Tuesday, January 31, 2023

నవంబరు10 అంతర్జాతీయ సైన్సు దినోత్సవం

నవంబర్ 10 వ తేదీని అంతర్జాతీయ సైన్సు దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. శాస్త్రీయ సమాజాన్ని నిర్మించేందుకు, శాస్త్రీయదృక్పదాన్ని ప్రజల్లో పెంచేందుకు ఈ సైన్సు దినోత్సవాన్ని ప్రభుత్వం బాగాఉపయోగించుకోవచ్చు.

ప్రపంచశాంతి, అభివృధ్ధికోసం ప్రపంచ వ్యాప్తంగా ఈ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనావుంది. సైన్సు వలన సమాజానికి జరిగే అభివృద్ధిని ప్రజలకు అందించాలి. చర్చలు పెట్టాలి. సైన్సు రుజువుకోరుతుంది.

Also read: ఆం.ప్ర. ముఖ్యమంత్రి ప్రకటనలు కేవలం ఉడత ఉపులేనా?

ఎవరోచెప్పారనో, మాపాత గ్రంధాలలో ఉన్నదనో చెప్పడాన్ని సైన్సు అంగీకరించదు. పౌరులు అందరూ ఈ సైన్సు స్ఫూర్తిని అవగాహన చేసుకుంటూ ముందుకుపోవాలి. ప్రతిపౌరునికి శాస్త్రీయ స్పూర్తిని, ప్రశ్నించేతత్వాన్ని, మానవ వాదాన్ని పెంచుకోవాలని రాజ్యంగం అర్టికల్ 51 A(H) లో 1976 లో అప్పటిప్రధాని ఇందిరాగాంధీ 42 రాజ్యాంగసవరణ ద్వారా రాజ్యంగములో పొందుపరిచింది. ఇది చాలా అభినందనీయం. ఎందుకంటె ఈతరహా పౌరవిధులను నిర్దేశించిన దేశం మనదేశం ఒక్కటె అన్నవిషయం మరచిపోకూడదు.

సైన్సు అభివృద్ది జరిగితె ఏమౌతుంది?

మూఢ నమ్మకాలు తొలగిపోతాయి. నిన్ననే చంద్రగ్రహణం ఎర్పడింది. గ్రహణాలవలన ప్రజలలో చాలా ముఢనమ్మకం ఉంది. రాహుకేతువులు సూర్యచంద్రులను మింగుతాయని, అందువలన గ్రహణాలు ఏర్పడుతాయని పురాణాలలొ చెప్పినదాన్ని ప్రచారం చేసుకుని, కొంతమంది దీన్ని బ్రతుకుదెరువుకి ఉపయోగించుకుంటున్నారు. సైన్సు దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం ఇలాంటి ఛాందస భావాలను తొలగించి, ప్రజలను చైతన్యం చేయటమే!!

Also read: జీవితంలో వెలుగులు నిండుతాయనే మూఢనమ్మకంతో కొరడా దెబ్బలు తిన్న ముఖ్యమంత్రి

అయితే ప్రభుత్వాలు ఆపనిచెయ్యటంలేదు. ప్రధానులు, ముఖ్యమంత్రులు, అధికారులు మూఢ నమ్మకాలను పెంచిపోషిస్తున్నారు. సైన్స్ ను ప్రమోట్ చెయ్యవలసిన దేశప్రధాని, ఒక సైన్సు కాంగ్రెసు సదస్సులో వేదకాలంలోనే విమానాలున్నాయని, పురాణాలలో శివుఁడు వినాయకుని తలనరికి, మరల ఏనుగుతలను అతికించటాన్ని, ఈరోజుల్లో జరిగే సర్జరీలతో పోల్చి చెప్పటం అయన అజ్ఞానానికి నిదర్శనం.

అలాగె వాస్తుపేరుతో ప్రభుత్వ కార్యాలయాలను మరమ్మత్తులు చెయ్యటం, ప్రభుత్వ కార్యాలయాలలో దేవుళ్ళ బొమ్మలు పెట్టడం, ఇస్రో చైర్మన్ రాకెట్ పైకి పంపేటప్పుడు ప్రతిసారి ఆపక్కనేగల గ్రామదేవత చెంగాలమ్మకి మొక్కడం….ఇవన్ని మూఢనమ్మకాలే. బెనారస్ హిందూ యూనివర్శిటీ వారు భూతవైద్యాన్ని కోర్సుగా పెట్టడం అతిపెద్ద ముఢనమ్మకం. బాబాలపేరుతో , ఫాస్టర్ల పేరుతొ జరిగె జరిగె  మూఢ నమ్మకాలు .. బాబాలచుట్టూ ప్రధానులు తిరగటం, ముఖ్యమంత్రులు బాబాల ఆశ్రమాలకు వెళ్ళి వారి పాదాలకు మొక్కటం … చేతబడులపేరుతో నరబలులు జరగటం వీటన్నిటిపైనా ప్రజలను చైతన్యపరచాలి. సైన్సు డే యెక్క లక్ష్యం అదే.

Also read: సూర్యగ్రహణాన్ని ఆహ్లాదకరంగా చూడండి

ఈ మధ్య ఆవుపేడకు ,ఆవు ముత్రానికి పెద్ద ప్రచారం జరుగుతోంది. ఇది కూడా అతి పెద్ద మూఢ నమ్మకం. వీటన్నిటి గుట్టురట్టు చెయ్యటమే సైన్సు డే యెక్క అసలు లక్ష్యము.

Also read: ఇంకా ఎంత మంది బాబాల మోసాలకు బలికావాలి?

నార్నెవెంకటసుబ్బయ్య

 అధ్యక్షుడు,  AP హేతువాద సంఘం

Venkatasubbaiah
Venkatasubbaiah is a rationalist who is president of AP Rationalists Association. He had also worked as Assistant Secretary of National Rationalists Association for ten years. 72-year-old Venkatasubbaiah from Prakasham district has been very active for more than four decades exposing fake swamies and irrational things.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles