Friday, April 26, 2024

స్వస్థలాలకు చేరిన క్రికెట్ హీరోలు

  • వెంటాడుతున్న క్వారెంటెన్ కష్టాలు
  • జీవితమే క్వారెంటెన్ గా మారిన క్రికెటర్లు

కరోనా వైరస్ ఏ ముహూర్తాన మానవాళికి సోకిందో కానీ  ఏడాది కావస్తున్నా వదల బొమ్మాళీ..వదల అన్నట్లుగా ఇంకా వెంటాడుతూనే ఉంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి సగటు మనిషి వరకూ కరోనా కలవరంతో గజగజలాడి పోతున్నారు. దానికి భారత క్రికెట్ హీరోలు సైతం ఏమాత్రం మినహాయింపు కాదు. కరోనా పుణ్యమా అంటూ గత నాలుగు మాసాలుగా విదేశీగడ్డపై గడిపిన భారత క్రికెటర్ల దైనందిన జీవితంలో క్వారెంటెన్,  క్రిమిరహిత బయోబబుల్ అన్న పదాలు ఓ ప్రధాన భాగంగా మారిపోయాయి. గల్ఫ్ దేశాలు దుబాయ్, షార్జా, అబుదాబీ వేదికగా రెండుమాసాలపాటు సాగిన ఐపీఎల్ 13వ సీజన్ పోటీలలో పాల్గొనటానికి రెండువారాలు ముందుగానే భారత క్రికెటర్లు ఆయా వేదికలకు చేరి వారంరోజుల క్వారెంటన్ పాటించారు. ఐపీఎల్ మ్యాచ్ లు జరిగిన ఏడువారాలపాటు బాహ్యప్రపంచంతో సంబంధం లేకుండా విడిది చేసిన హోటెల్, మ్యాచ్ లు జరిగే స్టేడియాలలోని బయోబబుల్ వాతావరణంలో గడిపిన భారత క్రికెటర్లు దుబాయ్ నుంచి ఆస్ట్రేలియాలో రెండుమాసాల పర్యటనకు బయలు దేరి వెళ్లారు.

సహనానికి పరీక్ష క్వారంటైన్:

మనదేశంలో వారంరోజులపాటు మాత్రమే క్వారెంటెన్ పాటిస్తుంటే…ఆస్ట్ర్రేలియాలో మాత్రం 10 నుంచి 14 రోజుల క్వారెంటెన్ విధిగా పాటించేలా నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఒక నగరం నుంచి మరో నగరానికి లేదా ఒక రాష్ట్ర్రం నుంచి మరోరాష్ట్ర్రానికి వెళ్లినా క్వారెంటెన్ పాటించి తీరక తప్పని పరిస్థితిని భారత క్రికెటర్లు చవిచూశారు. మూడుమ్యాచ్ ల వన్డే, టీ-20 సిరీస్ ల తర్వాత జరిగిన నాలుగుటెస్టుల సిరీస్ ను నాలుగు ప్రధానవేదికల్లో నిర్వహించడం భారత క్రికెటర్ల సహనానికి పరీక్షగా నిలిచింది. అడిలైడ్ ఓవల్ వేదికగా జరిగిన డే-నైట్ టెస్టు కు ముందే భారత బృందం క్వారెంటెన్ పాటించింది. మెల్బోర్న్, సిడ్నీ, బ్రిస్బేన్ నగరాలు వేదికగా జరిగిన ఆఖరి మూడు టెస్టులకు ముందు సైతం భారతజట్టు సభ్యులు క్వారెంటెన్ పాటించారు. దీనికితోడు న్యూసౌత్ వేల్స్, క్వీన్స్ లాండ్ రాష్ట్ర్రప్రభుత్వాలు క్వారెంటెన్ నిబంధనలను తూచతప్పక పాటించేలా చర్యలు తీసుకొన్నాయి.కరోనాకు మరో రూపం స్టెయిన్ భయంతో ఆస్ట్ర్రేలియా మరిన్ని జాగ్రత్త చర్యలు తీసుకొంది. ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లినా క్వారెంటెన్ పాటించితీరాల్సిందేనని స్థానిక ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.

రూమ్ సర్వీస్ బంద్:

మూడో టెస్ట్ మ్యాచ్ వేదిక సిడ్నీ నుంచి ఆఖరిటెస్టు వేదిక బ్రిస్బేన్ చేరిన భారత క్రికెటర్ల బృందానికి చేదుఅనుభవం ఎదురయ్యింది. విడిదికి ఏరాటు చేసిన స్టార్ హోటల్ లో రూమ్ సర్వీస్, జిమ్,స్విమ్మింగ్ పూల్ సదుపాయాలను సైతం నిలిపి వేశారు. ఆటగాళ్లకు హోటెల్ లోని వేర్వేరు అంతస్తుల్లో రూమ్ లు కేటాయించడం, ఒకే చోటు చేరి భోజనం చేసే సదుపాయం సైతం లేకుండా చేయడంతో భారత టీమ్ మేనేజ్ మెంట్ తీవ్రఅసంతృప్తి వ్యక్తం చేయడంతో అక్కడి ప్రభుత్వం దిగి వచ్చింది. నిబందనలను భారత క్రికెటర్ల విషయంలో స్వల్పంగా సడలించింది.

స్వదేశంలోనూ క్వారెంటైన్:

బ్రిస్బేన్ టెస్టుతో పాటు సిరీస్ ను విజయవంతంగా ముగించి…దుబాయ్ మీదుగా ప్రత్యేక విమానంలో స్వదేశం చేరిన ఆనందం ఎంతో సేపు నిలువలేదు.స్వస్థలాలకు చేరినా భారత క్రికెటర్లు హోం క్వారెంటైన్ పాటించి తీరాల్సిందేనని అధికారులు ఆదేశించారు. ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన వెంటనే క్రికెటర్లకు  ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ నిర్వ‌హించారు. క్వారంటైన్ నుంచి ఎవ‌రికీ మిన‌హాయింపు లేద‌ని, అంద‌ర‌కూ తప్పనిసరిగా ఇంట్లోనే ఉండాల‌ని బృహ‌న్ ‌ముంబయి కార్పొరేష‌న్ క‌మిష‌నర్  స్ప‌ష్టం చేశారు. బ్రిస్బేన్ నుంచి దుబాయ్ మీదుగా ముంబయి చేరిన భారత క్రికెటర్లు..అక్కడ నుంచి తమతమ స్వస్థలాలకు చేరారు. గత నాలుగుమాసాలుగా క్వారెంటైన్, బయోబబుల్ వాతావరణంలో గడిపి వచ్చిన భారత క్రికెటర్ల సహనం, ఓర్పులకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే మరి.

ఇదీ చదవండి:భారత క్రికెట్లో సరికొత్త చరిత్ర

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles