Sunday, September 15, 2024

‘మా అక్కకి నేను పెట్టిన పేరు-‘నిశ్శబ్ధం’ (I named my sister “Silence”)

ఫొటో రైటప్: మనోజ్ రూప్డా

“Modern industrial enterprises are a type of carnage. Industrial cartels subject others to death for profits, and these destructive endeavors are persevering. Governments contribute to this carnage. And this carnage is invisible despite having longstanding effects”

‘జల్ ధూత్’ అనే ఓడ కెప్టేన్ అలోక్ దత్ డైరీలో రాసుకున్న వాక్యాలివి. జాత్యహంకార హింస,కుల,మతోన్మాద హింస, ఆర్థిక హింసల్ని పచ్చిగా వర్ణించిన అక్షరసమాహారం మానవ సంహారాన్ని కళ్ళకి కట్టిన తీరు తెలుసు కోవాలంటే చత్తీస్‌గఢ్ బస్తర్ లోని మారుమూల గ్రామం ‘బాసామూరా’ తో మొదలెట్టి, గుజరాత్ లోని భావనగర్ దగ్గరున్న ‘ఎలాంగ్’ అతిపెద్ద నౌక విధ్వంసక కేంద్రం వరకూ మనమూ పయనించాలి!

Also read: భారతదేశ మొట్టమొదటి ఆంగ్ల రచయిత్రి తోరూ దత్!

పిల్లాడికి ఏనుగంటే ఇష్టం. పదేళ్ళప్పుడు ఊర్లోకి వచ్చిన ఏనుగునీ, మావటివాడ్నీ వెంబడిస్తూ అడివిలోకి వెళ్ళాడు. వేటకుక్కల గుంపు చేసిన ఆటవిక హింసకు ఆ రాత్రి ఒక సాక్ష్యం. అలాగే అక్కంటే చాలా ఇష్టం. అక్క ఎంచుకున్న మార్గంలో ఆమెని వెతుక్కుంటూ అడివి లోకి వెళ్ళాడు. సమూహాలు జరిపిన హింసకు అతనే ఒక సాక్ష్యం !

ఇంతకీ వాళ్ళ అక్క ఏమైంది? అడివిలోకి సాగిన ఆ ఆదివాసీ యువకుడి అన్వేషణ ఎలా ముగిసింది? ఇంతకీ,  ఆమెకి ‘నిశ్శబ్దం’ అని ఎందుకు పేరు పెట్టాడు? సాక్ష్యం లేని గతానికి చరిత్ర పేరుపెట్టి మురిసి పోయే మనిషి, గతచరిత్రకి తాను చేసిన గాయాలకి సాక్ష్యం లేకుండా చేయడమే చరిత్ర రచన అనుకుంటాడు!

నేలని నెత్తురుతో నింపినమనిషి, శాంతికోసం సముద్రాన్ని ఆశ్రయిస్తాడు. ప్రశాంతత కోసం ప్రతీక్షణం అన్వేషిస్తాడు. దక్కని సంతృప్తి కోసం తనని తాను దహించుకుంటాడు. మనిషి చరిత్ర అంతా హింస తోనే నిండి ఉంది. మానవాళి గతమంతా మారణహోమం తోనే ముడిపడి ఉంది. మన అస్థిత్వం అంతా అంతరాత్మని చంపుకోడంలోనే ఉంది!

Also read: ఒక సాంస్కృతిక వికాస వీచిక – కదలిక!

ఎందుకంటారా? జననాన్ని జయించడానికి మనిషి పడే తపన జీవితాన్ని ప్రసాది స్తుంది. అప్పుడది ‘ఇర్మాకాకూ’ అని ఎంతోమంది ప్రేమగా పిల్చుకునే తన అక్క దాచి అందించిన పండిన నేరేడు పండులా ఉంటుంది. మరణించిన అమరుల విగ్రహాల్లో తన విగ్రహాన్ని చూసుకున్న యువకుడి అన్వేషణ పూర్తయ్యీ, మరణాన్ని అధిగమించిన మనిషి అంతరాత్మలో నుంచి వచ్చే మాటల గాఢత మానవాళికి భవిష్యత్తు పై ఆశను ఎలా కల్పిస్తుందో కనిపిస్తుంది. అదెలా అంటారా?

“I put one jamun into my mouth, and when I was done sucking its pulp and the seed remained, a thought crossed my mind. In the midst of all that violence and destruction, love had managed to survive.”

(మనోజ్ రూప్డా ‘కాలే అధ్యాయ్’ 2015లో వచ్చిన నవల. సౌవేంద్ర సర్కార్ ‘I named my sister Silence’ పేరిట ఇంగ్లీష్ లో onlineలో కొనుగోలుకి అందుబాటులో ఉంది. పుస్తకం చిన్నదే అయినా, నాగరికత నిర్మాణంలో పునాది గా ఉన్న సమాధులు ఎందరు అభాగ్యులవి? అని ఘాటుగానే ప్రశ్నిస్తుంది. ఆ అక్షరాలు ఆక్రోశింపజేస్తాయ్. ఆందోళనకు గురిచేస్తాయ్.  అవకాశం ఉన్న వాళ్ళు తప్పక చదవాలి. దీనిని చర్చించడం అవసరంగా గుర్తించాలి!)

Also read: భావోద్యమాలకో బ్రాండ్ అంబాసిడర్

గౌరవ్

Gourav
Gourav
గౌరవ్, సామాజిక కార్యకర్త, రామచంద్రాపురం, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles