- ఫేస్ బుక్ లో అసభ్యకరమైన మెసేజ్ లు
- దర్యాప్తు చేసి వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు
సామాజిక మాధ్యమాలలో అసభ్యకర, వివాదస్పద పోస్ట్ లు , కామెంట్లు పెడుతున్న వ్యక్తిని మందమర్రి పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 30వ తారీఖున ఒక పార్టీకి చెందిన నాయకులు తమ పార్టీకి సంబంధించిన కార్యక్రమం గురించి ఫేస్ బుక్ లో పోస్ట్ చేయగా, దానికి మందమర్రి నివాసి కాసిపేట శివకుమార్ అసభ్యకరమైన పదజాలంతో మెసేజ్ లు, కామెంట్ లు పోస్ట్ చేయడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో భాగంగా ఎన్టీపీసీఎస్సై స్వరూప్ రాజ్ సిబ్బంది సహాయంతో నిందితుడిని మందమర్రి లో అరెస్టు చేశారు. భవిష్యత్తులో ఇటువంటి పాడు పనుల చేయకుండా తహసీల్దార్ ఎదుట క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ CrPC 107 సెక్షన్ ప్రకారం, ఒక లక్ష రూపాయలు జరిమానా లేదా ఆరు నెలల జైలుశిక్ష షరతు మీద ఆరు నెలల కాల వ్యవధి కి గాను బైండోవర్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా ఎన్ టి పి సి ఎస్ ఐ స్వరూప్ రాజ్ మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో రాజకీయ పార్టీల పరంగా, కుల మతాల పరంగా ,సామాజిక పరంగా ఇతరులను రెచ్చగొట్టే విధంగా మెసేజ్ లను పోస్ట్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లక్ష రూపాయలు జరిమానా లేదా ఆరు నెలల జైలుశిక్ష షరతు మీద ఆరు నెలల కాల వ్యవధి కి గాను బైండోవర్ కూడా చేస్తామని హెచ్చరించారు.