Monday, June 24, 2024

పంచాంగం గణన

పంచాంగం కాల విభాగాన్ని చెప్తుంది. సమయాన్ని మన పూర్వీకులు వివిధ విభాగాలుగా విభజించారు. అవి తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు.

(1). తిథి: ప్రతి రోజు సూర్యుడు అంశ (1డిగ్రీ) చంద్రుడు 13 అంశలు ముందుకు నడుస్తారు. వారిరువురి భ్రమణములో అంతరము 12 డిగ్రీలు. సూర్యుని భ్రమణమును సాపేక్ష భ్రమణము అంటారు. నిజానికి భూమి తిరగదు. కానీ మనం భూమి నుండి ఖగోళము ను వీక్షిస్తాం, కనుక ఆది సాపేక్ష భ్రమణం ఈ 12 డిగ్రీల అంతరమును “తిథి” అంటారు. మొదటి తిథి పాడ్యమి రోజున సూర్య చంద్రుల మధ్య వ్యత్యాసం 12 డిగ్రీలు అయితే, రెండవ రోజు 24 డిగ్రీలు. ఇలా చంద్రుడు 180 డిగ్రీలు, సూర్యుని నుండి జరిగినప్పుడు పౌర్ణమి, తిరిగి సూర్యుని చేరినప్పుడు అమావాస్య అవుతాయి. ఈమధ్య కాలాలే శుక్ల, కృష్ణ పక్షాలు. ఒక సౌరమానం = 0.9483 చంద్ర తిథి. ఈ విధంగా చాంద్రమానమునకు 29.53 రోజులు ఉంటాయి.

ఇది చదవండి: బ్రహ్మ ముహూర్తం విశిష్టత

(2). వారం: ఉదయాద్ ఉదయం వారం అని చెప్తారు అంటే ఈరోజు సూర్యోదయంతో ప్రారంభమై తెల్లవారి సూర్యోదయంతో పూర్తయ్యేది వారం. నవగ్రహాలలో ఛాయా గ్రహాలైన రాహుకేతువులు మినహా మిగిలిన ఏడు గ్రహాల ఆధారంగా వారాల పేర్లు పెట్టడం జరిగింది. జ్యోతిష శాస్త్ర రీత్యా గ్రహాలలో మొదటిది అయిన సూర్యుని పేరిట ఆదివారం, చంద్రుని పేరిట సోమవారం, మంగళుని పేరున మంగళవారం, బుధుని పేరున బుధవారం, గురువు పేరున గురువారం, శుక్రుని పేరున శుక్రవారం, శని పేరున శనివారానికి పేర్లు పెట్టబడ్డాయి. వార విభాగంలో పాశ్చాత్యులకు అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభమైతే, మనకు వారం సూర్యోదయంతో ప్రారంభం అవుతుంది. రెండున్నర ఘడియల కాలం హోరా (అవర్). రోజుకు 24 హోరలు. 25వ హోరా చంద్ర హోర. అంటే మరుసటి దినము. ఈ ప్రకారం ఏడు వారాలు వస్తాయి. మన హోరనే పాశ్చాత్యులు “అవర్” గా పిలుస్తున్నారు. యధాతధంగా వారి భాషలో పేర్లను తర్జుమా చేసుకొని వాడుకుంటున్నారు.

ఇది చదవండి: జ్యోతిష శాస్త్రంలో ఏకాభిప్రాయం అసాధ్యమేనా?

(3). నక్షత్రం: సాపేక్ష సౌర గమనానికి ఒక ఏడాది కాలం పడితే, ఆ మార్గంలో ఆయనకు 12 మజిలీలు గుర్తించబడ్డాయి. అవే రాశులు. సూర్యుని ప్రయాణాన్ని 27 ప్రాంతాలు నక్షత్రాలు చుట్టినట్లు విభజించారు ఒక్కొక్క నక్షత్రానికి 4+4+1 పాదాలు కలిస్తే ఒక రాశి. 3వ నక్ష త్రం లోని మిగిలిన మూడు పాదములు, నాలుగవ నక్షత్రంలోని 4 పాదములు, ఐదవ నక్షత్రం లోని రెండు పాదములు కలిస్తే 3వ రాశి. అంటే 3+4+2 =9. ఇలా 9 పాదములతో ప్రతి రాశి ఏర్పడుతుంది. అంటే 27 నక్షత్రాల లోని, నాలుగేసి పాదాలను కలిపితే, 108 పాదాలు అవుతాయి. సూర్యుడు, చంద్రుడు మరియు మిగిలిన అన్ని గ్రహాల రాశి, నక్షత్ర విభజన ఇదే విధంగా ఉంటుంది. మానవుని పేర్లు ఆడా, లేక మగా ఏదో ఒక దానికి చెందడం పరిపాటి. సంస్కృత నామాలు కలిగిన ఈ 27 రాశుల పేర్లు లాటిన్, గ్రీకు, బాబిలోనియా, ఇత్యాది భాషలలో ఇంచుమించు ఇవే సంస్కృత అర్థము లను కలిగి ఉన్నాయి.

ఇది చదవండి: మాసానాం మార్గశీర్షోహం

(4).యోగము: యోగం అంటే కలయిక దైనిక చంద్ర గతి సాపేక్ష సూర్య గతి కలిపితే యోగం అంటారు ఇవి 27.

(5). కరణము: చంద్రుడు రోజుకు 12 డిగ్రీల వంతున సూర్యుని నుండి ఇ దూరమవుతూ వస్తాడు పాడ్యమి కి 12 డిగ్రీలు అయితే విదియకు 24 డిగ్రీలు. ఇలా 360 డిగ్రీలకు అమావాస్య అవుతుంది. అర్ధ తిథిని కరణము అంటారు. ఏ అర్థ తిథి అయినా 6చే భావించబడుతుంది.ఇవి 11. మొదటి 7 కరణములు, చంద్ర మాసంలో 8 సార్లు వస్తాయి. అంటే 28 రోజులు. చివరి కరణాలు స్థిరంగా నిలుస్తాయి. సూర్య, చంద్ర, భూ చలనాలను నిశితంగా, కచ్చితంగా, పరిశీలించి భూమిపై వాటి వాటి ప్రభావాలను స్పష్టం చేసిన దేశం, వేరే కాకుండా భారత దేశమే, కావడం గర్వకారణం.
సంవత్సరంలో ప్రతి రెండు నెలలకు ఒక రుతువు మారుతుంది. ఆంగ్లంలో ఋతువులను seasons అని పిలుస్తారు. చైత్ర , వైశాఖమాసములు కలిపి వసంత రుతువు గా, జ్యేష్ఠ ఆషాఢ మాసములు గ్రీష్మరుతువు గా, శ్రావణ భాద్రపద మాసములు వర్షరుతువు గా, ఆశ్వయుజం కార్తీకమాసములు శరదృతువు గా, మార్గశిర, పుష్యమాసములు హేమంత ఋతువు గా, మాఘ ఫాల్గుణ మాసములు శశిర రుతువు గా పిలువబడతాయి.


ఇక చంద్రుడు పౌర్ణమి రోజు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటాడో ఆ నక్షత్రం పేరుతో మాసం ఏర్పడింది. చిత్త నక్షత్రం అయితే చైత్రం విశాఖ నక్షత్రం అయితే వైశాఖం ఇలా మాసాల పేర్లు ఏర్పడ్డాయి. ముహూర్తానికి తిథి, వార, నక్షత్రాలతో పాటుగా లగ్నాన్ని కూడా చూస్తారు.పంచాంగం యొక్క ప్రధాన ఉపయోగము మన నిత్య నైమిత్తిక కర్మలు, యజ్ఞయాగాదులు వివాహాది శుభకార్యములు జరుపుకోవడానికి సరైన శుభ సమయాన్ని ఎంచుకోవడం. వైదిక సంస్కృతిలో ఒక పూజ చేయాలన్నా, హోమం చేయాలన్నా లేదా ఒక శుభకార్యం చేయాలన్నా, పంచాంగ శుద్ధి తప్పనిసరిగా ఉండాల్సిందే. పంచాంగ శుద్ధి దినమంటే, ఏ విధమైన దోషాలు అంటే వర్జ్యము, దుర్ముహూర్తం మొదలైన 21 మహా దోషాలు లేని సమయం. ఇటువంటి రోజున చేసే కార్యక్రమాలు, ఎటువంటి విఘ్నం లేకుండా, పరిసమాప్తం అవుతాయని మన పూర్వికులు విశ్వాసం.

ఇది చదవండి: గగనవీధిలో అరుదైన ఘట్టం

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles