచేస్తున్నామో మనకు వళ్ళూపైతెలియకుండా ఉండి బుద్ధినికోల్పోయి సర్వనాశనం చేసుకుంటాము. అది మనిషిని నిలువునా కాల్చివేస్తుంది.

Also read: శారీరిక తపస్సు అంటే?

The long-term physical effects of uncontrolled anger include increased anxiety, high blood pressure and headache.

 ఇక మూడవ ద్వారము.

లోభము

లోభమంటే? కక్కుర్తి, అత్యాశ. అంతా నాకే కావాలి పక్కవాడికేమీ వద్దు అనే అత్యాశ. అందుకే న్యాయపరమైన రాజ్యభాగము పాండవులకు ఇవ్వకుండా దుర్యోధనుడు సర్వనాశనమైపోయాడు కదా!

రామాయణం మనకు కామము పతనహేతువు అనిచెపితే, మహాభారతం లోభము ఇంకొక  పతనకారణమని చెప్పింది.

 త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః

కామఃక్రోధస్తథాలోభస్తస్మా దే తత్త్రయం త్యజేత్‌ !16-21

కాబట్టి నరక ద్వారాలయిన కామము, క్రోధము, లోభము ఈ మూడింటిని త్యజించమన్నారు పరమాత్మ.

Also read: సరి అయిన మాట భవిష్యత్తుకు పెట్టని కోట

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles