Friday, September 29, 2023

పలు ప్రత్యేకతల సమాహారం “గైడ్”

హిందీ చలన చిత్ర రంగంలో తనదయిన ముద్ర వేసుకున్న అలనాటి మహా నటుడు దేవానంద్ ( సెప్టెంబర్ 26, 1923 – డిసెంబర్ 3, 2011). సుప్రసిద్ధ హిందీ సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు దేవానంద్ పేరు చెప్పగానే వెంటనే స్ఫురణకు వచ్చే చిత్రరాజం “గైడ్”. ప్రఖ్యాత ఆంగ్ల-భారత రచయిత ‘మాల్గుడి డేస్’ ఫేం అర్. కె. నారాయణ్ అద్భుత రచన గైడ్. ఈ చిత్రం పలు విశేషాల సమాహారం

అయితే, దేవానంద్ నటించిన “హం దొనో” చిత్రం 1962 బెర్లిన్ చలన చిత్రోత్సవానికి, భారత దేశ అధికారిక చిత్రంగా ఎంపికకాగా, బెర్లిన్లో దేవానంద్ అమెరికా దర్శకుడు టాడ్ డేనియల్ ను కలిసే అవకాశం కలగడం, టాడ్, పెర్ల్ ఎస్ బక్  ఆహ్వానం పై అమెరికా వెళ్లి వారితో  ఒప్పందం కుదుర్చుకుని, గైడ్ చిత్రంలో నటించటానికి అంగీకరించడం యాదృచ్ఛికంగా జరిగాయి. గైడ్ చిత్రానికి ఆంగ్ల చిత్రానికి టాడ్ డేనియల్ దర్శకత్వం వహించాగా, చిత్రానువాదం నోబెల్ సాహిత్య బహుమతి గ్రహీత పెర్ల్ ఎస్ బక్, టాడ్ డేనియల్ సంయుక్తంగా నిర్వహించారు. తొలుత ఆంగ్ల చిత్రాన్ని చిత్రీకరించారు. అది విడుదల కాగా,  చిత్రానువాదం ఆశించిన స్థాయిలో లేక, ఆంగ్ల ప్రేక్షకులను చిత్రం ఆకట్టుకోవడంలో విఫలమయింది.

హిందీ గైడ్ విజయదుందుభి

గైడ్ చిత్రాన్ని హిందీలో తీద్దామని అనుకుని వహీదా రెహమాన్ ను నాయికగా ఉండాలని ముందు సత్యజిత్ రే, అనంతరం దేవానంద్ కోరారట. అయితే  చిత్రం చిత్రీకరణ హక్కులను దేవానంద్ రచయిత ఆర్కె నారాయణ్ నుంచి ముందు పొందారు. అలా దేవానంద్, వహీదా కాంబినేషన్లో రూపు దిద్దుకున్న చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విజయ దుందుభి మోగించింది. ఊహించని డబ్బును సమ కూర్చింది.

విజయ ఆనంద్ గైడ్ దర్శకత్వ బాధ్యత స్వీకరించాడు. ఆంగ్ల చిత్రానువాదం కాకుండా, భారతీయ ప్రేక్షకులకు నచ్చే విధంగా కొత్త చిత్రానువాదం తయారు చేశాడు. మనసును పూర్తిగా లగ్నం చేసి దర్శకత్వం వహించిన విజయ్ ఆనంద్ కృషి సఫలీకృతం కాగలిగింది. అచ్చంగా దేవానంద్, వహీదా రెహమాన్ ల నట జీవితంలో గైడ్ ఒక అణి ముత్యమే అయింది.

ఫిల్మ్ ఫేర్ అవార్డుల పంట

విజయానంద్ సందర్భోచిత  చిత్రానువాదం, దర్శకత్వం, కథలో వైవిధ్యం, ఎస్.డి.బర్మన్ సంగీతం, వహీద నృత్యాలు, దేవానంద్ నటనా కౌశల్యం ప్రేక్షకుల మనో ఫల కాలపై చెరగని ముద్ర వేశాయి. ప్రేక్షకుల అనూహ్య ఆదరణ ద్వారా చిత్రం అనుకోని విధంగా కలెక్షన్లు సాధించింది. సంగీత దర్శకత్వం మినహా,  మిగతా అన్ని శాఖలలోను ఫిల్మ్ ఫేర్ ఉత్తమ బహుమతులను 7 శాఖలలో గెల్చుకొని, అపూర్వ కళాఖండ  చిత్రరాజమై నిలచింది. విదేశీ చిత్రాల కోవలో, ఆస్కార్ చిత్రోత్సవానికి భారత దేశ అధికార చిత్రంగా ఎంపికయ్యింది. టైమ్ మ్యాగజైన్ దాని ఉత్తమ బాలీవుడ్ క్లాసిక్స్ జాబితాలో  నాలుగో స్థానంలో ఉంది.  విడుదలయిన 42 ఏళ్ల తర్వాత, 2007 లో కేన్స్ చిత్రోత్సవంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. సుదీర్ఘ సమయానంతరం దూరదర్శన్ లో ఈ చిత్రం ప్రదర్శిత మైనపుడు చాలా మంది ఇళ్లలో టీవీలకే అంకితం అయినారంటే సినిమాను ఎంత గొప్పగా తీశారో స్పష్టం అవుతుంది. 

“ఆజ్ ఫిర్ జీన్ కి తమన్నా హై”

“దిన్ ధల్ జాయే”, 

“గాతా రహే మేరా దిల్”

“క్యా సే క్యా హో గయా”, 

“పియా తోస్ నైనా లాగే రే”  

“తేరే మేరే సాప్నే”,  “వహన్ కౌన్ హై తేరా”, “హి రామ్ హమారే రామ్‌చంద్ర” “అల్లాహ్ మేఘ్ దే పానీ దే” అన్ని పాటలూ ఆణిముత్యాలే.

ఆర్ కె నారాయణ అసంతృప్తి

1965 ఫిబ్రవరి 6 న సినిమా  విడుదల కాగా, అంతకు ముందు ఢిల్లిలో ఈ చిత్రం ప్రివ్యూ ప్రదర్శనకు , ప్రధాన మంత్రి మినహాయించి భారత ప్రభుత్వ మంత్రులంతా చిత్రాన్ని ఆసాంతం, ఆసక్తిగా చూశారు. ఈ చిత్రం విడుదల అయినాక  రచయిత ఆర్కె నారాయణ్ చూసి అసంతృప్తి వ్యక్తం చేశారట. డిస్ట్రిబ్యూటర్లు  ఆసక్తి చూపక పోయినా, గైడ్ చిత్రం గురించి ముందే జరిగిన విస్తృత ప్రచారం వల్ల  ప్రేక్షకుకు మళ్ళీ మళ్ళీ చూసి కలెక్షన్లు సాధించేలా చేశారు..

(డిసెంబరు 3 దేవానంద్ వర్ధంతి సందర్భంగా)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles