Wednesday, November 13, 2024

పళని ఆలయంలో నటరాజన్

  • మొక్కులు తీర్చుకొన్న భారత క్రికెటర్
  • అంతా దైవబలమే అంటున్న తమిళనాడు స్టార్

నెట్ బౌలర్ నుంచి టెస్ట్ బౌలర్ స్థాయికి ఎదిగిన భారత యువక్రికెటర్, తమిళనాడు యార్కర్ల కింగ్ తంగారసు నటరాజన్ దిండుగల్‌ జిల్లా పళనిలోని సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకొని తలనీలాలు సమర్పించడం ద్వారా మొక్కులు చెల్లించాడు.

క్రికెటర్ గా ఇప్పటి వరకూ తాను రాణించడానికి దైవబలమే కారణమని చెప్పాడు. గల్ఫ్ దేశాలు వేదికగా ముగిసిన ఐపీఎల్ 13వ సీజన్లో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు సభ్యుడిగా అంచనాలకు మించి రాణించిన నటరాజన్ ..నెట్ బౌలర్ గా ఆస్ట్ర్రేలియా పర్యటనకు ఎంపికయ్యాడు. అంతేకాదు కేవలం నెలరోజుల వ్యవధిలోనే టీ-20, వన్డే,టెస్ట్ ఫార్మాట్లలో భారతజట్టుకు ఎంపిక కావడం ద్వారా సత్తా చాటుకొన్నాడు.

Also Read : సునీల్ గవాస్కర్ కు అరుదైన కానుక

Cricketer T Natarajan visits Palani temple, gets his head tonsured

బ్రిస్బేన్ టెస్టులో భారతజట్టు సంచలన విజయం సాధించడంలో నటరాజన్ తనవంతుపాత్ర నిర్వర్తించాడు. భారత క్రికెట్ చరిత్రలోనే అతిస్వల్పకాలంలో మూడు ఫార్మాట్లలోను జాతీయజట్టుకు ప్రాతినిథ్యం వహించిన తొలి, ఏకైక క్రికెటర్ గా రికార్డు నెలకొల్పాడు.

Also Read : బీసీసీఐ కార్యదర్శికి అరుదైన గౌరవం

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరిగి వచ్చిన నటరాజన్ కు స్వగ్రామం చిన్నంపట్టిలో వందలాదిమంది గ్రామస్తులు జనరథంతో ఘనస్వాగతం పలికారు. ఆస్ట్ర్రేలియా పర్యటనతో తనజీవితమే మారిపోయిందని నటరాజన్ పొంగిపోతున్నాడు.

Cricketer T Natarajan visits Palani temple, gets his head tonsured

సేలం జిల్లా నుంచి దిండుగల్ జిల్లాలోని పళని ఆలయానికి చేరిన నటరాజన్ కు అభిమానులు స్వాగతం పలికారు. పోటీపడి మరీ తమ అభిమాన క్రికెటర్ తో సెల్ఫీలు దిగారు.

Also Read : దేశవాళీ టీ-20 లో టైటిల్ సమరం

రెక్కాడితే కానీ డొక్కాడని ఓ నిరుపేద కుటుంబం నుంచి అంతర్జాతీయ క్రికెటర్ స్థాయికి ఎదిగిన నటరాజన్ ..ఐపీఎల్ లో హైదరాబాద్ ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహిస్తూ సీజన్ కు 3 కోట్ల రూపాయలు చొప్పున ఆర్జిస్తున్నాడు. 

Also Read : 2020-21 రంజీ సీజన్ హుష్ కాకి

Also Read : భారత అంపైర్లకు భలే చాన్స్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles