Friday, September 20, 2024

మహిమాన్వితాలు పంచ పర్వాలు

కార్తీకమాసం అన్ని మాసములలో అత్యంత పవిత్రమైనది. ‘న కార్తీక సమో మాసః’ అని అత్రి మహాముని వచనం. కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని అర్ధం. కార్తీక మాసంలో చేయదగిన పుణ్య కార్యక్రమాలలో నదీ స్నానం, ఉపవాసం, పురాణ పఠనం, ఆధ్యాత్మిక అంశాల శ్రవణం, దీపారాధనం, దీప దానం,  తులసిమాల ధారణం, సాలగ్రామ పూజ, దైవ పూజ, వనభోజనం మున్నగునవి. కాగా, వీటిలో విశేష పుణ్య ఫలాలను ఇచ్చేది కార్తీక స్నానం.

పర్వదినాలు

జ్యోతిష శాస్త్ర ప్రకారం ప్రతి మాస నిర్ణయం ఆ మాసంలో పౌర్ణిమ రోజున వచ్చే నక్షత్రం ఆధారంగా జరుగుతుంది. “చంద్రుడు పౌర్ణిమ రోజున కృత్తికా నక్షత్రంలో సంచరించే మాసం కార్తీక మాసం”. అంబా, దులా, నితంతా, అభ్ర యంతీ, మేఘయంతీ, వర్షయంతీ, చూపూణికా అనే పేర్లతో పిలవబడే షట్కృత్తికలు కార్తీక మాస మునకు అధిపతులు. కృత్తికా నక్షత్రం కృత్తికలకు అధిష్టానము, అగ్ని స్వరూపం. అశ్విన్యాది 27 నక్షత్రములు దేవతలకు ఇంద్రియములు. ‘నక్షత్రం దేవమింద్రియం’ అని శృతి వచనం. వాటిలో అతి ముఖ్యమైన తేజస్సును దేవతలకు అందించే నక్షత్రం కృత్తిక. అట్టి కృత్తికా నక్ష త్రముతో కూడిన పౌర్ణిమాస్య కలిగిన ఈ మాసము కార్తీక మాసం విశేష పుణ్యఫలదము.  చాంద్రమాన రీత్యా ఎనిమిదవ మాసమైన కార్తీకమునకు ఒక విశేష స్థానము కలదు. శరదృతువు ఉత్తర భాగములో వచ్చే కార్తీక మాసము నెల రోజులు పర్వదినాలుగానే భావిస్తారు.

పంచపర్వాలు

ప్రత్యేకించి కార్తీక శుక్ల ఏకాదశి నుండి పౌర్ణమి వరకు “పంచ పర్వాలుగా” భావిస్తారు. కార్తీక శుద్ధ ఏకాదశి – ఉత్థాన ఏకాదశి ప్రత్యేకత ననుసరించి, ఆషాడ శుద్ధ ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ ద్వాదశి వరకు గల నాలుగు మాసములు చాతుర్మాస్య వ్రతముగా చెప్పబడు చున్నవి. మహావిష్ణువు ఆషాడ శుద్ధ ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగనిద్రలో ఉండి, తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉత్థానము చెందును కావున, దీనిని “ఉత్థాన ఏకాదశి” అని కూడా పిలుస్తారు.

ఉత్తాన ఏకాదశి

పీఠాధిపతులు, యతీశ్వరులు, మునులు ఈ వ్రతమును ఎంతో భక్తి శ్రద్ధలతో, ఆహార నియమాలతో చేస్తారు. కార్తీక శుద్ధ ఏకాదశి లేదా “ఉత్తాన ఏకాదశి” లేదా ప్రభోదనైకాదశి” అంటారు. ప్రబోధనైకాదశి నాడు విష్ణుమూర్తి క్షీరాబ్ది నుండి బయలు దేరి “క్షీరాబ్ది ద్వాదశి”, “చిలుకు లేదా మదన ద్వాదశి”, “యోగిని ద్వాదశి” నాడు విష్ణువు….లక్ష్మి. బ్రహ్మ మున్నగు వారితో కలిసి బృందావనంలో ప్రవేశిస్తాడు. దీనిని క్షీరసాగరాన్ని మధించిన (చిలికిన) దినంగా వ్యవహరిస్తారు. అమదేర్ జ్యోతిషీ గ్రంథ ప్రకారం చాతుర్మాస్య వ్రత సమాపనదినం. విష్ణు మూర్తికి ప్రీతిపాత్రమైనది కార్తీక శుద్ధ త్రయోదశి. విష్ణువు శంకరుడిని పూజించిన దినం “వైకుంఠ చతుర్దశి”.

చాతుర్మాస్య వ్రతారంభదినం

ఇది జాగరణ వ్రతం, ప్రతిమావ్రతం, లింగ వ్రతం, ప్రబోధ వ్రతాలకు ఉద్దీపితమైనది. “కార్తీక పౌర్ణమి” శివునికి ప్రీతిపాత్రం. ముక్కంటి త్రిపురాసుడిని హతమార్చిన దినం. పార్వతి దేవి పాప పరిహా రార్ధం శివారాధన చేసిన దినం. బౌద్ధులకు చాతు ర్మాస్య వ్రతారంభదినం.

ఇలా ఐదు దినాలను పంచ పర్వాలుగా ఆచరించడం సనాతన సాంప్రదాయాచారం. దేవాలయా లలో మూల విరాట్టుల అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు, పూజలు చేస్తారు. భక్తులు ఆలయాల మధ్య గల ఉసిరిక వృక్షం చుట్టూ సాంప్రదాయ ప్రదక్షిణలు ఆచరించి, ఉసిరికలను దానం చేసుకుని కార్తీక దామోదరునికి ప్రత్యేక పూజలొనరిస్తారు. మంగళ స్నానాలాచరించి, దొప్పలలో వెలిగించిన కార్తీక దీపాలను వదిలి పెడతారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles