Monday, April 29, 2024

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై చే అయోధ్య రాముడి పాట‌ల ఆవిష్క‌ర‌ణ‌

 గేయ ర‌యిత  ధ‌ర్మ తేజ‌కు ప‌రిశ్ర‌మ వ‌ర్గాల ప్ర‌శంస‌లు

అయోధ్య రాముడిపై  తెలుగు, హిందీ భాష‌ల‌లో రూపొందించిన పాట‌ల‌ను తెలంగాణ గ‌వ‌ర్న‌ర్

డా. త‌మిళ‌సై ఆవిష్క‌రించారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, గేయ ర‌చ‌యిత ఓరుగంటి ధ‌ర్మ తేజ తెలుగులో ఈ పాట‌ల‌ను రాయ‌గా, హిందీలో స‌తీష్ శ్రీ వాస్త‌వ సాహిత్యాన్ని అందించారు.  బి. ఎస్‌. కృష్ణ మూర్తి సంగీతాన్ని అందించిన ఈ పాట‌ల‌ను   ది మ్యూజిక్ గ్రూప్ బృందం స‌హ‌కారంతో గాయ‌కుడు సాయి చ‌ర‌ణ్  తెలుగులో ఈ పాట‌ల‌ను పాడ‌గా,  హిందీలో సాయి చ‌ర‌ణ్‌, జ‌య‌రామ్ లు ఆల‌పించారు.

ధర్మతేజ రచించిన పాటలను ఆవిష్కరించిన గవర్నర్ తమిళసై

అత్యంత ప్రతిష్టాత్మ‌కంగా రూపొందించిన ఈ గేయాల‌ను త్వ‌ర‌లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడి ప‌రిశీలిస్తారు. అయోధ్య రాముడిపై తెలుగు వారికి అత్యంత విన‌సొంపైన పాట‌ల‌ను అందించే దిశ‌గా చేసిన ఈ ప్ర‌య‌త్నం ఫ‌లించ‌డంతో ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు ఆనందం వ్య‌క్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా ఈ పాట‌ల‌ను త్వ‌ర‌లో అయోధ్య‌లో జ‌రుగ‌నున్న ప్రతిష్టా కార్య‌క్ర‌మంలో ప్ర‌సారం చేయ‌నుండ‌డం విశేషం.

ధర్మతేజ

   కాగా,  తెలుగు గేయ ర‌చ‌యిత ఓరుగంటి ధ‌ర్మ తేజ సంగీత ద‌ర్శ‌కుడిగా, గేయ ర‌చ‌యిత‌గా ఇప్ప‌టికే అనేక సినిమాల‌కు, ఆల్బ‌మ్ ల‌కు , సీరియళ్ల‌కు ప‌ని చేశారు. ఆయ‌న సినిమాల‌కు రాసిన అనేక పాట‌లు జ‌న బాహుళ్యంలో బ‌హుళ ప్ర‌చారం పొందాయి. ప్ర‌స్తుతం కొన్ని నూత‌న చిత్రాల‌కు గేయాల‌ను, స్వ‌రాల‌ను స‌మ‌కూరుస్తున్న ధ‌ర్మ‌తేజ , ప్ర‌సిద్ధ గేయ ర‌చ‌యిత వేటూరి సుంద‌ర రామమూర్తి  శిష్యుడు కావ‌డం అంద‌రికీ తెలిసిందే… వేటూరి వారితో క‌లిసి ఆయ‌న వంద‌లాది చిత్రాల‌కు ప‌ని చేశారు. ప‌రిశ్ర‌మ‌లో ఓ స‌మ‌ర్ధ‌త  క‌ల్గిన గేయ ర‌చ‌యిత‌గా, సంగీత ద‌ర్శ‌కుడిగా పేర్గాంచిన ధ‌ర్మ తేజ అయోధ్య రాముడిపై పాట‌ల‌ను అందించ‌డం ప్ర‌శంసించ‌ద‌గిన విష‌య‌మ‌ని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు సంతోషం వ్య‌క్తం చేస్తున్నాయి.

Durga Prasad Dasari
Durga Prasad Dasari
దుర్గాప్రసాద్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఎస్ సీ (స్టాటిస్టిక్స్) చేశారు. జర్నలిజం ప్రస్థానం ‘ఉదయం’ తో ప్రారంభించారు. వార్త, ఆంధ్రభూమి, ఈటీవీ, సివీఆర్ న్యూస్, టీవీ5లలో పని చేశారు. ఈటీవీలో ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘తీర్థయాత్ర’ సీరియల్ కు మంచి వీక్షకాదరణ లభించింది. పది నవలలు రాశారు. పదుల సంఖ్యలో కథలు రాశారు. సినిమాలకు కథలు, స్క్రీన్ ప్లే, మాటలు రాయడమే కాకుండా సినిమాలలో నటిస్తున్నారు కూడా.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles