Saturday, May 11, 2024

సంచారి తత్త్వాలు

                        —————————-

( From  ” The Wanderer” by KAHLIL GIBRAN)

(తెలుగు సేత: Dr.C.B. Chandra Mohan)

                     4. అంబరాలు

                     ——————–

      ఒకానొక రోజు ‘ సౌందర్యము ‘ మరియు   ‘అనాకారి ‘ ఒక  సముద్రపు  ఒడ్డున  కలుసు కున్నారు. ఇద్దరూ  సముద్రం లో  స్నానమాడడానికి

సిధ్ధ మయ్యారు.

      ఇద్దరూ  బట్టలు విప్పి,  నీళ్లలో  ఈదారు. కొంత

సేపటి తరువాత  ‘ అనాకారి ‘ ఒడ్డుకి వచ్చి  ‘సౌందర్యం’ బట్టలు వేసుకొని వెళ్ళిపోయింది.

      ‘సౌందర్యం’  కూడా  ఒడ్డుకి వచ్చి, తన దుస్తులు

లేకపోవడం చూసింది. నగ్నంగా ఉండడానికి సిగ్గు

పడింది. చేసేదేమీ లేక  ‘ అనాకారి వదిలి వెళ్ళిన

బట్టలు వేసుకొని  వెళ్లి పోయింది.

       అప్పటినుండి , ఈ రోజు వరకు జనమంతా

( ఆడా, మగా) — ‘ సౌందర్యము’, ‘ అనాకారి’లను, ఒకరిని చూసి మరొకరుగా  పొరపాటు పడుతూనే ఉన్నారు !

      ‘ సౌందర్యము’ యొక్క ముఖము  మునుపు చూ సిన కొంత మంది  మాత్రం ‘ అనాకారి ‘ బట్టల్లో ఉన్న

‘సౌందర్యాన్ని ‘ గుర్తించ గలిగారు. అలాగే , ‘ సౌందర్యం ‘ దుస్తుల్లో ఉన్న ‘ అనాకారి ‘ రూపం కొంతమందిని  మోసం   చెయ్యలేక పోయింది.

Dr. C. B. Chandra Mohan
Dr. C. B. Chandra Mohan
మనుషుల్నీ, జీవితాల్నీ, సాహిత్యాన్నీ ప్రేమించేవాళ్ళు మంచి రచయితలు కాగలుగుతారు. ఇన్నిమంచి లక్షణాలూ పుష్కలంగా ఉన్న అరుదైన రచయిత డాక్టర్ సీబీ చంద్రమోహన్. మొబైల్ 9440108149

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles