Saturday, July 13, 2024

తేయాకు తోటల్లో ప్రియాంక గాంధీ హల్ చల్

  • ప్రజలతో మమేకమవుతున్న ప్రియాంక
  • తేయాకు తెంపుతూ ఓటర్లను ఆకట్టుకునే యత్నం

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అసోంలో కాంగ్రెస్ ప్రచారం ఊపందుకుంది. అసోంలో కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ప్రారంభించారు. ప్రచారంలో భాగంగా ప్రియాంక  పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు.

Image

తేయాకు తోటల్లో పనిచేసే ఆదివాసీ మహిళలతో కలిసి తేయాకు తెంపారు. తేయాకు తోటల్లో వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారితో  కలిసి సంప్రదాయ ఝుమర్‌ నృత్యం చేశారు.

Image

కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న అసోం గత ఎన్నికల్లో అధికారాన్ని చేజార్చుకుంది.  దీంతో ఈ సారైనా అధికారం కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నేత దివంగత మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయి లేని ఆపార్టీకి పెద్ద లోటుగా కనిపిస్తోంది. దీంతో ప్రజలతో  మమేకమవుతూ పార్టీ విజయానికి ప్రియాంక్ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles