Thursday, December 8, 2022

Dr N.Gopi

39 POSTS0 COMMENTS
ప్రముఖ కవి, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ కులపతి

అడుగులు

   మబ్బులు ఉలిక్కిపడ్డయ్ కోవిడ్ డేగ నేలకు చూపులు సారించింది. కనిపించని తీగల్లా అవి భూమిని చుట్టుముట్టినై. నిన్నటి దాకా పృథ్విని శ్రామిక ప్రేమతో నింపిన చేతులు ఒక్కసారిగా ముడుచుక పోయినై. ఈ భయద ప్రాంతాన్ని విడిచి ఎకాయెకిన నిష్క్రమిస్తున్నై. ఇంటి పక్కల ఇంటి వాళ్లలా తిరిగిన ఈ ఆప్యాయపు ముద్దలు ఇప్పుడు అపరిచిత...

వంటిల్లు

నేను భోజన ప్రియుణ్నే కాదు జనప్రియుణ్ని కూడా. తినేటప్పుడు ఎవరైనా తోడుండాలి. వంటింట్లో అన్నం ఉడుకుతుంటే ఆ చుట్టు పక్కల్నే పచారులు చేసేవాణ్ని వీడికి ఆకలెక్కువ అనేది మా అమ్మ. కొత్తిమీర సువాసన నాకిష్టం వాటి ఆకులు కళాత్మక రమ్యంగా కూడా వుంటాయి. వాటి నెవరో కత్తిరించి ట్రిమ్ చేశారన్నాడు...

శైలారోహణ– అమండా గోర్‌మన్

రానే వచ్చిందా రోజుమనలోకి మనంప్రశ్నల్ని సంధించుకునే రోజు.అంతులేని తిమిరావరణంలోవెలుగురేఖలను అందిపుచ్చుకునే రోజు. అవునుఇప్పటి దాకా వాటిల్లిననష్టాన్ని మోసుకుంటూఒక సముద్రాన్ని దాటడానికిసంకల్పం చెప్పుకునే రోజు. ఇప్పుడే మనం ధైర్యంగా ఒక మృగం పొట్టను పగులగొట్టాం....

స్ఫురణ

అక్షరాలు పదాలను నమ్ముకుంటాయి వాటిని మలినపర్చడం తగదు. భావనలు హృదయాలను అల్లుకుంటాయి నిరాధారం చెయ్యడం సబబు కాదు. ఈ నవప్రభాతం నిండా గులాబికాంతులు అలముకున్నాయి. వాటిని కలుషితం గావించడం ప్రకృతిని నిరాకరించడమే. కాలం వైశాల్యాన్ని దర్శించవచ్చునేమోగాని లోతును ఇంకా స్పృశించవలిసే వుంది. కొన్ని మాటలు మన ముందు నిలబడి కన్నీళ్లు పెడతాయి. నిస్సహాయతను నిర్లక్ష్యం...

స్తబ్ధకోశం

ఎప్పుడు పోతుందో ఈ కోవిడ్! ఎవరి చూపులూ స్థిరంగా లేవు ఎవరి బతుకులూ స్థిమితంగా లేవు కవిత్వం రాయక మూడు నెలలైంది భావుకలోకంలో దివాళా ప్రతి చిన్న కదలికా ఒక జల్‌జలా. ఎందరో మిత్రులు నిష్క్రమిస్తున్నారు ఏ నిజమూ హజం కావటం లేదు ఆర్థిక...

రైతు భారతం

రైతులకు చలేందివయా! అతని వొంటిని తాకి వేడెక్కింది. కోవిడ్ కోరలు పీకే వీరుడికి భయమేందివయా! పొలాలు వదిలి రోడ్డెక్కవలసి రావటమే దేశమంత విషాదం. వ్యాపారం పాముల్లా పాకి వస్తుంటే బడితె నందుకున్నోడికి జంకెందుకయా! విశ్లేషకులదే రోత వంకరటింకరల గీత సాదాసీదాగా సత్యం కనిపిస్తుంటే కొత్తగా చూపిస్తూ మీడియా మోత. ఢిల్లీ ఎప్పుడూ అంతే! హృదయ స్థానంలో...

అయ్యో!

నిజానికి నాలుగేళ్ళ క్రితమే చనిపోయాడు ఇవాళ సాంకేతికంగా డాక్టర్లు నిర్ధారించారు సహచరి మరణమే అతని చివరి ఊపిరి. ఒంటరితనం అలలు లేని సముద్ర మథనం. మా స్నేహం వయస్సు అర్ధశతాబ్దం ఇప్పుడది మనన నిశ్శబ్దం. నన్ను మొదటిసారి 'వేమనగోపి' అని పిలిచింది అతడే ప్రజాతంత్రలో మిత్రుల కవితలకు పట్టాభిషేకం కట్టాడు. శివుడు అతనికి తండ్రి కాని...
- Advertisement -

Latest Articles