Wednesday, May 1, 2024

నిరీక్షణ

‘ఈస్టర్ సండే’

కోట బిపిన్ చంద్ర పాల్

రెండువేల యేళ్లనాటి ఈస్టర్ రోజున, యేసుక్రీస్తు పునరుద్దానుడయ్యాడు. చనిపోయి తిరిగి లేవటాన్ని ‘పునరుత్థానం’అంటారు. ఓ భవనాన్ని పడగొట్టి నిర్మించడాన్ని పుననిర్మాణ అంటాము గదా! ఈ పునఃనిర్మాణములో మార్పులుతో నిర్మాణము జరుగుతుంది. కాని యేసుక్రీస్తు అదే శరీరము, జీవముతో పునరుత్థానుడయ్యాడంటే ఇది చరిత్ర మరచిపోనివిషయం. అందుకే ప్రభువు సిలువపై ప్రాణం పెట్టిన రోజు. గుడ్ ఫ్రైడే (శుభశుక్రవారం) గా, పునుర్థానుడయ్యిన రోజును’ఈస్టర్ సండే’గా జరుపుకుంటున్నాము.

జీవితం అంటే జీవము, మరణం కాదు, గ్రుడ్డు కొంత కాలనికి పైనున్న పెంకును పెకిలించుకొని, అందులో నుంచి కోడి పిల్ల జీవముతో బయట కొచ్చినట్లే మనిషి జీవితానికి మరణం అంతం కాదు. మనిషి కూడా నీతి భాస్కరుడైన ప్రభువు ఉదయించినప్పుడు, యేసునందు విశ్వాసముంచిన వారు పునుర్ధానకాలమందు ప్రభువుతో పాటు లేతురనేది. క్రైస్తవ నిరీక్షణ, అందుకే ప్రపంచంలోని కొన్ని చర్చిల్లో ‘ఈస్టర్’ పండుగ రోజున కోడి గ్రుడ్లు పంచుతారు.

యూదులు సమాధి చేయు మర్యాద చొప్పున యేసు మృతి చెందిన దేహానికి సుగంధ ద్రవ్యములు పూసి సన్నని నారబట్టలు చుట్టి, రాతి సమాధిలో పెట్టి దానికి పెద్ద బండరాయి అడ్డంగా పెట్టి ఆ రాయిపై ముద్రను వేయించారు.

ఆదివారము సూర్యోదయానికి పూర్వమే చీకటిగా వున్నపుడు మగ్గలేనే మరియ యాకోబు తల్లియైన మరియ, సలోమి యేసు సమాధి యొద్దకు వెళ్ళిన స్త్రీలకు సమాధి మీద ఉంచిన అడ్డురాయి తొలగించబడియుండుట చూసారు. అయితే మగ్దలేనే మరియ అనే ఆమె కంగారు పడి పరిగెత్తు కాని, వెళ్ళి పేతురు, యోహాను అనే ఇద్దరు శిష్యులు వద్దకు వెళ్లి, ప్రభువు దేహం సమాధిలో లేదని, కాని నారబట్టలు సమాధిలో పడి ఉన్నాయని తొలి కబురు తెలియచేసింది.

మరియ సమాధి  బయట నిలుచుని యేడుస్తుండగా గమనించిన యేసు ‘అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవనిని వెదుకుచున్నావని’, యేసు ఆమెను చూచి ‘మరియా’ అని పిలిచాడు. ఆమె ప్రభువు వైపు తిరిగి ‘రబ్బూనీ’ అని బదులిచ్చింది. రబ్బూనీ అనగా హెబ్రీ భాషలో బోధకుడని అర్ధము. అప్పుడు యేసు మరియతో నేను ఇంకనూ తండ్రి యొద్దకు వెళ్లలేదని, గనుక నన్ను ముట్టవద్దని చెప్పి నేను లేచి వచ్చిన విషయం శిష్యులతో చెప్పమన్నాడు. మగ్దలేని మరియ వచ్చి నేను ప్రభువును చూచానని ఆయన మీతో ఆ విషయం చెప్పమని చెప్పాడని శిష్యులకు తెలియజేసింది.

ఆదివారము సాయంకాలము శిష్యులు యూదులకు భయపడి, తామున్న యింటి మేడగది తలుపులు మూసికొని యుండగా యేసుక్రీస్తు అక్కడ ప్రత్యక్షమై వారి మధ్యనిలుచొని- ‘మీకు సమాధానము కలుగాలని’ చెప్పాడు. శిష్యులకు 40 రోజులు ఆగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచూ, అనేక ప్రమాణములను చూపి ఆయనను సజీవునిగా కనుబరచు కొన్నాడు. ఈ మాటలు చెప్పుచూ, వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు ఆరోహణ మయ్యాడు. (అపొ 1:9)

ఆది మానవుడైన ఆదాము దేవుని ఆజ్ఞ అతి క్రమించి ఏదేను తోటనుండి వెళ్ళగొట్టబడిన, మానవ జాతికి యేసు పునరుత్థానము వలన దేవుని సానిధ్యం, పరలోకంలో ప్రవేశించే అవకాశం కలిగింది. ‘నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ

తండ్రి యొద్దకు రాడు’ (యోహాను 14:6), అని చెప్పిన యేసు మరణించి, తిరిగి లేచుట ద్వారా, ఆది దంపతులయిన ఆదాము హవ్వలు పోగొట్టుకొనిన సానిహిత్యం యేసు క్రీస్తు పునుర్ధానముతో మనకు నిరీక్షణ కలిగించాడు.

యేసుక్రీస్తు మృతిపొంది పునర్ధానుడై లేపబడనియెడల మేము చేయుచున్న సువార్త ప్రకటన, క్రైస్తవుల విశ్వాసము వ్యర్థమేనని (1కొ15:12-14)లో చెప్పబడింది. దేవుని నమ్మి విశ్వసించిన వారి ఆత్మ, దేవుని సన్నిదికి చేరుతుందని క్రైస్తవ సమాజం విశ్వాసం.

కోట బిపిన్ చంద్ర పాల్

డోర్ నెంబర్ 40-9/4-22,

ప్లాట్ నెంబర్- 66, మున్సిపల్ ఎంప్లాయిస్ కాలనీ

లబ్బీపేట, విజయవాడ-10,

సెల్ నెంబర్ 7337 489 410

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles