Wednesday, November 6, 2024

పేకాట ముఠా గుట్టు రట్టు….

  • టాస్క్ ఫోర్స్ అదుపులో57మంది.

 పేకాడడం సరాదాగా మొదలై వ్యసనంగా మారుతుండగా అదృష్టం వరిస్తే కాసులు దురదృష్టం వరిస్తే ఒంటిపై గుడ్డలు తాకట్టు పెట్టాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇందులో ముఖ్యంగా మూడు ముక్కలాట ఆడిన వారు తమ జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. కష్టపడి డబ్బు సంపాదించాలంటేనే చాలా కష్టం. అయినా అందులో పెద్ద కిక్ ఏముంది అనుకుంటున్నారో ఏమో కొందరు అక్రమార్కులు అడ్డదారిలో డబ్బులు సంపాదించడానికి అనేక ఐడియాలు వేస్తున్నారు. అలా పేకాట ద్వారా సులభంగా కాసులు రాబట్టేందుకు ఓ ముఠా పెద్ద నెట్ వర్క్ ఏర్పాటు చేసుకొంది. ఇందుకోసం ప్రత్యేకంగా కొంత మంది మనుషులు, కొన్ని రహస్య స్థావరాలను సైతం ఏర్పాటు చేసుకొని యథేచ్చగా పేకాట దందా సాగిస్తున్నారు. 

తాండూర్ పోలీస్ స్టేషన్ పరిదిలో  గుట్టుచప్పుడు కాకుండా పేకాట (అందర్-బహార్) ఆడిస్తున్న ఈ ముఠా గుట్టు టాస్క్ ఫోర్స్ & స్థానిక పోలీసులు రట్టుచేయడం జరిగింది అని మంచిర్యాల ,పెద్దపల్లి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏజెంట్ల ద్వారా రహస్య ప్రదేశాలను గుర్తించి పేకాట ఆడిస్తున్నారని తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేపల్లివాడ గ్రామ ప్రాంతంలో   డబ్బులు పందెం పెట్టి పేకాట ఆడుతున్నరని విశ్వసనీయ సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ &  తాండూర్ పోలీసులు సంయుక్తంగా  దాడి నిర్వహించగా 57 మందిని పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఒకరు పరారీలో ఉన్నట్లు సీపీ సత్యనారాయణ  తెలిపారు.

సప్త వ్యసనాలలో పేకాట ఒకటి. జూద ప్రియులు ఎవరెన్ని చెప్పిన, ఇల్లు, ఒళ్ళు గుల్ల అవుతున్నా పేకాట మాత్రం విడిచిపెట్టరు. పోలీసులు పట్టుకుంటారని తెలిసినా దొంగచాటుగా పేకాట ఆడుతూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని సీపీ సత్యనారాయణ అన్నారు. జూదం ఎంతకైనా తెగించేలా చేస్తుంది. ఈ వ్యసనం ఎన్నో జీవితాలను ఛిద్రం చేస్తుంది. ఏ పని చేసి అయినా పేకాట ఆటాడాలనే ఆత్రుత అనేది మనిషిన మరింత దిగజారేలా చేస్తుంది. పేకాట రాయుళ్లు కొత్త పద్ధతుల్లో ఎవరికీ దొరక్కుండా ఉండటం కోసం మొబైల్ పేకాట స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు.

అసలు సూత్రధారులు:

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం లా & ఆర్డర్ కి పెద్దపీట వేస్తూ పేకాటపై ఉక్కుపాదాన్ని మోపి అన్ని క్లబ్‌లను అరికట్టింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పేకాట క్లబ్‌లు మూతపడ్డాయి. తెలంగాణా లో ఆడడం వీలు కాదని పోలిసుల నిఘా ఎక్కవ ఉండడంతో ఈ పేకాట రాకెట్ కీలక సూత్రధారులు అనుగొండ సుదర్శన్ ,మాదారపు రామారావు, మాదారపు విజయ్ ,మహేందర్ రావు లు పేకాట రాయుళ్ళ వాట్సప్ గ్రూప్ లు ఏర్పాటు చేసి అందులో సందేశాలు పంపిస్తూ వారికీ పేకాట అడే ప్రాంతాన్ని  తెలియచేస్తారు . వీరు మహారాష్ట్ర లోని రాజురా ,బెంగుళూరు,ఛత్తీస్ గఢ్ లోని కుంట, చంద్రపూర్ మొదలగు  ప్రాంతలకు వాహనాలు ఏర్పాటు  చేసి పేకాట ఆడే ప్రాంతాలకు తీసుకెళ్తారు. డ్రైవర్ కి డబ్బులు చెల్లిస్తూ ఆడడానికి వచ్చిన పేకాట రాయుళ్లకి బిర్యానీలు మద్యం తో పాటు అన్ని వసతులు కల్పిస్తారు.

జూద ప్రియుల నెట్ వర్క్:

జూద ప్రియులు సాధారణంగా ఏ క్లబ్బులకో వెళ్లి తమ వాంఛను తీర్చుకుంటుంటారు. అదే విధంగా పేకాట రాయుళ్లు శివారు ప్రాంతాల్లోని తోటలలో గతంలో పేకాట ఆడేవారు. పోలీసులు పేకాటరాయుళ్ల పని పట్టడానికి ఇటీవల కాలంలో శివారు ప్రాంతాల్లో ఉన్న తోటలపై కూడా  దాడులు నిర్వహించడంతో  పేకాట రాయుళ్లు రూటు మార్చారు. కొంతమంది పటిష్ఠమైన నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకొని ఎవరికీ అనుమానం రాకుండా రహస్యప్రాంతాల్లో పేకాట ఆడిస్తున్నారని దీంతో ఇక్కడ పేకాండేందుకు  మంచిర్యాల ,పెద్దపల్లి ,జగిత్యాల ,కరీంనగర్ ,సిద్దిపేట్ జిల్లాలకు చెందిన పేకాటరాయుళ్లు పెద్ద సంఖ్యలో వస్తున్నట్లు సమాచారం అందినట్లు సీపీ తెలిపారు.

కేసులు పెడుతున్నా మారని వ్యసనపరులు:

పోలీసులు వరుసగా దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నా పలువురు పేకాట అడ్డాలు మారుస్తూ ఆటను యథావిధిగా కొనసాగిస్తున్నారు. పేకాట కోసం పలు పట్టణ కేంద్రాలలో ప్రత్యేక గదులతోపాటు, శివారు ప్రాంతాలను ఏర్పాటు చేసుకుని, భద్రత సైతం ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.  మరి కొందరు ఏకంగా నివాస ప్రాంతాల్లో గదులను అద్దెకు తీసుకుని మరి జూదాన్ని వ్యసనంగా మార్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. పేకాట ఆడే సమయంలో మద్యం, ఆహారంతోపాటు ఓడిపోయిన వారికి తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తుడడంతో  పేకాట రాయుళ్లు ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారు.

వాహనాలు ఒకచోట.. ఆడేది మరో చోట:

పేకాట రాయుళ్లు పోలీసుల కళ్లుగప్పేందుకు, దాడులనుండి తప్పించుకోవడానికి స్థావారాలను ఎప్పటికప్పుడు మార్చేస్తున్నారు. ఆటస్థలానికి వెళ్లే సమయంలో వాహనాలను రహస్య ప్రదేశంలో ఉంచి కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్లి మరొకచోట అడ్డా వేస్తున్నారు. ఆదివారంతో పాటు సెలవు దినాల్లో ఈ ఆట ఆడే వారి సంఖ్య రెండింతలుగా తయారయ్యింది.

వస్తువులు, వాహనాలు తాకట్టుపెడుతూ….

పేకాటలో డబ్బులు పొగొట్టుకున్నా బాధితులకు అప్పటికప్పుడే అప్పురూపేన ఇచ్చేందుకు కూర్చొన్నచోటేనే వడ్డీ వ్యాపారులు సిద్ధంగా ఉంటారు. కొన్ని చోట్ల ఆభరణాలు, వాహనాలను తాకట్టు పెడుతూ కుటుంబాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. రూ.5 నుంచి 10కి వడ్డీ రూపం లో తీసుకున్న డబ్బులను ఇంటికి తీసుకెళ్లకుండా అక్కడే ఆడాలని నిబంధలను పెడుతున్నట్లు సమాచారం. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు పేకాటకు బానిసై డబ్బు పోగొట్టుకున్న ఆవేదనలో మత్తులో మద్యం, గంజాయి లాంటివాటికి  అలవాటు పడుతున్నారని సీపీ తెలిపారు.

కఠిన చర్యలు:

పేకాట స్థావరాలపై తరుచూ దాడులు చేస్తున్నాం. రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిథి పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలలో పోలీసులు నిరంతరం నిఘాను పెడుతూనే ఉన్నారు. పట్టుబడిన ప్రతిసారి కేసులు నమోదు చేసిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపుతున్రనారు. అయినప్పటికీ సులభంగా డబ్బు సంపాదించాలని దురుద్దేశంతో కొంతమంది వ్యక్తులు పేకాట గృహాలను నిర్వహిస్తూ, పేకాట రాయుళ్లను ప్రోత్సహిస్తూ వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. ఇలాంటి వారి జాబితాను సిద్ధం చేసిన పోలీసులు వారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు

దాడుల్లో భాగంగా  పేకాట నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

1.అనుగొండ సుదర్శన్ s/o నాగయ్య 50 ఇయర్స్, రెడ్డి ,4-200/225 ఇందిరమ్మ కాలనీ, కిస్మత్పూర్. రాజేంద్రనగర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్

2. మాదారపు రామారావు s/o కిష్టయ్య 46yrs, 1-57/427 శ్రీ రామ్ నగర్ కాలనీ, కొండాపూర్ రంగారెడ్డి

3. మాదారపు విజయ్ s/o వెంకట్రావు 41 ఇయర్స్, ఐ సిటి అపార్ట్మెంట్, ఫ్లాట్ నెంబర్ 2109 KPHP కాలనీ,  హైదరాబాద్

పట్టుబడిన వారి వివరాలు:

1.            డి సంపత్ రావు s/o కిషన్ రావు 40 ఇయర్స్ వెలమ క్యాతన పల్లి

2.            టి వెంకటేశ్వర్లు s/o రాజమౌళి 47 ఇయర్స్ వైశ్య సుల్తానాబాద్

3.            నల్ల తిరుమల్ రెడ్డి s/o రాజిరెడ్డి 40 ఇయర్స్ కాపు మల్యాల

4.            ఒడ్నాల శేఖర్ s/o లక్ష్మణ్ 39 ఇయర్స్ రజక పెగడపల్లి

5.            కె నవీన్ రెడ్డి s/o కిషన్ రెడ్డి 25 ఇయర్స్ కరీంనగర్

6.            పెట్టం తిరుపతి s/o లింగారెడ్డి 35 ఇయర్స్ కరీంనగర్

7.            ఆత్మకూరు రమేశ్ s/o రాజయ్య 24es మాదిగ పెగడపల్లి

8.            వేముల రవి s/o నరసింహులు 37 ఎస్ పద్మశాలి గంగాధర

9.            జారతి మోహన్ s/o మల్లయ్య 35 ఇయర్స్ కాపు మల్యాల

10.          రాధాన్ల సాయి కుమార్ s/o మల్లేష్ 27yrs ముల్కల మంచిర్యాల

11.          తోట రాజేందర్ s/o కిష్టయ్య 42 ఇయర్స్ కాపు ముల్కల మంచిర్యాల

12.          మొమూరి నారాయణ రెడ్డి s/o రామ్ రెడ్డి 46 ఇయర్స్ చెన్నూరు మంచిర్యాల

13.          రత్మ రాజేశ్వర్ రెడ్డి s/o బుచ్చిరెడ్డి 48ఇయర్స్ చెన్నూర్

14.          కల్లూరి రవి s/o రాజన్న 38yrs కాపు చెన్నూరు

15.          ఎడవల్లి పాపి రెడ్డి s/o ప్రతాపరెడ్డి 31 ఇయర్ శ్రీరాంపూర్

16.          నడిపెల్లి శ్రీ రంగారావు s/o మాధవరావు 59ఇయర్స్ మంచిర్యాల

17.          జి కె సలీం s/o అలిమోద్దీన్ 42 ఇయర్స్ మంచిర్యాల

18.          గాడిచర్ల వీరేశం s/o శంకరయ్య 42 ఇయర్స్ ముదిరాజ్ మంచిర్యాల

19.          గుండా సురేష్ s/o విశ్వనాథం 36yrs వైశ్య ధర్మపురి

20.          చర్ల బాపురెడ్డి s/o రాజిరెడ్డి 62yrs, సీసీసీ నస్పూర్ మంచిర్యాల

21.          చిలుక సురేష్ s/o లచ్చన్న 26s పద్మశాలి ధర్మపురి

22.          ఎస్ కె అలీమ్ s/o ఎస్ కె బాయి,33yrs,  మంచిర్యాల

23.          కటకం మహేష్ s/o బాలయ్య 38 ఇయర్స్ కాపు మంచిర్యాల

24.          బి.గోపాల్  

ఇక ముందుకూడా పేకాట స్థావరాలపై తరచు దాడులు నిర్వహిస్తామని సీపీ స్పష్టం చేశారు. సాధ్యమైనంత త్వరలో పేకాట స్థావరాలు లేకుండా చర్యలు చేపడతామని అన్నారు.

Muneer MD
Muneer MD
Special Correspondent from Mancherial

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles